28-JUNE-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-56 / Bhagavad-Gita - 1-56 - 2 - 9🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 624 / Bhagavad-Gita - 624 - 18-35🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 435, 436 / Vishnu Sahasranama Contemplation - 435, 436🌹
4) 🌹 Daily Wisdom - 132🌹
5) 🌹. వివేక చూడామణి - 94🌹
6) 🌹Viveka Chudamani - 94🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 105🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 37🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 283-2/ Sri Lalita Chaitanya Vijnanam - 283-2🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 56 / Bhagavad-gita - 56 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 9 🌴

9. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ: పరన్తప: |
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ ||

తాత్పర్యం :
సంజయుడు పలికెను: శత్రువులను తపింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి, పిదప శ్రీకృష్ణునితో “ గోవిందా! నేను యుద్దమును చేయను” అని పలికి మౌనమును వహించెను.

భాష్యము :
యుద్ధమాచరించుటకు బదులు అర్జునుడు యుద్ధరంగమును వీడి భిక్షాటనను స్వీకరింపనున్నాడని అవగతము చేసికొని ధృతరాష్ట్రుడు మిక్కిలి మదమంది యుండవచ్చును. కాని అర్జునుడు తన శత్రువులను వధింప సమర్థుడని (పరంతపుడు) పలుకుచు సంజయుడు అతనిని నిరాశపరచెను. బంధుప్రేమ కారణముగా అర్జునుడు కొలది సమయము మిథ్యా శోకతప్తుడైనను శిష్యుని వలె దివ్యగురువైన శ్రీకృష్ణుని శరణుపొందెను. 

వంశానురాగము వలన కలిగిన మిథ్యా శోకము నుండి అతడు శీఘ్రమే ముక్తిని పొందగలడనియు మరియు ఆత్మానుభవపు (కృష్ణభక్తిరసభావనము) పూర్ణజ్ఞానముచే జ్ఞానవంతుడు కాగాలడనియు ఇది సూచించుచున్నది. పిదప అతడు నిక్కముగా యుద్ధమున పాల్గొనగలడు. అనగా శ్రీకృష్ణుని జ్ఞానమును బడసి అర్జునుడు విజయము సాధించు వరకు యుద్ధము చేయనున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిశ్చయముగా నిరాశగా మారగలదు.

🌹 Bhagavad-Gita as It is - 56 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 9 🌴

9. sañjaya uvāca
evam uktvā hṛṣīkeśaṁ
guḍākeśaḥ paran-tapaḥ na yotsya iti govindam
uktvā tūṣṇīṁ babhūva ha

Translation : Sañjaya said: Having spoken thus, Arjuna, chastiser of enemies, told Kṛṣṇa, “Govinda, I shall not fight,” and fell silent.

Purport :
Dhṛtarāṣṭra must have been very glad to understand that Arjuna was not going to fight and was instead leaving the battlefield for the begging profession. But Sañjaya disappointed him again in relating that Arjuna was competent to kill his enemies (paran-tapaḥ). Although Arjuna was, for the time being, overwhelmed with false grief due to family affection, he surrendered unto Kṛṣṇa, the supreme spiritual master, as a disciple. 

This indicated that he would soon be free from the false lamentation resulting from family affection and would be enlightened with perfect knowledge of self-realization, or Kṛṣṇa consciousness, and would then surely fight. Thus Dhṛtarāṣṭra’s joy would be frustrated, since Arjuna would be enlightened by Kṛṣṇa and would fight to the end
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 624 / Bhagavad-Gita - 624 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 35 🌴*

35. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముఞ్చతి దుర్మేధా ధృతి: సా పార్థ తామసీ ||

🌷. తాత్పర్యం : 
ఓ పార్థా! ఒక స్వప్నము, భయము, శోకము, విషాదము, భ్రాంతి యనువానిని దాటలేనటువంటి మందబుద్ధితో కూడిన నిశ్చయము తమోగుణమునకు సంబంధించినట్టిది.

🌷. భాష్యము :
సత్త్వగుణప్రదానుడైనవాడు స్వప్నమును పొందడని భావింపరాదు. ఇచ్చట స్వప్నమనగా అధికనిద్ర యని అర్థము. స్వప్నము సహజమై యున్నందున సత్త్వరజస్తమో గుణములన్నింటి యందును కలుగుచుండును. 

కాని అధికనిద్రను నివారింపజాలనివారు, విషయభోగములను అనుభవించుచున్నామనెడి గర్వమును వీడలేనివారు, భౌతికప్రకృతిపై ఆధిపత్యమనెడి స్వప్నమును కలిగియుండువారు, ఇంద్రియమనోప్రాణములను తద్రీతిగనే నియుక్తము చేయువారు తమోగుణప్రదానమైన నిశ్చయము (ధృతి) కలిగినవారుగా పరిగణింపబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 624 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 35 🌴*

35. yayā svapnaṁ bhayaṁ śokaṁ
viṣādaṁ madam eva ca
na vimuñcati durmedhā
dhṛtiḥ sā pārtha tāmasī

🌷 Translation : 
And that determination which cannot go beyond dreaming, fearfulness, lamentation, moroseness and illusion – such unintelligent determination, O son of Pṛthā, is in the mode of darkness.

🌹 Purport :
It should not be concluded that a person in the mode of goodness does not dream. Here “dream” means too much sleep. Dreaming is always present; either in the mode of goodness, passion or ignorance, dreaming is a natural occurrence. 

But those who cannot avoid oversleeping, who cannot avoid the pride of enjoying material objects, who are always dreaming of lording it over the material world, and whose life, mind and senses are thus engaged, are considered to have determination in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 435, 436 / Vishnu Sahasranama Contemplation - 435, 436 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻435. అనిర్విణ్ణః, अनिर्विण्णः, Anirviṇṇaḥ🌻*

*ఓం అనిర్విణ్ణాయ నమః | ॐ अनिर्विण्णाय नमः | OM Anirviṇṇāya namaḥ*

శ్రీహరేరాప్తకామత్వాన్నిర్వేదోఽస్య న విద్యతే ।
ఇత్యేవ భగవాన్ విష్ణు రనిర్విణ్ణ ఇతీర్యతే ॥

నిర్విణ్ణుడై ఎంత కాలము ఇట్లుండవలయునో కదా అను నిర్వేదమును పొందెడివాడు కాడు. పరమాత్ముడు తాను ఎల్ల కోరికల ఫలములను పొందిన ఆనంద స్వరూపుడు కావున ఆతనికి నిర్వేదము కలుగు అవకాశమే లేదు. ఈ కారణమున ఆ శ్రీ మహా విష్ణువు అనిర్విణ్ణుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 435🌹*
📚. Prasad Bharadwaj

🌻435. Anirviṇṇaḥ🌻*

*OM Anirviṇṇāya namaḥ*

Śrīharerāptakāmatvānnirvedo’sya na vidyate,
Ityeva bhagavān viṣṇu ranirviṇṇa itīryate.

श्रीहरेराप्तकामत्वान्निर्वेदोऽस्य न विद्यते ।
इत्येव भगवान् विष्णु रनिर्विण्ण इतीर्यते ॥

The one who longs for a better change from current state is Niriviṇṇaḥ. Being of fulfilled desires and is never heedless because He is ever self-fulfilled, Lord Viṣṇu is Aniriviṇṇaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम् ।अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥

విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥

Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam ।Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 436 / Vishnu Sahasranama Contemplation - 436🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻436. స్థవిష్ఠః, स्थविष्ठः, Sthaviṣṭhaḥ🌻*

*ఓం స్థవిష్ఠాయ నమః | ॐ स्थविष्ठाय नमः | OM Sthaviṣṭhāya namaḥ*

స్థవిష్ఠః, स्थविष्ठः, Sthaviṣṭhaḥ

స్థితో వైరాజరూపేణ స్థవిష్ఠ ఇతి కథ్యతే ।
యతోగ్నిర్ మూర్ధా చక్షుషీ చంద్రసూర్యా వితి శ్రుతిః ॥

మిక్కిలిగా లావయినవాడు. విరాట్ పురుష (వైరాజ) రూపమున స్థూల ప్రపంచాభిమానిగానున్నవాడు. 'అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్ర సూర్యౌ' (ముణ్డకోపనిషత్ 1.4) 'విరాట్పురుష రూపముననుండు పరమాత్మునకు అగ్నియే శిరము, చంద్ర సూర్యులు నేత్రములు' ఇత్యాది శ్రుతి ఇందులకు ప్రమాణము.

53. స్థవిష్ఠః, स्थविष्ठः, Sthaviṣṭhaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 436🌹*
📚. Prasad Bharadwaj

*🌻436. Sthaviṣṭhaḥ🌻*

*OM Sthaviṣṭhāya namaḥ*

Sthito vairājarūpeṇa sthaviṣṭha iti kathyate,
Yatognir mūrdhā cakṣuṣī caṃdrasūryā viti śrutiḥ.

स्थितो वैराजरूपेण स्थविष्ठ इति कथ्यते ।
यतोग्निर् मूर्धा चक्षुषी चंद्रसूर्या विति श्रुतिः ॥

One of huge propositions, because He is in the form of cosmic person. 'Agnirmūrdhā cakṣuṣī caṃdra sūryau' (Muṇḍakopaniṣat 1.4) / 'अग्निर्मूर्धा चक्षुषी चंद्र सूर्यौ' (मुण्डकोपनिषत् १.४) 'Agni or fire is His head, the moon and sun are His eyes' say the śruti.

53. స్థవిష్ఠః, स्थविष्ठः, Sthaviṣṭhaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 131 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 10. Questions are Usually Discussed under Metaphysics 🌻*

Philosophy conceived as metaphysics deals with an extensive reasoned discussion of the natures and the relations of God, world and the individual soul. The latter two are either identical in essence with God, or are attributes or parts of God, or are different from God. 

The ultimate Reality is either God, or the world of perception alone, or only the individual mind. God either exists or not, and is necessary or unnecessary for an explanation of experience. The world is either material or mental in nature; and consciousness is independent of or is dependent on matter. The world is either pluralistic or a single whole, and is real, ideal or unreal, empirical, pragmatic or rational. 

The individual is either free or bound. Questions of this nature are usually discussed under metaphysics. It also delineates the process of cosmogony and cosmology, the concepts of space, time and causation, creation, evolution and involution, as well as the presuppositions of eschatology or the discourse on the nature of life after death. 

The philosophical basis of modern physics and biology also can be comprised under metaphysics. Under epistemology the various theories and processes of the acquisition of right knowledge, as well as the nature and possibility of wrong knowledge, are discussed in detail.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 94 / Viveka Chudamani - 94🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 22. కోరికలు, కర్మలు - 4 🍀*

321. ప్రతి సాధకుడు ఎల్లపుడు బ్రహ్మా జ్ఞానాన్ని గూర్చిన స్థిరమైన వేగవంతమైన భావనలో అజాగ్రత్తగా ఉండకూడదు. బ్రహ్మ దేవుని కుమారుడైన సనత్‌ కుమారుడు ఏమరు పాటుగా ఉన్న ‘చావు’ ను కూడా పిలచినాడు. ఈ మాట రాజైన ధార్తరాష్ణునికి, సనత్‌ కుమారునికి మధ్య జరిగిన సంభాషణలో వ్యక్తపర్చినాడు. అనగా ఏమర పాటు కూడదని అర్థము. 

322. జ్ఞానికి తన యొక్క నిజమైన స్వభావానికి అజాగ్రత్త అనే గొప్ప ప్రమాదము ఉన్నది. ఈ అజాగ్రత్త వలన మాయ దాని వెనుక అహంభావముతోడై బంధనాలు తదుపరి దుఃఖాలకు కారణమవుతుంది. 

323. జ్ఞాని అయినప్పటికి భౌతిక వస్తువుల వెంటపడినట్లైన, బుద్ది వక్ర మార్గాన్ని బట్టి, తన భార్య యొక్క జ్ఞాపకాలు వెంటపడినట్లు అతనిని బ్రష్టుపట్టిస్తుంది. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 94 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 22. Desires and Karma - 4 🌻*

321. One should never be careless in one’s steadfastness to Brahman. Bhagavan Sanatkumara, who is Brahma’s son, has called inadvertence to be death itself.

322. There is no greater danger for the Jnanin than carelessness about his own real nature. From this comes delusion, thence egoism, this is followed by bondage, and then comes misery.

323. Finding even a wise man hankering after the sense-objects, oblivion torments him through the evil propensities of the Buddhi, as a woman does her doting paramour.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 105 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 86. తారణ మార్గము 🌻*

మైత్రేయ మహర్షికి స్త్రీలపై గల విశ్వాసము పురుషులపై లేదు. సర్వ సమస్యలకు ఆయన దృష్టిలో స్త్రీయే పరిష్కారము. మానవ జాతియందు స్త్రీలకు గల సంస్కారము జాతి సంస్కారముగ ప్రతిబింబించును. సంఘమున స్త్రీకి గల గౌరవమే సంఘ గౌరవముగ ప్రతిబింబించును. స్త్రీ పవిత్రతయే జాతి పవిత్రత. సత్సంతతి కలుగవలెనన్నచో మాతృమూర్తి పవిత్రమూర్తియై యుండవలెను. స్త్రీలు సంస్కరింప బడినచో జీవసంస్కారము సుగమమగును. 

కశ్యప ఋషి తండ్రియైనను దితికి దైత్యులు పుట్టినారు. అదితికి ఆదిత్యులు పుట్టినారు. కద్రువకు పాములు పుట్టినవి. వినతకు విహంగములు పుట్టినవి. సత్సంతతికి స్త్రీ సంస్కారము ఎంత ప్రాముఖ్యమో ఈ కథల వలన తెలియును. మైత్రేయుడు స్త్రీ ఆరాధకుడు. ఆయన జీవ పరిణామమునకై శైలపుత్రి నారాధించిరి. ఆమె ననుసరించిరి. స్త్రీ ఆరాధన ఒక విధముగ మైత్రేయ మార్గమే. 

స్త్రీని నొప్పించినచో పరిణామములు అధికముగ నుండునని తెలియవలెను. స్త్రీని మెప్పించినచో ఫలములధికములని కూడ తెలియవలెను. సృష్టిని అధిష్ఠించి యున్నది జగన్మాతయే. పరమాత్మ సైతము ప్రత్యక్షమగుటకు జగన్మాత రూపమునే ఆశ్రయించవలెను. తారణమునకు మాతయే యుపాయము. అట్లు కానిచో మాయయే మిగులును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 37 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ప్రార్థన బీజం కృతజ్ఞత. నువ్వు ఎంతగా ప్రార్థిస్తే అంతగా నీ దర్శన శక్తి పెరుగుతుంది.🍀*

ప్రార్ధన అన్నది మతానికి పునాది. ఒకసారి ప్రార్ధన ఆంతర్యాన్ని గ్రహిస్తే అది అస్తిత్వ అనుభవంగా అవతగమవుతుంది. ప్రార్థన బీజం కృతజ్ఞత. కారణం అస్థిత్వమన్నది గొప్ప బహుమానం. అది నిరంతరం నీ మీద వర్షిస్తోంది. కానీ మనం అది మన కోసమే అన్నట్లు అహంకరిస్తాం. మానవజాతి తెలివి తక్కువ అభిప్రాయాల్లో అదొకటి. మనసెప్పుడూ ఆ పని చేస్తూ వుంటుంది. అది అన్నీ తన కోసమే అనుకుంటుంది.

సూర్యోదయమవుతోంది. ఉదయం అపూర్వ సౌంధర్యంతో ధగధగలాడుతోంది. మనసు 'ఐతే ఏమిటి? యిది ప్రతిరోజు జరిగేదే. యిది కేవలం యింకో ఉదయం మాత్రమే. యిదీ అన్ని వుదయాల్లాంటిదే' అంటుంది. తూర్పు దిక్కంతా ఎర్రబడింది. సూర్యుడు వుదయిస్తున్నాడు. మేఘాలు వర్ణరంజితంగా వున్నాయి. 

మనసు "ఐతే ఏమిటి! యిక్కడ కొత్తదేముంది? లక్షలసార్లు జరిగింది. లక్షలసార్లు జరుగబోయేదీ యిదే. మనసు విషయాల్ని చూసే మార్గమిది. అది మొద్దుబారింది. సౌందర్యానికి, సంగీతానికి, కవిత్వానికి, ప్రేమకు అది స్పందించదు. విలువైన ప్రతి దానికి మనసు వ్యతిరేకం. ఫలితంగా నువ్వు చీకట్లో వుంటావు. అసహ్యంలో జీవిస్తావు. అదంతా నువ్వు చేసుకున్న సృష్ట. కృతజ్ఞతతో పొగిపొర్లు. అభినందనతో స్పందించు. 

ఉనికి నీకు యిచ్చిన దానికి ఆనందంతో తలవంచు. అది మరింత నీకు యిస్తుంది. నువ్వు ఎంతగా ప్రార్థిస్తే అంతగా నీ దర్శన శక్తి పెరుగుతుంది. ప్రార్థన తెలిసిన వ్యక్తికి ప్రతి అణువులో అస్తిత్వం దర్శనమిస్తుంది. ప్రతి దానిపై అస్తిత్వ సంతకాన్ని అతను చూస్తాడు. పవిత్ర గ్రంథాలు నిశ్శబ్దంగా వుంటాయి. ప్రవచనాలు పర్వతాల పైకి చేరుతాయి.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 283 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 283 - 2 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।*
*సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀*

*🌻 283. 'సహస్రాక్షీ' - 2 🌻* 

'సహస్రాక్షి' అనగా అక్షములే కాక కన్నులు కూడ కలది, అనగా ఆమెయే లోకసాక్షి అని అర్థము. శ్రీమాత, శ్రీమహా విష్ణువు ప్రతి జీవి లోపల వెలుపల కూడ నిండియుండి జరుగుచున్న సమస్తమును దర్శించుచు నుందురు. 

అసురులు నిర్వర్తించు రహస్యాత్మకమగు చర్యలను కూడ వారిలో నుండియే గమనింతురు. అన్నిట నిండియున్న చైతన్యము అన్నిటినీ గమనించుచునే యుండును. ఎవ్వరునూ చూచుట లేదనుకొని చేయు పనులు, పలుకు మాటలు, ఆలోచనలు, లోనుండి దైవము చూచుచున్నాడు, అని తెలిసినవాడు తెలిసినవాడు. ఇది తెలియని వారు తెలియని వారు. దైవముకడ రహస్యము లేమియు లేవు. తటస్థ స్థితి దైవస్థితి. 

జీవుడు తటస్థ స్థితిని చేరినచో తానునూ దైవమువలె సాక్షీభూతుడు కాగలడు. యోగవిద్య ఉపదేశించు సమవర్తన మిదియే. ఇతరులు రజస్తమస్సులకు గురియై ధర్మాధర్మ పోరాటమున చిక్కుకుందురు. సాక్షీ స్థితి పొందుట యనగా తాను అక్షర స్వరూపము అని ఎరిగి క్షర స్వరూపముతో విడివడి యుండుట. ఇట్టి స్థితిలో క్షర పురుషుని చేతలు అక్షరుని అంటవు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 283 - 2 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |*
*sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀*

*🌻 Sahasrākṣī सहस्राक्षी (283)🌻*

She has thousands of eyes. Viṣṇu Sahasranāma 226 also conveys the same meaning.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment