శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 290 / Sri Lalitha Chaitanya Vijnanam - 290
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 290 / Sri Lalitha Chaitanya Vijnanam - 290 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 68. శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా ।
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ॥ 68 ॥ 🍀
🌻 290. 'సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా'🌻
సమస్త వేదముల గుంపులు శ్రీమాత ముక్కునకు అలంకరింపబడిన ముత్యముల ఆభరణములని అర్థము. అట్టి ముక్కుపుడక గలది శ్రీమాత అని కూడ అర్థము. ముందు నామములలో తారకల కాంతిని కూడ తిరస్కరించెడి ముక్కర కలదని సహస్ర నామములు తెలియజెప్పుచున్నవి (తారా కాంతి తిరస్కారి నాసాభరణ భూషితా). ఇచ్చట వేదముల గుంపులే ఆ నాసాభరణమని ఆ ఆభరణకాంతి ముత్యముల కాంతివలె వర్ణింప బడినది.
సోమాత్మకమైన కాంతిని ముత్యపు కాంతి గను, సూర్యాత్మక మైన కాంతిని వజ్రకాంతిగను తెలుపుదురు. సోమాత్మకమైన కాంతి మహాచైతన్యమునకు సంకేతము. దీనినే జ్ఞానకాంతి అందురు. ఇది జీవునికి చంద్రుని వెన్నెలవలె చల్లదనమిచ్చును. సూర్యుని కాంతి తాపము కలిగించును. ముత్యపు కాంతితో సకల వేద సమూహమును పోల్చుటలో జీవునికి తృప్తి, సంతుష్టి, చల్లదనము, మనస్సున కాహ్లాదము, ప్రశాంతత కలిగించు జ్ఞానము శ్రీమాత ముక్కుపుడక వంటిదని తెలుపబడినది.
అట్లే ఒక చిన్న ఆభరణము కాంతియే శ్రీమాతకు వేద సమూహముల జ్ఞానమైనపుడు ఇక శ్రీమాతనేమని వర్ణింపగలము! “సకలాగమ సందోహ” అను నామము శ్రీమాత మాహాత్మ్యమును
మిక్కుటముగ ప్రశంసించుచున్నది. శ్రుతులు, ఆగమములు సమస్తము ఆమె పాద ధూళిగను, ముక్కు పుడకగను పోల్చబడినవి.
మౌక్తిక మనగా సృష్టించు ధర్మము గలది అను అర్థము కూడ నున్నది. సృష్ట్యాది ధర్మములన్నియూ, ఆగమములందు (వేదము లందు) తెలుపబడి నప్పటికిని, అవి శ్రీమాతతో సరిసమానము కానే కావని భావన. వర్ణించలేని విషయము వర్ణించుట, వర్ణనమును అనంతముగ వర్ణించుటగ నుండును. ఎంత వర్ణించిననూ మిగిలి పోవుచుండును. అయిననూ భక్తులు వర్ణించుచునే యుందురు. అట్టి వర్ణన ఆరాధనమై వారిని శ్రీమాత సాన్నిధ్యమున నిలుపును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 290 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 68. śruti-sīmanta-sindūrī-kṛta-pādābja-dhūlikā |
sakalāgama-sandoha-śukti-sampuṭa-mauktikā || 68 || 🍀
🌻 Sakalāgama-saṃdoha-śukti-saṃpuṭa-mauktikā सकलागम-संदोह-शुक्ति-संपुट-मौक्तिका (290) 🌻
Her nose ring has been discussed in nāma 20. The ring made of pearl encompasses the āgama-s prescribed Veda-s. Āgama-s are traditional doctrines or precepts that lay down guidelines for various rituals, mostly with temples. It is a huge subject and is the combination of vāstu śāstra, astrology, astronomy etc.
Earlier nāma-s said that even Veda-s could not describe the Brahman. In the same way āgama-s also could not describe the Brahman. Taittirīya Upaniṣad (II.9) says, “Words together with thoughts return from Brahman unable to reach it.” Therefore, the Brahman could not be reached by Veda-s, formed out of words.
The Brahman is beyond words. The words or thoughts can make one realize something to which he has familiarity or experience. But the Brahman cannot be realized this way. The only way to realize the Brahman is by internal search and exploration. When compared to the Brahman, the Vedās or śāstra-s are insignificant.
That is why this nāma says such Veda-s or śāstra-s etc are within the tiny piece of Her nose ring.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment