నిర్మల ధ్యానాలు - ఓషో - 35


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 35 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభినందించడం ఎలాగో మనకు తెలిస్తే ప్రతిదీ ఒక బహుమానమే. 🍀


జీవితమొక బహుమానం. జన్మ ఒక బహుమతి. ప్రేమ ఒక బహుమతి. మరణమొక బహుమానం. అభినందించడము ఎలాగో మనకు తెలిస్తే ప్రతిదీ ఒక బహుమానమే. అభినందించడం మనకు తెలియకుంటే మనం జీవితమంతా ఆరోపణలు చేస్తూ, తప్పులు తవ్వుకుంటూ గడిపేస్తాం.

మనుషుల్లో రెండు రకాల వాళ్ళున్నారు. మొదటి రకం అభినందించడం తెలిసినవాళ్ళు. ప్రతిదానిలో సౌందర్యాన్ని అభినందించగలిగే వాళ్ళు. వాళ్ళకు అందిన ప్రతిదానిలో అందాన్ని చూడగలిగేవాళ్ళు. రెండవ రకం అభినందించే తత్వం లేని వాళ్ళు. అభినందించడం తెలియని వాళ్ళు ఎప్పుడూ ఖండిస్తూ వుంటారు. విమర్శిస్తు వుంటారు. తప్పులు వెతుకుతూ వుంటారు. యింకా యింకా కావాలని అడుగుతూ వుంటారు.

మొదటిరకం మనుషులు మతమున్న మనుషులు. రెండో రకం వాళ్ళకి మతముండదు. రెండోరకం వాళ్ళు మందో వెనకో దేవుణ్ణి కాదంటారు. ఎందుకంటే దేవుడు ఎవరి కోరికల్ని తీర్చాడో వాళ్ళకు శత్రువవుతాడు. అందుకనే తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్న సామెత ఏర్పడింది. ఈ సామెత మతం లేని మనుషుల కోసం ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళెప్పుడూ అసహనంగా వుంటారు. చిరాకు పడుతూ వుంటారు. జరుగుతున్న ప్రతిదీ తప్పంటారు. లోపాలు వెతకుతారు. వాళ్ళకెప్పుడూ సంతృప్తి అన్నదుండదు. వాళ్ళు ఎంత దుఖంఃలో వుంటారంటే, కష్టంలో వుంటారంటే ఎంత కక్షతో, కార్పణ్యంతో వుంటారంటే తమ నించీ ఎవరో ఏదో లాక్కుపోతున్నారను కుంటారు. అట్లాంటి వాళ్ళకు కృతజ్ఞత ఎట్లా వుంటుంది? కృతజ్ఞత లేని దగ్గర ప్రార్థన వుండదు. ప్రార్థన లేని దగ్గర మతముండదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


24 Jun 2021

No comments:

Post a Comment