శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 282 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 282 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 2 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀
🌻 282. 'సహస్రశీర్షవదనా' - 2 🌻
ఇట్లు మొత్తమేడు లోకము లేర్పడును. కావుననే ఈ మొత్తమును సంకేతించుటకు ఒకటి తరువాత 7 సున్నలు చేర్చుదురు. అదియే ఒక కోటి సంఖ్య. క్లుప్తముగ సహస్రము అని, విస్తారముగ కోటి యని మన వాజ్మయమున పేర్కొనుచుందురు. ఈ సున్నాలన్నిటికిని ఆధారము శ్రీదేవి. లోకమను పదమున, అందు వశించువారు, వాటి పాలకులు కూడ ఇమిడియున్నారు. ఇన్ని లోకములకు ముఖము, శిరస్సుయై శ్రీదేవి యున్నది.
'సహస్ర' అనునది సహస్రార పద్మ వైభవమును సూచించును. సహస్రార వర్ణనము బహువిస్తారము. 'సహస్ర' అనునది అత్యంత శక్తివంతమగు మంత్రము. రహస్యమగు మంత్రము. అంతరంగమున దివ్యానుగ్రహముగ తెలియబడు మంత్రము. ఈ మంత్రమును తెలిసినవారు సర్వ శక్తిమంతులు అగుదురు. సుదర్శన ఆయుధము వీరి సొత్తు అగును. అంబరీషాదులు ఈ మంత్రమును దర్శించిరి.
'స' అను శబ్దముతో పురుష సూక్తము ప్రారంభమగును (సహస్ర శీర్షా పురుషః), 'హ' అను శబ్దముతో శ్రీ సూక్తము ప్రారంభ మగును (హిరణ్య వర్ణాం). 'సహ' అను శబ్దము ప్రకృతి పురుషుల సమాగమ శబ్దము. ఈ శబ్దముల మిశ్రమమే సోహం, హంస, హసౌం, హింస, సింహ ఇత్యాదివి. ప్రకృతి పురుషుల సమాగమమే సృష్టి రూపము. 'సహ' అను శబ్దము నుండి పుట్టు సృష్టినే 'స' అని పలుకుదురు. 'సహస్ర' శబ్దము అత్యంత వైభవోపేతమైన శబ్దము. ఇంకనూ వివరించుట కిచట తావు లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |
sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀
🌻 Sahasra-śīrṣa-vadanā सहस्र-शीर्ष-वदना (282) - 2 🌻
The Brahman has no form and therefore has no sensory organs. The Brahman can be explained in two ways; one is by negation and the other by affirmation. These nāmas explain the Brahman by affirmations.
These descriptions are called cosmic intelligence, hence beyond human comprehension Mahānārāyaṇa Upaniṣad (I.13) says “He (the Brahman) became the possessor of the eyes, faces, hands and feet of all creatures in every part of the universe (विस्व्तश्च्क्ष् विश्व्तोमुखः)”.
Thus, the Upaniṣad confirms that the Brahman exists in every living being of this universe. Puruṣasūkta also says ‘Puruṣa (the Brahman) has thousands of heads, thousands of eyes, thousands of feet’. Each element of universal creation is individualized Cosmic Consciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment