మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 45


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 45 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. తామసోపాసనము 🌻

నిరంతర దీక్షలలో ఉన్నవారు, యజ్ఞయాగాదులు ఆచరించు వారు కూడ నిత్య జీవితమున పరిసర వ్యక్తుల యందు విరోధములు పెట్టుకొను వారు కలరు.

కోర్టులో శత్రువును గెలుచుటకై ఆంజనేయ మంత్రము జపించువారు కలరు.

తనను తిట్టినవాడు నశింపవలెనని ఒకడు మిరియములతో హోమము చేయును.

ఒక్కొక్కడు గంధపు చెక్కలతో , నేతితో హోమము చేయును. ద్రవ్యములు ఎంత మంచివైనను వైరము మనస్సున ఉన్నది కనుక అది తామసోపాసనము.

క్రీస్తును నమ్మనివారు పాపులని క్రీస్తు భక్తుడు ద్వేషించును. అతడెంత ప్రార్థన చేసినను మనస్సున ఉన్నది పాపులే గాని క్రీస్తు కాదు.

ఇట్టి భక్తి వలన లాభము లేదు.

🌹 🌹 🌹 🌹 🌹


25 Jun 2021

No comments:

Post a Comment