నిర్మల ధ్యానాలు - ఓషో - 45


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 45 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అహం లేని క్షణం బాధ కూడా వుండదు. నువ్వు ఆనందంలో వుంటావు. ఆనందం మన అసలు తత్వం. బాధ అన్నది సృష్టించిన విషయం. 🍀


అహం మన నరకం. చిత్రమేమిటంటే ఆ నరకాన్ని మనమే సృష్టించుకుంటాం. మనమే సృష్టించుకుని మనమే బాధపడతాం. దాన్ని సృష్టించకుండా వుండడానికి, బాధలు పడకుండా వుండడానికి ఏమయినా చెయ్యడానికి అది మన పరిమితుల్లోనే వుంది. దాన్ని అదుపు చెయ్యడం మన చేతుల్లో వుంది. అహం లేని క్షణం బాధ కూడా వుండదు. నువ్వు ఆనందంలో వుంటావు. ఆనందం మన అసలు తత్వం. బాధ అన్నది సృష్టించిన విషయం. కొనితెచ్చు కున్నది. ఆనందమన్నది తెచ్చుకున్నదది కాదు, మనలో వున్నది. బాధ కింద అది అంతస్సోతస్వినిలాగా వుంది.

బాధని సృష్టించడమంటే అహాన్ని సృష్టించడమే. సన్యాసిగా వుండటమంటే అహాన్ని వదిలిపెట్టడమే. నిన్ను నువ్వు గొప్ప చేసుకోకు. తక్కువ చేసుకోకు. రెండూ అహంకారంలో భాగాలే. ఎవరితోనూ పోల్చుకోకు. అహం మోసకారితనాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించు. అది వినయంగా కూడా వుంటుంది. 'నేను వినయంగా వున్నాను. వినయంలో నన్ను మించిన వాళ్ళు లేరు' అంటుంది. అహం కొన్ని సార్లు దొడ్డిదారి నించీ వస్తుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

14 Jul 2021

No comments:

Post a Comment