నిర్మల ధ్యానాలు - ఓషో - 37


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 37 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రార్థన బీజం కృతజ్ఞత. నువ్వు ఎంతగా ప్రార్థిస్తే అంతగా నీ దర్శన శక్తి పెరుగుతుంది.🍀


ప్రార్ధన అన్నది మతానికి పునాది. ఒకసారి ప్రార్ధన ఆంతర్యాన్ని గ్రహిస్తే అది అస్తిత్వ అనుభవంగా అవతగమవుతుంది. ప్రార్థన బీజం కృతజ్ఞత. కారణం అస్థిత్వమన్నది గొప్ప బహుమానం. అది నిరంతరం నీ మీద వర్షిస్తోంది. కానీ మనం అది మన కోసమే అన్నట్లు అహంకరిస్తాం. మానవజాతి తెలివి తక్కువ అభిప్రాయాల్లో అదొకటి. మనసెప్పుడూ ఆ పని చేస్తూ వుంటుంది. అది అన్నీ తన కోసమే అనుకుంటుంది.

సూర్యోదయమవుతోంది. ఉదయం అపూర్వ సౌంధర్యంతో ధగధగలాడుతోంది. మనసు 'ఐతే ఏమిటి? యిది ప్రతిరోజు జరిగేదే. యిది కేవలం యింకో ఉదయం మాత్రమే. యిదీ అన్ని వుదయాల్లాంటిదే' అంటుంది. తూర్పు దిక్కంతా ఎర్రబడింది. సూర్యుడు వుదయిస్తున్నాడు. మేఘాలు వర్ణరంజితంగా వున్నాయి.

మనసు "ఐతే ఏమిటి! యిక్కడ కొత్తదేముంది? లక్షలసార్లు జరిగింది. లక్షలసార్లు జరుగబోయేదీ యిదే. మనసు విషయాల్ని చూసే మార్గమిది. అది మొద్దుబారింది. సౌందర్యానికి, సంగీతానికి, కవిత్వానికి, ప్రేమకు అది స్పందించదు. విలువైన ప్రతి దానికి మనసు వ్యతిరేకం. ఫలితంగా నువ్వు చీకట్లో వుంటావు. అసహ్యంలో జీవిస్తావు. అదంతా నువ్వు చేసుకున్న సృష్ట. కృతజ్ఞతతో పొగిపొర్లు. అభినందనతో స్పందించు.

ఉనికి నీకు యిచ్చిన దానికి ఆనందంతో తలవంచు. అది మరింత నీకు యిస్తుంది. నువ్వు ఎంతగా ప్రార్థిస్తే అంతగా నీ దర్శన శక్తి పెరుగుతుంది. ప్రార్థన తెలిసిన వ్యక్తికి ప్రతి అణువులో అస్తిత్వం దర్శనమిస్తుంది. ప్రతి దానిపై అస్తిత్వ సంతకాన్ని అతను చూస్తాడు. పవిత్ర గ్రంథాలు నిశ్శబ్దంగా వుంటాయి. ప్రవచనాలు పర్వతాల పైకి చేరుతాయి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


28 Jun 2021

No comments:

Post a Comment