దేవాపి మహర్షి బోధనలు - 105
🌹. దేవాపి మహర్షి బోధనలు - 105 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 86. తారణ మార్గము 🌻
మైత్రేయ మహర్షికి స్త్రీలపై గల విశ్వాసము పురుషులపై లేదు. సర్వ సమస్యలకు ఆయన దృష్టిలో స్త్రీయే పరిష్కారము. మానవ జాతియందు స్త్రీలకు గల సంస్కారము జాతి సంస్కారముగ ప్రతిబింబించును. సంఘమున స్త్రీకి గల గౌరవమే సంఘ గౌరవముగ ప్రతిబింబించును. స్త్రీ పవిత్రతయే జాతి పవిత్రత. సత్సంతతి కలుగవలెనన్నచో మాతృమూర్తి పవిత్రమూర్తియై యుండవలెను. స్త్రీలు సంస్కరింప బడినచో జీవసంస్కారము సుగమమగును.
కశ్యప ఋషి తండ్రియైనను దితికి దైత్యులు పుట్టినారు. అదితికి ఆదిత్యులు పుట్టినారు. కద్రువకు పాములు పుట్టినవి. వినతకు విహంగములు పుట్టినవి. సత్సంతతికి స్త్రీ సంస్కారము ఎంత ప్రాముఖ్యమో ఈ కథల వలన తెలియును. మైత్రేయుడు స్త్రీ ఆరాధకుడు. ఆయన జీవ పరిణామమునకై శైలపుత్రి నారాధించిరి. ఆమె ననుసరించిరి. స్త్రీ ఆరాధన ఒక విధముగ మైత్రేయ మార్గమే.
స్త్రీని నొప్పించినచో పరిణామములు అధికముగ నుండునని తెలియవలెను. స్త్రీని మెప్పించినచో ఫలములధికములని కూడ తెలియవలెను. సృష్టిని అధిష్ఠించి యున్నది జగన్మాతయే. పరమాత్మ సైతము ప్రత్యక్షమగుటకు జగన్మాత రూపమునే ఆశ్రయించవలెను. తారణమునకు మాతయే యుపాయము. అట్లు కానిచో మాయయే మిగులును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
28 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment