శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 295 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 295 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 295 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 295 - 2 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀
🌻 295-2. 'అంబికా'🌻
శ్రీమాత మాతృ భావము అంబికా భావము నుండి విడుదల అగుచున్నది.
పిల్లియైననూ, కుక్కయైననూ, పులియైననూ, ఏనుగైననూ, పందియైననూ తమ పిల్లలను పెంచి పోషించు విషయమున ఈ మాతృభావమునే ప్రకటించుచున్నవి. ఆధునిక మానవులలో కొందరు మాత్రము ఈ సహజ సిద్ధమైన దేవీ సాన్నిధ్యమును కోల్పోవుచున్నారు. అందము తగ్గునని పాలివ్వని స్త్రీలు అట్టివారు. హృదయము కఠినమైనపుడు మాతృభావమునకు స్థాన ముండదు. కఠిన హృదయులగు స్త్రీలు మాతృభావమును కోల్పోవుదురు. వారికి శ్రీమాత సాన్నిధ్యము దుర్లభమగును.
శ్రీమాత సహజముగ అందించిన ఒక సాన్నిధ్య అవకాశమును కఠినత్వము వలన కోల్పోవుట దురదృష్టము. పురుషులైననూ, స్త్రీలైననూ దయ, దాక్షిణ్యము, ప్రేమ, అనురాగముల ద్వారా హృదయము మెత్తబడిన వారిగ మలచు కొనినచో అంబిక సాన్నిధ్య మిచ్చును. కఠిన హృదయులకు కష్ట నష్టములు కలిగి అటుపైన మెత్తబడుట జరుగును. పిండిని మలచినట్లు పప్పును మలచలేము.
అట్లే దివ్యత్వము కలుగుటకు జీవులకు కష్ట నష్టములు సృష్టియం దవసరమైనవి. పప్పును దంచి పిండిని చేయవలెను కదా! ఎట్లైననూ జీవులకు నిజమగు మాతృభావమును సంక్రమింపజేసి ఉద్దరించుకొనుటకు తల్లివలె జగన్మాత అనేకమగు ప్రయత్నములు చేయుచుండును. ఆమె అంబిక. సృష్టిజీవుల మేలుకోరు తల్లి. అన్ని విధముల మేలు కలుగజేయుటకే ప్రయత్నించుచు నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 295-2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |
ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀
🌻 Ambikā अम्बिका (295) 🌻
The mother of the universe. This is different from the first nāma Śrī Mātā. There She was referred as the mother of all living beings of the universe. Here She is called as the mother of the universe itself comprising of both living and non-living beings.
This nāma mentions about Her creative action that comprises of iccā, jñāna and kriyā śaktī-s (desire or will, knowledge and action). There is also a saying that Śiva represents day and Śaktī represents night, basically due to Her māyā.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
31 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment