శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 286-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 286-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 286-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 286-2 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀
🌻 286. 'వర్ణాశ్రమవిధాయినీ' -2🌻
నాలుగు వర్ణములు కూడ సంఘశ్రేయస్సుకే పాటుపడుట, తద్వారా పరిణామము చెందుట శ్రీమాత ఏర్పరచిన విధానము. సంఘమునకు తమను తాము సమర్పించుకొను వున్ముఖతను బట్టి వీరు అభివృద్ధి చెందు చుందురు. పరిణామము చెందుచు దివ్యపథమున సాగుదురు. సృష్టి యజ్ఞమున వీరందరికిని భాగమున్నది. స్వార్థమున్నచోట బంధము, పరహిత మున్నచోట మోక్షము శ్రీమాత ఏర్పరచిన విధానము.
నాలుగు వర్ణములవలెనే మానవ జీవితమున నాలుగు ఆశ్రమములు కూడ కలవు. అవి వరుసగా బాల్యము, యౌవనము (కౌమారము), గృహస్థము, వానప్రస్థము. బాల్యమున క్రీడాసక్తి, కౌమారమున విద్యాసక్తి, గృహస్థాశ్రమమున కర్తవ్య నిర్వహణము, వానప్రస్థమున దైవచింతన అను నాలుగు స్థితులు ప్రతి జీవునికి గలవు. క్రీడాసక్తి అందరికిని సహజమేగాని, విద్యాసక్తి, సంఘమున బాధ్యతాయుత జీవనము, చరమదశలో తపస్సు జీవులు ప్రయత్నించి నిర్వర్తించు కొనవలెను.
అట్లు చేసినచో జీవుడు సన్మార్గమున పురోగతి చెందును. కర్మకాండను సక్రమముగ నిర్వర్తించు వారికే భక్తి, జ్ఞానము ఉదయించి ధ్యానమున నిలువగలరు. కర్మమందలి ధర్మమే భక్తిగ వికసించును. భక్తి జ్ఞానమునకు మార్గము చూపును. జ్ఞానము వైరాగ్యమునకు, ధ్యానమునకు మార్గము చూపును. ఒక జీవిత కాలమున ఈ నాలుగాశ్రమములను నిర్వర్తించుకొనుట వలన జీవుడు కృతకృత్యుడగును. ఇట్లు జీవోద్ధరణకై వర్ణాశ్రమ విధానమును శ్రీమాత ఏర్పరచెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 286-2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |
nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🍀
🌻 Varṇāśrama-vidhāyinī वर्णाश्रम-विधायिनी (286) 🌻
Varṇāśrama means the order of life as expounded in Vedās. Veda-s classify people based upon their knowledge and capabilities. For example, soldiers are needed to protect borders of countries, agriculturists are needed to grow grains for consumption to make a living, traders are needed to buy requirements, and priests are needed to perform rituals.
Veda-s say that the classification is not based upon their birth, but on the ability of a person to perform certain duties. It would not be logical to expect a trader to protect borders effectively.
Therefore the inclination, capacity, knowledge and experience are the parameters by which a person is classified.
Such classifications are applicable only to the human race. Since She is not different from Veda-s and all the Veda-s originated from Her, it is said that She has made these classifications.
Having created the universe, She also created the Veda-s to effectively administer the universe. Veda-s lay down rules and regulations to be followed in a human life. Path shown by Veda-s is known as dharma or righteousness. If one trespasses prescribed righteousness by Veda-s, he gets afflicted by karma-s that leads to several transmigrations.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
06 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment