వివేక చూడామణి - 102 / Viveka Chudamani - 102
🌹. వివేక చూడామణి - 102 / Viveka Chudamani - 102🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 23. ఆత్మ స్థితిని చేరుట - 3 🍀
345. ఖచ్చితమైన మంచి, చెడుల విచక్షణ వలన నేరుగా విషయము యొక్క సత్య స్వభావమును గ్రహించగలము. అపుడే బంధాలు తొలగి మాయ వలన ఏర్పడిన భ్రమలు వీడిపోయి మరల ఏ మార్పు లేకుండా, అతడు స్వేచ్ఛను పొందుతాడు.
346. జీవ బ్రహ్మముల ఏకత్వమును తెలిసిన జ్ఞానము వలన పూర్తిగా దట్టమైన అజ్ఞానమనే అడవిని ఛేదించి మాయను గుర్తించ గలుగుతాడు. ఎవరైతే రెండింటి ఏకత్వమును తెలుసుకొంటాడో అతనిలోని అజ్ఞానము సమూలముగా తొలగి మార్పులకు లోనుకాకుండా ఉంటాడు.
347. సత్యాన్ని కప్పివేసిన తెర తొలగిపోవాలంటే కేవలము సత్యాన్ని గూర్చిన పూర్తి జ్ఞానము తెలుసుకోవాలి. అపుడు అజ్ఞానము నాశనం అవుతుంది. జ్ఞానము వ్యక్తమవుతుంది. అపుడే దారి తప్పినందువలన కలిగే దుఃఖాలు తొలగిపోతాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 102 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 23. Reaching Soul State - 3 🌻
345. Perfect discrimination brought on by direct realisation distinguishes the true nature of the subject from that of the object, and breaks the bond of delusion created by Maya; and there is no more transmigration for one who has been freed from this.
346. The knowledge of the identity of the Jiva and Brahman entirely consumes the impenetrable forest of Avidya or Nescience. For one who has realised the state of Oneness, is there any seed left for future transmigration ?
347. The veil that hides Truth vanishes only when the Reality is fully realised. (Thence follow) the destruction of false knowledge and the cessation of misery brought about by its distracting influence.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
14 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment