2) 🌹. శివ మహా పురాణము - 424🌹
3) 🌹 Light On The Path - 170🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -51🌹
5) 🌹 Osho Daily Meditations - 40🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 100 / Lalitha Sahasra Namavali - 100🌹
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasranama - 100🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -223 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 10 - 2
*🍀 9 - 2 . ధ్యాన మార్గము - ధ్యాన మార్గ మిట్లున్నది. 🍀*
1. తూర్పు ముఖముగ గాని, ఉత్తర ముఖముగ గాని స్థిరము సుఖము నిచ్చు ఆసనమును ఎంచుకొనవలెను.
2. అందులకు శుచియగు ప్రదేశమును ఎంచుకొన వలెను. ధ్యానము చేయు ప్రదేశమునందు గాలి, వెలుతురు యుండ వలెను. దుర్వాసన లుండరాదు. ప్రదేశము నిశ్శబ్దమై యుండుట మేలు.
3. ఆసనము నొక దాని నేర్పరచుకొని కూర్చుండ వలెను. ఆసనములు మరీ ఎత్తుగ నుండరాదు.
4. ధ్యానమున కుపక్రమించునపుడు సహజ పరిమళము గల అగరువత్తులు వెలిగించుట సముచితము. చందన పరిమళమైనచో ఉత్తమము.
5. నెమ్మదిగ కనులు మూసుకొని స్థిరము నిచ్చు సుఖమగు ఆసనమున కూర్చుండవలెను. వెన్నెముక వీలున్నంతవరకు నిటారుగ నుండవలెను. శిరస్సు, వెన్నెముక యొకే సరళరేఖవలె నిట్టనిలువుగ నుంచు ప్రయత్నము చేయవలెను. హస్తములు రెండింటిని కూర్చి యుంచుకొనుట గాని లేదా పైకెత్తి యుంచుట గాని, క్రిందికి వంచి యుండుటగాని పనికిరాదు.
6. పై విధముగ కూర్చుండి శరీరము శిరస్సు నుండి పాదముల వరకు ఒక్కసారి పరిశీలించుకొనవలెను. ఎచ్చటను పట్లుండరాదు. మనసును కూడ సడలించి యుంచుకొనవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 423🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 24
*🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 8 🌻*
నేను అనేక పర్యాయములు అధిక ప్రయత్నమును చేసి భక్తుల కొరకై కష్టమును సహించితి. నేను గృహపతినై విశ్వానరమహర్షి యొక్క దుఃఖమును తొలగించితిని (71). ఓ బ్రహ్మా! హే విష్ణో! పెక్కు మాటలేల? నేను సత్యమును పలుకుచున్నాను. నేను ప్రతిజ్ఞను చేసితినని మీరందరు ఎరుంగుదురు. ఆ ప్రతిజ్ఞ యొక్క తత్త్వము మీకు తెలియును (72).
ఎప్పుడైననూ ఎక్కడైననూ భక్తులకుకష్టము వచ్చినచో, నేను అప్పుడు అక్కడ వెంటనే ప్రత్యక్షమై ఆ కష్టమును తొలగించెదను (73). మీకు అందరికీ తారకాసురుని వలన సంప్రాప్తమైన దుఃఖమును గురించి నేను ఎరుంగుదును. నేనా దుఃఖమును తొలగించెదను. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (74).
నాకు భోగవిలాసముల యందు అభిరుచి లేకపోయిననూ, పుత్ర సంతానము కొరకై పార్వతిని వివాహమాడెదను (75). దేవతలారా! మీరందరు నిర్భయముగా మీ గృహములకు వెళ్లుడు. మీ కార్యమును నేను సిద్ధింపజేసెదను. మీరీ విషయములో విచారించకుడు (76).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివుడు ఇట్లు పలికి మౌనమును వహించి సమాధిలోనికి వెళ్లిపోయెను. ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలందరు తమ ధామములకు వెళ్లిరి (77).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ వివాహ స్వీకారమనే ఇరువది నాలుగవ అధ్యాయము ముగిసినది (24).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 170 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 Regard the three truths. They are equal. - 7 🌻*
600. Remember the sayings of the Masters, which is often not well understood, about casting pearls before swine. This is often taken quite wrongly as a comparison of the people to swine. That was surely not in the mind of the great Master. He simply meant that to give the inner truths to people who have not yet the knowledge to enable them to appreciate them would be as foolish as to cast pearls before swine.
They would probably rush forward expecting to receive something to eat, and finding that the pearls were not edible, they would trample them in the mire, and then turn and rend the giver of the pearls because they had been disappointed in their expectation of food. The pearls would be of no use to them, however valuable they might be to us.
That is generally the attitude of ordinary people, when we put before them truths which are not comprehensible to them. They do not see their value; they cast them aside, and are usually angry with us for giving them something which they regard as useless.
601. It has always been recognized that only simple truths can be given to the great mass of men, who are as yet not highly evolved. All great religions have had some special truth which they strongly inculcated, and if any of these truths be taken in its entirety it will be found that it covers most of the ground.
It is very necessary that certain ideas should be implanted in the minds of the evolving human egos, so they pass through religion after religion, race after race, learning something from each.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 51 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. బుద్ధిమంతుడు 🌻*
కలగనుచున్న వానికి కలలోని విషయములపై అధికారము లేదు. కలలో జరుగుచున్న కథ ప్రకారము తాను నడచుకొనునే గాని, తన ఇష్టము ప్రకారము కలను మార్చుకొనలేడు గదా!
అట్లే మూఢుడును తన అభిప్రాయములను మార్చుకొనలేడు.
దీనిని గమనించి , తెలిసినవాడు జీవితములోని సన్నివేశములను, వస్తువుల సాధన సంపత్తిని, తనకు కావలసినంత వరకును గ్రహించి , మిగిలిన వానిని పట్టించుకొనడు.
ప్రవహించుచున్న నదియందు తనకు కావలసిన నీటిని గ్రహించి , మిగిలిన వానిలో దూకి, మునుగక వర్తించునట్లు బుద్ధిమంతుడు విజ్ఞానము నందు మెలగునని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 40 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 AT WORK 🍀*
*🕉 One has to remember that the people who are associates at work are not at all concerned with your inner lye. That is your work to do; they have their own inner lives to work out. 🕉*
Your work colleagues have their own negative moods, their own personal problems and anxieties, just as everybody else, including you, has. But when you are in a working situation with somebody, you need not bring these things in, because if they start bringing in all their negativities and you start bringing in all of yours, it will be a neverending process.
If you are feeling negative, do something. For example, write out a very negative thing and burn it. Go to the therapy room, beat a pillow and throw it. Do a terrible dance! You have to work it out; it is your problem. And once in a while it is good to ask whoever is working with you whether you have been negative, if they are feeling hurt.
Because sometimes you may not know that you have been negative. Small gestures, just a word, even a silence, can be hurtful; the way you look at someone can be hurtful. So once in a while ask their forgiveness. Tell them, "Every time I ask you, you have to be honest. Just tell me, because I am a human being and sometimes thing: can go wrong from my side and I have to put them right."
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 100 / Sri Lalita Sahasranamavali - Meaning - 100 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।*
*దంష్ట్రోజ్జ్వలా,ఽక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*
🍀 485. అనాహతాబ్జ నిలయా -
అనాహత పద్మములో వసించునది.
🍀 486. శ్యామభా -
శ్యామల వర్ణములో వెలుగొందునది.
🍀 487. వదనద్వయా -
రెండు వదనములు కలది.
🍀 488. దంష్ట్రోజ్వలా -
కోరలతో ప్రకాశించునది.
🍀 489. అక్ష్మమాలాదిధరా -
అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.
🍀 490. రుధిర సంస్థితా -
రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 100 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 100. anāhatābja-nilayā śyāmābhā vadanadvayā |*
*daṁṣṭrojjvalā'kṣa-mālādi-dharā rudhirasaṁsthitā || 100 || 🌻*
🌻 485 ) Anahathabja nilaya -
She who lives in the twelve petalled lotus
🌻 486 ) Syamabha -
She who is greenish black
🌻 487 ) Vadanadwaya -
She who has two faces
🌻 488 ) Dhamshtrojwala -
She who shines with long protruding teeth
🌻 489 ) Aksha maladhi dhara -
She who wears meditation chains
🌻 490 ) Rudhira samsthida -
She who is in blood.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasra Namavali - 100 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*
*🍀 100. అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|*
*చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ‖ 100 ‖ 🍀*
🍀 932) అనంతరూపః - అనంతమైన రూపములు గలవాడు.
🍀 933) అనంత శ్రీః - అంతంలేని శక్తివంతుడైనవాడు.
🍀 934) జితమన్యుః - క్రోధము లేనివాడు.
🍀 935) భయాపహః - భయమును పోగొట్టువాడు.
🍀 936) చతురశ్రః - కర్మఫలములను న్యాయముగా పంచువాడు.
🍀 937) గభీరాత్మా - గ్రహింప శక్యంగాని స్వరూపము గలవాడు.
🍀 938) విదిశః - అర్హులైనవారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.
🍀 939) వ్యాధిశః - బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.
🍀 940) దిశః - వేదముద్వారా జీవులకు కర్మఫలములను తెలియజేయువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 100 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for PoorvaBhadra 4th Padam*
*🌻 100. anantarūpō nanta śrī: jitamanyu rbhayāpahaḥ |*
*caturaśrō gabhīrātmā vidiśō vyādiśō diśaḥ || 100 || 🌻*
🌻 932. Ananta-rūpaḥ:
One who has innumerable forms, as He dwells in this all-comprehending universe.
🌻 933. Anantaśrīḥ:
One whose Shri (glory) is infinite.
🌻 934. Jita-manyuḥ:
One who has overcome anger.
🌻 935. Bhayāpahaḥ:
One who destroys the fears of beings from Samsara.
🌻 936. Caturaśraḥ:
One who is just, because He bestows on Jivas the fruits of their Karma.
🌻 937. Gabhirātmā:
One whose nature is unfathomable.
🌻 938. Vidiśaḥ:
One who distributes various furits of actions to persons differing in their forms according to competency.
🌻 939. Vyādiśaḥ:
One who gives to Indra and other deities directions according to their varied functions.
🌻 940. Diśaḥ:
One who in the form of the Vedas bestows the fruits of their ritualistic actions on different beings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment