శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 273 / Sri Lalitha Chaitanya Vijnanam - 273


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 273 / Sri Lalitha Chaitanya Vijnanam - 273 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀

🌻 273. 'అనుగ్రహదా' 🌻


అనుగ్రహ మొసగునది శ్రీమాత అని అర్థము. అర్హతతో సంబంధములేక, ఎట్టి కారణము లేక ఇతరులకు శ్రేయస్సు కలిగించుట అనుగ్రహము. శ్రీదేవి అనుగ్రహ మట్టిది. సృష్టించుట, పునః సృష్టి చేయుట, మరల మరల విస్తారమగు సృష్టికార్యమును నిర్వర్తించుట శ్రీమాత తన కొలకు కాక, జీవుల కొఱకే చేయుచున్నది. చేయవలెనని నిర్బంధము లేదు. ఆమె నెవరునూ శాసించనూ లేరు. కేవలము జీవులు అనుభవము, అనుభూతి, పరిపూర్ణతలను పొందుటకొఱకే బహు విస్తారమైన సృష్టి నిర్మాణము చేయుచు నుండును. ఇది కేవలము అనుగ్రహమే.

జీవులను నిద్రనుండి మేల్కొలుపుట, నిద్రనొసగుట ఆమె అనుగ్రహమే. జీవులకు ఇచ్ఛా, జ్ఞాన క్రియల నొసగుట అనుగ్రహమే. భావనలు కలుగుట, భాషణ చేయుట ఆమె అనుగ్రహమే. పంచేంద్రియములు, మనసు, శరీరము మానవుల కొసగుట ఆమె అనుగ్రహమే. విచక్షణను, వైరాగ్యమును, సద్బుద్ధిని, సాన్నిధ్యమును ఇచ్చుట ఆమె అనుగ్రహమే. పంచభూతాదులు, గ్రహగోళాదులు, దేవతలు, అంతరిక్ష దేవతలు, దిక్పాలకులు వారి వారి ధర్మములను ఆమె ఆధారముగనే నిర్వర్తించుచున్నారు.

ప్రాణుల యందు ప్రాణ ప్రవృత్తులుగా వర్తించునది, నర్తించునది శ్రీమాతయే. ఆమె అనుగ్రహము లేనిదే క్షణమైన గడవదు. కాని జీవులహంకారులై దీనిని గుర్తించరు. గుర్తింపకున్ననూ ధిక్కరించిననూ కృతఘ్నత చూపిననూ అట్టివారియందు శ్రీమాత తన సాన్నిధ్యము నిచ్చుచున్నది. ఇంతకు మించిన అనుగ్రహము లేదు. 'అనుగ్రహదా' అను నామ మామెకే చెందినది. రక్షించుటతో పాటు శిక్షించుటతో కూడ జీవులను అనుగ్రహించుచునే యుండును. ఆమె శిక్షించుట కర్మ క్షాళనము కొఱకే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 273 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀

🌻 Anugrahadā अनुग्रहदा (273)🌻


The action of the gracious Sadāśiva, the blessing aspect for recreation is being referred. Anugraha means grace, promoting, etc. When the universe got dissolved, there exists nothing. The atoms of all the souls got compressed and embedded in the hiraṇyagarbha or the golden egg. The blessing aspect of the Brahman is the act of recreation after the dissolution. This act of recreation is done by Śaktī, the Supreme Mother. Sadāśivā form of the Brahman is endowed with compassion.

The importance of Guru is stressed in ancient scriptures. While worshipping Śrī cakra, Guru lineage is worshipped first. Guru is first worshipped in the form of praṇava (OM), then in the forms of Brahmā, Viṣṇu, Rudrā, Mahādeva and Sadāśiva. These five forms of the Brahman, discussed in the previous nāma-s are worshipped in the form of Guru.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jun 2021

No comments:

Post a Comment