నిర్మల ధ్యానాలు - ఓషో - 41


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 41 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనసు గతానికేసి, భవిష్యత్తు కేసి సాగకుంటే ప్రయాణం పూర్తవుతుంది. అనంతమయిన ఆవిష్కారం జరుగుతుంది. 🍀

మరణం తీసుకెళ్ళక ముందే నిజమైన ఇంటిని కనిపెట్టాలి. అది కనిపెట్టడం అంత కష్టం కాదు. కారణం మరీ అంత దూరంలో లేదు. అది కనిపెట్టవచ్చు. కారణం, అది నీలోనే వుంది. నీ లోపలే వుంది. నువ్వు కొంత దూరం కూడా ప్రయాణించలేదు. దానికి ముందు నువ్వు అన్నీ వదిలిపెట్టి భౌతిక ప్రయాణాలన్నీ కట్టిపెట్టి నిశ్శబ్దంగా కూచో. మనసు గతానికేసి, భవిష్యత్తు కేసి సాగకుంటే ప్రయాణం ఆగిపోతుంది.

బీజం చెట్టుగా మారుతుంది. అక్కడ అనంతమయిన ఆవిష్కారం వుంటుంది. పూలు పుష్పిస్తాయి. ఫలాలు కనిపిస్తాయి. గాలిలో, సూర్యకాంతిలో వర్షంలో నువ్వు ఆనందించవచ్చు. గాలితో కలిసి నాట్యం చెయ్యవచ్చు. నీ ఆనందాన్ని మేఘాలతో పంచుకోవచ్చు. నక్షత్రాలతో గుసగుసలాడవచ్చు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


06 Jul 2021

No comments:

Post a Comment