మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 55


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 55 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మోక్షము - 2 🌻


క్రమేణ తెచ్చుకున్న బంధాల ఉచ్చు బిగిసిన‌ కొద్దీ పురుషార్థా‌ల నడుమ సమతూకం చెదిరి, మోక్షం అనే ఆనందస్థితి నుండి బంధమనే సంసార స్థితిలోనికి జారి, ఇక్కడి నుండి‌ చూస్తే మోక్షం వేరే సాధించాల్సిన ఒక మెట్టు లాగ కనిపిస్తుంది.

ఈ స్థితిలో ఎవరు చేసేది వారికి సత్యంగాను, సహజంగాను కనిపించడం సహజం. దీని‌ వల్లనే వస్తాయి బేధాభిప్రాయాలు. తన‌ దృష్టి గాక‌ అవతలి వాడి‌ దృక్కోణంలోంచి ఆలోచించగలిగిన‌ కొద్దీ దృక్పథం, మానసిక వైశాల్యం పెరిగి, అందరు చేసేదీ ఒకే దేవాలయానికి‌ ఇటుకలు పేర్చటమేనన్నది అనుభమవుతుంది.

ఆ ఇటుక తానేననీ, పరిపూర్ణమైన ఇటుకగా తయారుకావటానికి చేయవలసినదే సాధన అని‌ కూడ అర్థమవుతుంది.

ఈ సాధన అనే పథంలో కోసురాళ్ళుగా ఉన్న జీవులంతా తమ వ్యక్తిత్వపు పరస్పర రాపిడులలో అంచులు నునుపు దేరి పరిపూర్ణమైన ఇటుకలుగా తయారు కావడమే సాధన యొక్క పరమావధి అనీ, సాధన యెడ మేలుకాంచిన కొలదీ దర్శనమిస్తుంది.

దీనికి బృంద జీవనానికి మించిన సాధన లేదు. బృంద జీవనానికి గురుపూజలు ఒక మంచి ఉదాహరణ.

🌹 🌹 🌹 🌹 🌹


15 Jul 2021

No comments:

Post a Comment