🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 283 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 283 - 2 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀
🌻 283. 'సహస్రాక్షీ' - 2 🌻
'సహస్రాక్షి' అనగా అక్షములే కాక కన్నులు కూడ కలది, అనగా ఆమెయే లోకసాక్షి అని అర్థము. శ్రీమాత, శ్రీమహా విష్ణువు ప్రతి జీవి లోపల వెలుపల కూడ నిండియుండి జరుగుచున్న సమస్తమును దర్శించుచు నుందురు.
అసురులు నిర్వర్తించు రహస్యాత్మకమగు చర్యలను కూడ వారిలో నుండియే గమనింతురు. అన్నిట నిండియున్న చైతన్యము అన్నిటినీ గమనించుచునే యుండును. ఎవ్వరునూ చూచుట లేదనుకొని చేయు పనులు, పలుకు మాటలు, ఆలోచనలు, లోనుండి దైవము చూచుచున్నాడు, అని తెలిసినవాడు తెలిసినవాడు. ఇది తెలియని వారు తెలియని వారు. దైవముకడ రహస్యము లేమియు లేవు. తటస్థ స్థితి దైవస్థితి.
జీవుడు తటస్థ స్థితిని చేరినచో తానునూ దైవమువలె సాక్షీభూతుడు కాగలడు. యోగవిద్య ఉపదేశించు సమవర్తన మిదియే. ఇతరులు రజస్తమస్సులకు గురియై ధర్మాధర్మ పోరాటమున చిక్కుకుందురు. సాక్షీ స్థితి పొందుట యనగా తాను అక్షర స్వరూపము అని ఎరిగి క్షర స్వరూపముతో విడివడి యుండుట. ఇట్టి స్థితిలో క్షర పురుషుని చేతలు అక్షరుని అంటవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 283 - 2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |
sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀
🌻 Sahasrākṣī सहस्राक्षी (283)🌻
She has thousands of eyes. Viṣṇu Sahasranāma 226 also conveys the same meaning.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 Jun 2021
No comments:
Post a Comment