2) 🌹. శివ మహా పురాణము - 428🌹
3) 🌹 వివేక చూడామణి - 103 / Viveka Chudamani - 103🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -55🌹
5) 🌹 Osho Daily Meditations - 44🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 104 / Lalitha Sahasra Namavali - 104🌹
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 104 / Sri Vishnu Sahasranama - 104🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -227 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 12-1
*🍀 11-1. యోగస్థితులు - మానవుని ప్రజ్ఞ సాధారణముగ మనస్సునందే యుండును. ప్రజ్ఞ ఇంద్రియార్థముల వెంట పడినపుడు మనస్సు ఇంద్రియముల ద్వారా బాహ్యమునకు ప్రసరించును. ఇంద్రియార్థముల వెంట, ఇంద్రియముల ద్వారా పరుగెత్తు ప్రజ్ఞను నియమించవలెను. అప్పుడు ప్రజ్ఞ నిరర్థకము కాదు. అందు కొరకు మనస్సును శ్వాసతో చేర్చి హృదయమున స్థిరపరచ వలెను. అట్టి పరిస్థితిలో మానవ ప్రజ్ఞ అంతరంగమున ఉండును. 🍀*
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్త్న్యైధా యాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ 12
తాత్పర్యము :
సర్వద్వారములను సంయమము గావించి, మనస్సును హృదయమున చేర్చి, స్థాపించి, మనోప్రాణములను శిరస్సునకు చేర్చుము.
వివరణము :
సర్వద్వారము లనగా బాహ్యమునకు ప్రజ్ఞ ప్రవహించు మార్గములు. అవి సాధారణముగ ఐదు ఇంద్రియములు. ఈ ఐదు ద్వారముల నుండి ప్రజ్ఞ బాహ్యమునకు ప్రవహించు చుండగ, మానవుడు నిర్వీర్యుడగును. మనస్సే పంచేంద్రియముల ద్వారా బాహ్యమునకు ప్రసరించు చుండును. మానవుని ప్రజ్ఞ సాధారణముగ మనస్సునందే యుండును. ప్రజ్ఞ ఇంద్రియార్థముల వెంట పడినపుడు మనస్సు ఇంద్రియముల ద్వారా బాహ్యమునకు ప్రసరించును.
బాహ్యమందలి ఇంద్రి యార్ధములకు ప్రజ్ఞ ఆకర్షింపబడుట సర్వసాధారణము. అట్లు ఇంద్రియార్థముల వెంట, ఇంద్రియముల ద్వారా పరుగెత్తు ప్రజ్ఞను నియమించ వలెను. లేనిచో చిల్లుకుండ యందలి నీరు చిల్లు నుండి కారినట్లు, కుండ నిర్జలమైనట్లు, మనస్సు శక్తిహీనమగు చుండును. ఐదు చిల్లులుగల కుండకు ఎంత జలమందించినను, కుండ నిర్జలముగనే యుండును. ఇట్లు మానవుడు ఇంద్రియార్దముల వెంట పరువెత్తుచు, దుర్బలుడై కాలక్రమమున కృశించును, నశించును. అంతేగాక మరణించును కూడ.
మనస్సు నందలి ప్రజ్ఞను అంతర్ముఖము చేయవలెను. అప్పుడు ప్రజ్ఞ నిరర్థకము కాదు. అందుకొరకు మనస్సును శ్వాసతో చేర్చి హృదయమున స్థిరపరచవలెను. అట్టి పరిస్థితిలో మానవ ప్రజ్ఞ అంతరంగమున ఉండును. అవసరమగుచో కర్తవ్యమును బట్టి మనస్సునందు ప్రవేశించి, అటుపై ఇంద్రియములద్వారా బహిర్గతమై బహిరంగమును చేరి, కర్తవ్య నిర్వహణము పూర్తియగు నంతనే మరల మనస్సుయందలి ప్రజ్ఞను హృదయమున స్థిరపరచవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 427🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 25
*🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 4 🌻*
ఆ కుమారులు తపస్సును చేసెదమని ప్రతిజ్ఞచేసి పశ్చిమ దిక్కున నున్న నారాయణ సరస్సుకు వెళ్ళిరి. నారదుడు కూడ అచటకు వెళ్లి (33) వారికి మోసపు ఉపదేశమును చేసెను. వారతని ఉపదేశముచే తిరిగి తండ్రి వద్దకు ఒక్కడైననూ మరలివెళ్లలేదు.(34)
ఈ వార్తను విని దక్షుడు కుపితుడు కాగా తండ్రి యాజ్ఞచే అతనిని ఓదార్చెను. అతడు తరువాత మరల వేయిమంది కుమారులను గని తపస్సు కొరకు పంపెను. (35). ఆ కుమారులను కూడా తండ్రి యాజ్ఞచే తపస్సును చేయుట కొరకు అచటకు వెళ్లిరి. నారదుడు కూడ అచటకు వెళ్లి వారికి వైరాగ్యము నుపదేశించెను. (36)
అతని ఉపదేశముచే వారు కూడ సోదరుల మార్గములో వెళ్లిరి. వారు భిక్షాటన యందభిరుచి గలవారై తండ్రి గృహమునకు మరలి పోలేదు.(37) ఓ శైలజా! నారదుని మంచిదనము ఈ తీరున లోకప్రసిద్ధమై యున్నది. మానవులలో వైరాగ్యమును కలిగించే అతని మరియొక గాథను వినుము(38).
పూర్వము చిత్రకేతు డనే విద్యాధరుడుడుండెను. నారదుడాతనికి తన ఉపదేశమును చేసి అతని ఇంటిని శూన్యము చేసెను. (39). ఇతరుల బుద్ధిలో భేదములను కల్పించే ఈ నారదుడు తన ఉపదేశములను ప్రహ్లాదునకు చేసి హిరణ్యకశిపునకు మహా దుఃఖమును కలిగించెను.(40)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 103 / Viveka Chudamani - 103🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 23. ఆత్మ స్థితిని చేరుట - 4 🍀*
348. మనం బంధనాలను గమనించినపుడు అవి తాడు వలె చుట్టుకొని, పెనవేసి, ముడి వేయుట తెలుస్తుంది. అందువలన జ్ఞాని తప్పక గ్రహించాలి, సత్యమైన బాహ్య వస్తు స్వభావమును తాను వాటి బంధనాల నుండి ఎలా బయటపడాలో.
349, 350. ఇనుము అగ్నితో సంబంధము ఏర్పచుకున్నపుడు అది అగ్ని కణాలను విడుదల చేస్తుంది. అలానే బుద్ది సాక్షిని, వస్తువును అందులోని బ్రహ్మము యొక్క వ్యక్తీకరణను గ్రహించినపుడు, తెలుసుకొనేది, తెలుసుకొనబడేది బుద్ది యొక్క ఫలితమని గ్రహించి, అది అసత్యమని, భ్రమ అని, కల అని, అలంకారమని అదే విధముగా అవన్నీ ప్రకృతిలోని మార్పులని మరియు అహంకారము కారణముగా శరీరము మొదలుకొని అన్ని బాహ్య వస్తువులు అసత్యాలని, అవి ఎల్లప్పుడు క్షణ క్షణము మారుతుంటవని గ్రహించాలి. ఆత్మ ఒక్కటియే ఎప్పటికి మారదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 103 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 23. Reaching Soul State - 4 🌻*
348. These three are observed in the case of a rope when its real nature is fully known. Therefore the wise man should know the real nature of things for the breaking of his bonds.
349-350. Like iron manifesting as sparks through contact with fire, the Buddhi manifests itself as knower and known through the inherence of Brahman. As these two (knower and known), the effects of the Buddhi, are observed to be unreal in the case of delusion, dream and fancy, similarly, the modifications of the Prakriti, from egoism down to the body and all sense-objects are also unreal. Their unreality is verily due to their being subject to change every moment. But the Atman never changes.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 55 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. మోక్షము - 2 🌻
క్రమేణ తెచ్చుకున్న బంధాల ఉచ్చు బిగిసిన కొద్దీ పురుషార్థాల నడుమ సమతూకం చెదిరి, మోక్షం అనే ఆనందస్థితి నుండి బంధమనే సంసార స్థితిలోనికి జారి, ఇక్కడి నుండి చూస్తే మోక్షం వేరే సాధించాల్సిన ఒక మెట్టు లాగ కనిపిస్తుంది.
ఈ స్థితిలో ఎవరు చేసేది వారికి సత్యంగాను, సహజంగాను కనిపించడం సహజం. దీని వల్లనే వస్తాయి బేధాభిప్రాయాలు. తన దృష్టి గాక అవతలి వాడి దృక్కోణంలోంచి ఆలోచించగలిగిన కొద్దీ దృక్పథం, మానసిక వైశాల్యం పెరిగి, అందరు చేసేదీ ఒకే దేవాలయానికి ఇటుకలు పేర్చటమేనన్నది అనుభమవుతుంది.
ఆ ఇటుక తానేననీ, పరిపూర్ణమైన ఇటుకగా తయారుకావటానికి చేయవలసినదే సాధన అని కూడ అర్థమవుతుంది.
ఈ సాధన అనే పథంలో కోసురాళ్ళుగా ఉన్న జీవులంతా తమ వ్యక్తిత్వపు పరస్పర రాపిడులలో అంచులు నునుపు దేరి పరిపూర్ణమైన ఇటుకలుగా తయారు కావడమే సాధన యొక్క పరమావధి అనీ, సాధన యెడ మేలుకాంచిన కొలదీ దర్శనమిస్తుంది.
దీనికి బృంద జీవనానికి మించిన సాధన లేదు. బృంద జీవనానికి గురుపూజలు ఒక మంచి ఉదాహరణ.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 44 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 SELF-IMPROVEMENT 🍀*
*🕉 Self-improvement is the way to hell. All efforts to make something out if yourself-something if an ideal-are going to create more and more madness. Ideals are the base if all madness, and all of humanity is neurotic because if too many ideals. 🕉*
Animals are not neurotic because they don't have any ideals. Trees are not neurotic because they don't have any' ideals. They are not trying to become somebody else. They are simply enjoying whatever they are.
You are you. But somewhere deep down you want to become a Buddha or a krishna, and then you go around in a circle that will be unending. Just see the point of it-you are you. And the whole, or existence, wants you to be you. That's why existence has created you, otherwise it would have created a different model. It wanted you to be here at this moment. It did not want Jesus to be here in place of you. And existence knows better.
The whole always knows better than the part. So just accept yourself. If you can accept yourself, you have learned the greatest secret of life, and then everything comes on its own. Just be yourself. There is no need to pull yourself up; there is no need to be a different height from what you are already.
There is no need to have another face. Simply be as you are, and in deep acceptance of it, and a flowering will happen and you will go on becoming more and more yourself. Once you drop the idea of becoming somebody, there is no tension. Suddenly all tension disappears. You are here, luminous, in this moment. And there is nothing else to do but to celebrate and enjoy.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 104 / Sri Lalita Sahasranamavali - Meaning - 104 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 104. స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా ।*
*శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀*
🍀 504. స్వాధిష్ఠానాంబుజగతా -
స్వాధిష్ఠాన పద్మములో వసించునది.
🍀 505. చతుత్వక్త్ర మనోహరా -
నాలుగు వదనములతో అందముగా నుండునది.
🍀 506. శూలాధ్యాయుధ సంపన్నా -
శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది.
🍀 507. పీతవర్ణా - పసుపు పచ్చని రంగులో ఉండునది.
🍀 508. అతిగర్వితా -
మిక్కిలి గర్వంతో నుండునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 104 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 104. svādhiṣṭhānāmbuja-gatā caturvaktra-manoharā |*
*śūlādyāyudha-sampannā pītavarṇā'tigarvitā || 104 || 🌻*
🌻 504 ) Swadhishtanam bujagatha -
She who lives in the six petalled lotus
🌻 505 ) Chathur vakthra manohara -
She who has four beautiful faces
🌻 506 ) Sulayudha sampanna -
She who has weapons like Spear
🌻 507 ) Peetha varna -
She who is of golden colour
🌻 508 ) Adhi garvitha -
She who is very proud
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 104 / Sri Vishnu Sahasra Namavali - 104 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*
*🍀 104. భూర్భువ స్స్యస్తరుస్తారః సవితా ప్రపితామహః|*
*యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ‖ 104 ‖ 🍀*
🍀 967) భూర్భువ: స్వస్తరు: -
భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.
🍀 968) తార: -
సంసార సాగరమును దాటించువాడు.
🍀 969) సవితా -
తండ్రి వంటివాడైన భగవానుడు.
🍀 970) ప్రపితామహః -
బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.
🍀 971) యజ్ఞ: -
యజ్ఞ స్వరూపుడు.
🍀 972) యజ్ఞపతి: -
యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు.
🍀 973) యజ్వా -
యజ్ఞము నందు యజమాని.
🍀 974) యజ్ఞాంగ: -
యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.
🍀 975) యజ్ఞవాహన: -
ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 104 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Uttara Bhadra 4th Padam*
*🌻 104. bhūrbhuvaḥsvastarustāraḥ savitā prapitāmahaḥ |*
*yajñō yajñapatiryajvā yajñāṅgō yajñavāhanaḥ || 104 || 🌻*
🌻 967. Bhūr-bhuvaḥ-svastaruḥ:
The three Vyahrutis Bhuh, Bhuvah, Svah are said to be the essence of the Veda.
🌻 968. Tāraḥ:
One who helps Jivas to go across the ocean of Samsara.
🌻 969. Savitā:
He who generates all the worlds.
🌻 970. Prapitāmahaḥ:
One who is the father of Brahma and therefore the grandfather of all.
🌻 971. Yajñaḥ:
One who is of the form of Yajna.
🌻 972. Yajñapatiḥ:
One who is the protector and the master of the Yajnas.
🌻 973. Yajvā:
One who manifests as the performer of a Yajna.
🌻 974. Yajñāngaḥ:
All the parts of His body as the
incarnate Cosmic Boar are identified with the parts of a yajna.
🌻 975. Yajña-vāhanaḥ:
One who supports the Yajna which yield various fruits.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment