గీతోపనిషత్తు -223
🌹. గీతోపనిషత్తు -223 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 10 - 2
🍀 9 - 2 . ధ్యాన మార్గము - ధ్యాన మార్గ మిట్లున్నది. 🍀
1. తూర్పు ముఖముగ గాని, ఉత్తర ముఖముగ గాని స్థిరము సుఖము నిచ్చు ఆసనమును ఎంచుకొనవలెను.
2. అందులకు శుచియగు ప్రదేశమును ఎంచుకొన వలెను. ధ్యానము చేయు ప్రదేశమునందు గాలి, వెలుతురు యుండ వలెను. దుర్వాసన లుండరాదు. ప్రదేశము నిశ్శబ్దమై యుండుట మేలు.
3. ఆసనము నొక దాని నేర్పరచుకొని కూర్చుండ వలెను. ఆసనములు మరీ ఎత్తుగ నుండరాదు.
4. ధ్యానమున కుపక్రమించునపుడు సహజ పరిమళము గల అగరువత్తులు వెలిగించుట సముచితము. చందన పరిమళమైనచో ఉత్తమము.
5. నెమ్మదిగ కనులు మూసుకొని స్థిరము నిచ్చు సుఖమగు ఆసనమున కూర్చుండవలెను. వెన్నెముక వీలున్నంతవరకు నిటారుగ నుండవలెను. శిరస్సు, వెన్నెముక యొకే సరళరేఖవలె నిట్టనిలువుగ నుంచు ప్రయత్నము చేయవలెను. హస్తములు రెండింటిని కూర్చి యుంచుకొనుట గాని లేదా పైకెత్తి యుంచుట గాని, క్రిందికి వంచి యుండుటగాని పనికిరాదు.
6. పై విధముగ కూర్చుండి శరీరము శిరస్సు నుండి పాదముల వరకు ఒక్కసారి పరిశీలించుకొనవలెను. ఎచ్చటను పట్లుండరాదు. మనసును కూడ సడలించి యుంచుకొనవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment