వివేక చూడామణి - 98 / Viveka Chudamani - 98
🌹. వివేక చూడామణి - 98 / Viveka Chudamani - 98🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 22. కోరికలు, కర్మలు - 8 🍀
333. సన్యాసులు తాము అసత్య వ్యవహారములలో పాల్గోనరాదు. అలా జరిగిన అతడు బంధనాలలో చిక్కుకొనును. అందువలన అతడు తన మనస్సును ఎల్లప్పుడు నేనే బ్రహ్మాన్నని, అంత బ్రహ్మమేనని భావిస్తూ ఎల్లప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటూ, పాపాలకు, దుఃఖాలకు, మాయకు వ్యతిరేఖముగా జీవిస్తాడు. ఎందువలనంటే అవన్ని అతడు ముందే అజ్ఞానములో ఉన్నప్పుడు అనుభవించాడు.
334. బాహ్య వస్తు సముధాయముపై ఆధారపడి జీవించిన, వాటి చెడు ఫలితాలు ఇంకా ఇంకా పెరిగిపోతుంటాయి. ఈ విషయాన్ని గ్రహించి బాహ్య వస్తువులపై వ్యామోహమును తొలగించి, స్థిరముగా వ్యక్తి బ్రహ్మమును గూర్చి ధ్యానములో నిమగ్నుడై ఉండవలెను.
335. ఎపుడైతే బాహ్య ప్రపంచము మూసివేయబడుతుందో, మనస్సు ఆనందముతో నిండి ఉంటుంది. ఆ ఆనంద స్థితిలో మనస్సుకు బ్రహ్మానంద స్థితి లేక పరమాత్మ స్థితి అనుభవమవుతుంది. ఎపుడైతే ఖచ్చితముగా అట్టి అనుభవమవుతుందో అపుడు చావు పుట్టుకల గొలుసు తెగిపోతుంది. అందువలన విముక్తికి మొదటి మెట్టు బాహ్య ప్రపంచము వైపు తెరచి ఉన్న తలుపులను మూసివేయుట.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 98 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 22. Desires and Karma - 8 🌻
333. The Sannyasin should give up dwelling on the unreal, which causes bondage, and should always fix his thoughts on the Atman as "I myself am This". For the steadfastness in Brahman through the realisation of one’s identity with It gives rise to bliss and thoroughly removes the misery born of nescience, which one experiences (in the ignorant state).
334. The dwelling on external objects will only intensify its fruits, viz. furthering evil propensities, which grow worse and worse. Knowing this through discrimination, one should avoid external objects and constantly apply oneself to meditation on the Atman.
335. When the external world is shut out, the mind is cheerful, and cheerfulness of the mind brings on the vision of the Paramatman. When It is perfectly realised, the chain of birth and death is broken. Hence the shutting out of the external world is the steppingstone to Liberation.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
06 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment