25-JUNE-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 217🌹  
2) 🌹. శివ మహా పురాణము - 417🌹 
3) 🌹 Light On The Path - 164🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -45🌹  
5) 🌹 Osho Daily Meditations - 34🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 94 / Lalitha Sahasra Namavali - 94🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 94 / Sri Vishnu Sahasranama - 94🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -217 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 6 -2

*🍀 5-2. ఉత్తమ భావములు - చిత్త మందలి బలమగు సంస్కారములే తదనుగుణమగు భావములను సృజింప జేసి ఆ యా మార్గములలో నడిపించును. చిత్తమున ఏర్పడు బలమగు సంస్కారమే కామము. దానివలననే లోకములందలి జీవులందరును నడిపింప బడుచున్నారు. దైవకామ మేర్పడుట, ధర్మకామ మేర్పడుట వలన దైవమును చేరుట ఎట్లో, అట్లే ఇతర కామములు జీవులను ఆయా గతులలో నడిపించుచున్నవి. కనుక సాధకులు తమ చిత్త మందలి సంస్కారములను పరిశీలించుకొని, అను నిత్యము ఉత్తమ సంస్కారములకై కృషి సలుపవలెను. 🍀*

యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కలేబరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 6

తాత్పర్యము : 
దేహము త్యజించు సమయమున ఎవరెవరు ఏయే భావములను స్మరింతురో అట్టి భావముల లోనికే చను చుందురు.

వివరణము : 
చిత్త మందలి బలమగు సంస్కారములే తదనుగుణమగు భావములను సృజింప జేసి ఆయా మార్గములలో నడిపించును. 

సత్యకాముడైనను, ధర్మకాముడైనను, ధనకాముడైనను, కీర్తికాముడైనను, స్త్రీ కాముడైనను ఇట్లే బలీయముగ వారి బలమగు కామముచే ఈడ్చుకొని పోబడుచున్నారు. చిత్తమున ఏర్పడు బలమగు సంస్కారమే కామము. దానివలననే లోకములందలి జీవులందరును నడిపింప బడుచున్నారు. దైవకామ మేర్పడుట, ధర్మకామ మేర్పడుట వలన దైవమును చేరుట ఎట్లో, అట్లే ఇతర కామములు జీవులను ఆయా గతులలో నడిపించుచున్నవి. 

కనుక సాధకులు తమ చిత్త మందలి సంస్కారములను పరిశీలించుకొని, అను నిత్యము ఉత్తమ సంస్కారములకై కృషి సలుపవలెను. ఉత్తమోత్తమ సంస్కారము, ఉత్తమోత్తమ లోకములకు చేర్చగలదు. నిత్యము ఆత్మ పరిశీలనము గావించుచు చిత్తమందలి ఉత్తమ భావములకు కార్యాచరణ పథక మేర్పరచుకొనుట పరిష్కారమై యున్నది.  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 417🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 24

*🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని ఈ మాటలను విని దేవతలందరు ఆనందముతో నిండినవారై, శంభునకు విన్నవించు కొరకై విష్ణువు యొక్క ముఖము వైపునకు చూచిరి (11). అపుడు మహాభక్తుడు, దేవతలకు మేలు చేయువాడునగు విష్ణువు గొప్ప దేవకార్యమును సాధింపగోరి నేను చెప్పిన ఈ మాటలను పలికెను (12). హే శంభో! తారకుడు దేవతలకు పరమాశ్చర్యకరమగు పద్ధతిలో తీవ్రవేదనలను కలిగించుచున్నాడు. ఆ సంగతిని విన్నవించుటకై దేవతలందరు ఇచటకు వచ్చియున్నారు (13). హే శంభో! నీనుండి జన్మించిన నీ కుమారుని చేతిలో మాత్రమే ఈ తారకాసురుడు హతుడగును. నామాట తప్పు గాదు (14).

ఓ మహాదేవా! నీవీ విషయమును విమర్శించి దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! ఓ స్వామీ! తారకుడు కలిగించిన కష్టములనుండి దేవతలను ఉద్ధరించుము (15). హే దేవా! శంభో! కావున నీవు నీ కుడిచేతితో పార్వతిని స్వీకరించవలెను. పర్వతరాజు సమర్పించగా మహాపతివ్రతయగు ఆమెను పాణి గ్రహణము చేయుము (16). విష్ణువు యొక్క మాటలను విని శివుడు ప్రసన్నుడాయెను. యోగ నిష్ఠుడగు శివుడు వారందరికీ మంచి మార్గమును చూపుచున్నవాడై ఇట్లు పలికెను (17).

శివుడిట్లు పలికెను-

నేను సర్వాంగ సుందరియగు పార్వతీ దేవిని స్వీకరించిన వాడు దేవతలు, దిక్పాలకులు, మునులు, ఋషులు అందరు (18) కోరిక తీరిన వారు కాగలరు. కాని వారు మోక్ష మార్గమునందు సమర్థులు కాజాలరు. పాణిగ్రహణ మాత్రముచే ఆ దుర్గ మన్మథుని జీవింపచేయగలదు (19). హే విష్ణో! అందరి కార్యము సిద్ధించుట కొరకై బ్రహ్మ యొక్క వచనముననుసరించి నేను మన్మథుని దహించితిని. ఈ విషయములో నీవు విమర్శ చేయకుము (20). ఏది కర్తవ్యము, ఏది కాదు అను వ్యవస్థను చేయుటలో వివేకి మనస్సులో చక్కగా విమర్శను చేయవలెను. ఓ దేవేంద్రా! నీవు దేవతలందరితో గూడి హఠమును చేయదగదు (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 164 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 Regard the three truths. They are equal. - 1 🌻*

586. This line is preceded by a triangle which is used as a kind of signature of Him who wrote it. It is done here to attract special attention.

587. The three truths to which the Master Hilarion refers are those which He Himself enunciated in another book which He dictated – The Idyll of the White Lotus – which has not received quite the attention which it deserves. It is an account of a previous life of His own, which He spent in Egypt when the great Egyptian religion was in its decadence and was no longer understood. Its splendid and impersonal worship had degenerated into the following of a goddess who demanded not so much perfect purity as perfect passion from her people, and so there was much corruption.

588. The Master, whose name at that time was Sensa, was a clairvoyant pupil in an Egyptian temple. The priests of the temple recognized his value as a clairvoyant and as a medium, but did not wish him to teach true religion to the people, because that would have interfered with the existent ecclesiastical system, and eventually they killed him. In the course of the story, after going through many trials he found himself surrounded by a group of Adepts, among whom was his own Master, who then told him what to teach to the people – to those who had been misled by wrong teaching. 

They told him to preach broad truths only. We have the form in which the three great truths were then given. They are prefaced by the words: “There are three truths which are absolute and cannot be lost, but yet may remain silent for lack of speech.” That means they can never be lost because they are held by the Great Brotherhood, although they may not at a given time be known in the world because there is no one to speak them.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 45 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. తామసోపాసనము 🌻*

నిరంతర దీక్షలలో ఉన్నవారు, యజ్ఞయాగాదులు ఆచరించు వారు కూడ నిత్య జీవితమున పరిసర వ్యక్తుల యందు విరోధములు పెట్టుకొను వారు కలరు.

కోర్టులో శత్రువును గెలుచుటకై ఆంజనేయ మంత్రము జపించువారు కలరు.

తనను తిట్టినవాడు నశింపవలెనని ఒకడు మిరియములతో హోమము చేయును.

ఒక్కొక్కడు గంధపు చెక్కలతో , నేతితో హోమము చేయును. ద్రవ్యములు ఎంత మంచివైనను వైరము మనస్సున ఉన్నది కనుక అది తామసోపాసనము.

క్రీస్తును నమ్మనివారు పాపులని క్రీస్తు భక్తుడు ద్వేషించును. అతడెంత ప్రార్థన చేసినను మనస్సున ఉన్నది పాపులే గాని క్రీస్తు కాదు.

ఇట్టి భక్తి వలన లాభము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 34 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 LIFE IS SIMPLE 🍀*

*🕉 Life is very simple. Even trees are living it; it must be simple. Why has it become so complicated for us? Because we can theorize about it. 🕉*

To be in the thick of life, in the intensity and passion of life, you will have to drop all philosophies of life. Otherwise you will remain clouded in your words. Have you heard the famous anecdote about a centipede? It was a beautiful sunny morning, and the centipede was happy and must have been singing in her heart. She was almost drunk with the morning air. 

A frog sitting by the side was very puzzled-he must have been a philosopher. He asked, "Wait! You are doing a miracle. A hundred legs! How do you manage? Which leg comes first, which comes second, third---and so on, up to a hundred? Don’t you get puzzled? How do you manage? It looks impossible to me." 

The centipede said, "I have never thought about it. Let me brood." And standing there, she started trembling, and she fell down on the ground. She herself became so puzzled-a hundred legs! How was she going to manage? Philosophy paralyzes people. Life needs no philosophy, life is enough unto itself. It needs no crutches; it needs no support, no props. It is enough unto itself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 94 / Sri Lalita Sahasranamavali - Meaning - 94 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।*
*శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀*

🍀 442. కుమార గణనాథాంబా - 
కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది.

🍀 443. తుష్టిః - 
తృప్తి, సంతోషముల రూపము.

🍀 444. పుష్టిః - 
సమృద్ధి స్వరూపము.

🍀 445. మతిః - బుద్ధి

🍀 446. ధృతిః - ధైర్యము.

🍀 447. శాంతిః - 
తొట్రుపాటు లేని నిలకడతనము గలది.

🍀 448. స్వస్తిమతీ - 
మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.

🍀 449. కాంతిః - కోరదగినది.

🍀 450. నందినీ = ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.

🍀 451. విఘ్ననాశినీ - 
విఘ్నములను నాశము చేయునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 94 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 94. kumāra-gaṇanāthāmbā tuṣṭiḥ puṣṭir matir dhṛtiḥ |*
*śāntiḥ svastimatī kāntir nandinī vighnanāśinī || 94 || 🌻*

🌻 442 ) Kumara gana nadambha -   
She who is mother to Ganesha and Subrahmanya

🌻 443 ) Thushti -   
She who is personification of happiness

🌻 444 ) Pushti -   
She who is personification of health

🌻 445 ) Mathi -   
She who is personification of wisdom

🌻 446 ) Dhrithi -   
She who is personification of courage

🌻 447 ) Santhi -   
She who is peaceful

🌻 448 ) Swasthimathi -   
She who always keeps well

🌻 449 ) Kanthi -   
She who is personification of light

🌻 450 ) Nandhini -   
She who is personification of Nadhini daughter of Kama denu

🌻 451 ) Vigna nasini -   
She who removes obstacles

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 94 / Sri Vishnu Sahasra Namavali - 94 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*శతభిషం నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 94. విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |*
*రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ‖ 94 ‖ 🍀*

 🍀 876) విహాయన గతి: - 
ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.

🍀 877) జ్యోతి: - 
తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింప చేయువాడు.

🍀 878) సురుచి: - 
అందమైన ప్రకాశము గలవాడు.

🍀 879) హుతభుక్ - 
యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.

🍀 880) విభు: - 
సర్వ లోకములకు ప్రభువైనవాడు.

🍀 881) రవి: - 
తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.

🍀 882) విలోచన: - 
వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.

🍀 883) సూర్య: - 
ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.

🍀 884) సవితా: - 
సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.

🍀 885) రవిలోచన: - 
సూర్యుడు నేత్రములుగా కలవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 94 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Sathabisham 2nd Padam* 

*🌻 94. vihāyasagatirjyōtiḥ surucirhutabhugvibhuḥ |*
*ravirvirōcanaḥ sūryaḥ savitā ravilōcanaḥ || 94 || 🌻*

🌻 876. Vihāyasa-gatiḥ: 
One who is the support of Vishupada.

🌻 877. Jyotiḥ: 
One who is the light of self-luminous consciousness that reveals oneself as well as other things.

🌻 878. Suruciḥ: 
The Lord whose Ruchi i.e. brilliance or will, is of an attractive nature.

🌻 879. Hutabhuk: 
One who eats, that is, receives, whatever is offered to whatever deities (Devas) in all sacrifices.

🌻 880. Vibhuḥ: 
One who dwells everywhere. Or one who is the master of all the three worlds.

🌻 881. Raviḥ: 
One who absorbs all Rasas (fluids) in the form of the Sun.

🌻 882. Virōcanaḥ: 
One who shines in many ways.

🌻 883. Sūryaḥ: 
One who generates Shri or brilliance in Surya. Or Agni (Fire) is what is called Surya.

🌻 884. Savitā: 
One who brings forth (Prasava) all the worlds.

🌻 885. Ravi-lōcanaḥ: 
One having the sun as the eye.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment