1-AUGUST-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 234 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 435🌹 
3) 🌹 వివేక చూడామణి - 109 / Viveka Chudamani - 109🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -62🌹  
5) 🌹 Osho Daily Meditations - 51🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 296-1 / Sri Lalita Chaitanya Vijnanam - 296-1🌹  

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు 🌹
🍀 Happy International FriendShip Day to all. 🍀
Prasad Bharadwaj

Join and Share ALL
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://pyramidbook.in/Chaitanyavijnanam

Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://pyramidbook.in/dailywisdom

Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
https://pyramidbook.in/vivekachudamani

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
https://pyramidbook.in/maharshiwisdom

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

Join and Share
🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹
www.facebook.com/groups/dattachaitanyam/

Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -234 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 17 -1
 
*🍀 16 -1. బ్రహ్మసృష్టి - బ్రహ్మ సృష్టి వేయి యుగములు పగళ్ళు, వేయి యుగములు రాత్రులుగ నెరుగుము. ఒక మన్వంతరమున 720 యుగము లుండును. అట్టివి 14 యుగము లనగా 980 యుగములు. సంధి కాలముతో వేయి యుగముల కాలపరిమాణమని పెద్దలు చెప్పుచుందురు. అట్లే వేయి యుగములు బ్రహ్మరాత్రి యుండును. అనగా ఒక దినమునందు (పగలు + రాత్రి) 2,000 యుగము లగును. 🍀*

సహస్రయుగపర్యంత మహ ర్యద్మహ్మణో విదు: |
రాత్రిం యుగసహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః || 17

తాత్పర్యము : బ్రహ్మ సృష్టి వేయి యుగములు పగళ్ళు, వేయి యుగములు రాత్రులుగ నెరుగుము. 

వివరణము : ఒక సృష్టికర్త యొక్క ఆయః పరిమాణము వంద సంవత్సరములని, అనగా 36,500 రోజులు. అందు ఒక రోజు యందు ఒక పగలు, ఒక రాత్రి యున్నవి. పగలెంత కాల ముండునో, రాత్రియు అంతే కాల ముండును. ఒక పగలు పరిమాణము ఈ క్రింది విధముగ నున్నది.

14 మన్వంతరములు ఒక పగలు. 
ఒక మన్వంతరమున 72 మహాయుగము లుండును.
ఒక మహాయుగమున 43,20,000 సంవత్సరము లుండును.
ఒక మహాయుగ మనగా కలి యుగము : 4,32,000 సంవత్సరములు
ద్వాపర యుగము : 8,64,000 సంవత్సరములు
త్రేతా యుగము : 12,96,000 సంవత్సరములు
కృత యుగము : 17,28,000 సంవత్సరములు

43,20,000 సంవత్సరములు బ్రహ్మదేవుని పగలెంత కాలపరిమాణము కలిగియున్నదో, రాత్రికూడ అంతే కాలపరిమాణము కలిగియుండును. ఒక పగలే వేయి యుగములు. అట్లే రాత్రి కూడ వేయి యుగములు. ఒక మన్వంతరమున 72 మహాయుగము లుండును. ఒక మహా
యుగమున పది యుగము లుండును.

 అనగా ఒక మన్వంతర మున 720 యుగము లుండును. అట్టివి 14 యుగము లనగా 980 యుగములు. సంధి కాలముతో వేయి యుగముల కాలపరిమాణమని పెద్దలు చెప్పుచుందురు. అట్లే వేయి యుగములు బ్రహ్మరాత్రి యుండును. అనగా ఒక దినమునందు (పగలు + రాత్రి) 2,000 యుగము లగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 434🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 26

*🌻. బ్రహ్మచారి రాక - 4 🌻*

చెలికత్తె ఇట్లనెను-

ఓ సాధూ! శ్రేష్ఠమగు పార్వతీ చరిత్రను ఆమె తపస్సునకు గల కారణమును సర్వసమును నీవు వినగోరుచున్నచో, చెప్పెదను వినుము. (33) ఈ నా చెలికత్తె పర్వతరాజగు హిమవంతునికి మేనకయందు జన్మించినది. ఈమెకు పార్వతి, కాలి అను పేర్లు ప్రసిద్ధముగా నున్నవి (34). ఈమెకు ఇంకనూ వివాహము కాలేదు. ఈమె శివుని తక్క మరియొకనిని కోరుట లేదు. ఈమె మూడువేల సంవత్సరముల నుండి తపస్సును చేయుచున్నది (35) ఈ నా చెలికత్తె శివుని కొరకు ఇట్టి తపస్సును ఆరంభించినది. హే సాధో! బ్రాహ్మణశ్రేష్టా! దానికి గల కారణమును చెప్పెదను వినుము (36).

ఇంద్రాది దేవతలను, విష్ణువును బ్రహ్మను కూడా విడిచి పార్వతి పినాక సాణియగు శివుని భర్తగా పొందగోరుచున్నది(37). ఈ నా చెలికత్తె పూర్వము వృక్షములును నాటెను. ఓ బ్రాహ్మణుడా! అవి అన్నీ పూవులు పూచి కాయలు కాచినవి(38). తన రూపమును సార్థకము చేయుట కొరకు తండ్రి వంశమును భూషితము చేయుట కొరకు మన్మథుని అనుగ్రహించుట కొరకు నా చెలికత్తె మహేశ్వరుని ఉద్దేశించి (39) నారదుని ఉపదేశముచే మిక్కిలి తీవ్రమగు తపస్సును చేయుచున్నది. ఓ తపశ్శాలీ! ఆమె కోరిక ఎందువలన నెరవేరదు? (40)

ఓ బ్రాహ్మణ శ్రేష్టా! నీవు అడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పితిని. నా చెలియొక్క మనోరథమును ప్రీతితో వివరించితిని నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (41)

 బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ విజయ యొక్క ఆ యాథార్థ వచనములను విని బ్రహ్మచారి రూపములో నున్న ఆ రుద్రుడు నవ్వి ఇట్లనెను.(42)

బ్రహ్మచారి ఇట్లు పలికెను-

ఈ చెలికత్తె చెప్పిన మాటలో పరిహాసము ఉన్నట్లు తోచుచున్నది. ఈ వచనము యథార్ధమైనచో ఈ దేవి తన నోటితో ఆ మాటను చెప్పు గాక! (43)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి ఇట్లు పలుకగా, అపుడు పార్వతీదేవి తన నోటితో ఆ బ్రాహ్మణునితో నిట్లనెను(44)

శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహిత యందతి పార్వతీ ఖండలో శివాజటిల సంవాదమనే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (44).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 110 / Viveka Chudamani - 110🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 24. సమాధి స్థితి - 6 🍀*

368. విశ్రాంతి ప్రదేశములో జీవించుట వలన జ్ఞానేంద్రియములను అదుపులో ఉంచవచ్చు. ఇంద్రియాలను అదుపులో ఉంచిన మనస్సు అదుపులో ఉంటుంది. మనస్సు అదుపులో ఉండుట వలన అహంభావము నశిస్తుంది. అందువలన యోగి ఏవిధమైన అడ్డంకిలేని బ్రహ్మానంద స్థితిని చేరవచ్చును. ఆ కారణముగా ప్రతిస్పందన ఉన్న వ్యక్తి ఎల్లప్పుడు తన మనస్సును అదుపులో ఉంచుకొనుటకు ప్రయత్నించాలి. 

369. వాక్‌ను అదుపులో ఉంచుకొనుట వలన బుద్దిలోని మనో స్థితులను అదుపులో ఉంచుకొనవచ్చు. మనో స్థితులు అదుపులో ఉంచుకొనుట వలన బుద్ది అదుపులో ఉంటుంది. అపుడు ఆ బుద్దిని కూడా అదుపులో ఉంచి దానిని శాశ్వతమైన ఆత్మలోకలిపివేయాలి. అపుడే ఉన్నతమైన శాంతి లభిస్తుంది. అదే సమాధి స్థితి. 

370. శరీరము, ప్రాణము, శరీర భాగాలు, మనస్సు, బుద్ది మరియు మనస్సు యొక్క పరిధిలో ఉన్న ఇతరములు అన్నింటిని యోగి వాటి మూల స్థితి అయిన పరమాత్మలో లీనం చేయాలి. 

371. ఎపుడైతే ఇవన్నీ విలీనమవుతాయో అపుడు మనిషి యొక్క స్పందనలు తెలికగా బాహ్యము నుండి విడిపోయి అంతములేని బ్రహ్మానంద స్థితి అనుభవములోనికి వస్తుంది. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 110 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 24. Samadhi State - 6 🌻*

368. Living in a retired place serves to control the sense-organs, control of the senses helps to control the mind, through control of the mind egoism is destroyed; and this again gives the Yogi an unbroken realisation of the Bliss of Brahman. Therefore the man of reflection should always strive only to control the mind.

369. Restrain speech in the Manas, and restrain Manas in the Buddhi; this again restrain in the witness of Buddhi, and merging that also in the Infinite Absolute Self, attain to supreme Peace.

370. The body, Pranas, organs, manas, Buddhi and the rest – with whichsoever of these supervening adjuncts the mind is associated, the Yogi is transformed, as it were, into that.

371. When this is stopped, the man of reflection is found to be easily detached from everything, and to get the experience of an abundance of everlasting Bliss.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 62 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻. త్రిగుణములు 🌻*

కుండలో ఉన్న మట్టికి కుండ అంటదు. కాని మట్టి వలననే కుండ పుట్టుచున్నది. 

 అట్లే మనలో నున్న ఈశ్వరునకు గుణములంటవు. వాని నుండియే గుణములు పుట్టుచున్నవి.  

ఉప్పు, పంచదార నీటిలో కరగిపోవును. అప్పుడు కూడ అవి నీటికంటవు. ఆవిరి యంత్రమున నీటినావిరి చేసినచో స్వచ్ఛమైన నీరు వేరుగను, ఉప్పు మొదలగు మూడు ద్రవ్యములు వేరుగను వచ్చును.  

అట్లే ప్రళయమున త్రిగుణములు దేవునియందు మాయమగును. మరల సృష్టిలో వేరుగా వ్యక్తమై సృష్టికి ద్రవ్యములగును.

✍🏼 *మాస్టర్ ఇ.కె.*
భాగవతము 2-84
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 51 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 SMOKELESS FLAME 🍀*

*🕉 Wherever you see light, feel worshipful. The temple is there. 🕉*

Look at the mysteries of light. Just a small flame is the most mysterious thing in the world, and the whole of life depends on it. The same flame is burning in you. That's why continuous oxygen is needed, because the flame cannot burn without oxygen. 

This is why yoga emphasizes breathing deeply, breathing more and more oxygen so that your life burns deeper and the flame becomes clearer and no smoke arises in you--so that you can attain a smokeless flame. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 296 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 296 -1 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।*
*అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀*

*🌻 296 -1. 'అనాది నిధనా' 🌻* 

ఆది, అంతము లేనిది శ్రీమాత అని అర్థము. అనాది అను పదమునకు వివరణము ఇట్లున్నది. 'ద' అనగా 8. 'అ' అనగా 0. సంస్కృతమున సంఖ్యలను ఎడమ వైపునుండి పలుకుదురు. అందువలన 08 - 80 గ మారును. ఆది 80 అయి నపుడు, అనాది అనగా 80 కానిది. 80 రకములైన విఘాతములు అమృతత్వమునకు కలవని, వీని వలన జీవుడు మరణము ననుభవించునని శాస్త్రములు తెలుపుచున్నవి. ఈ 80 మరణ సాధనములను తొలగించునది శ్రీదేవి అని రహస్యార్ధము.

పామరులగు మానవులు ఒక మరణమునే చూతురు. నిజమున కనేక మరణములు కలవు. బ్రహ్మత్వమును కోల్పోవుటయే నిజమగు మరణము. బ్రహ్మత్వమును పొందుట వలననే జీవుడు అన్ని విధములగు మరణముల నుండి ముక్తి చెందును. పాశ మరణములు, వధ మరణములు అను రెండు విధములైన మరణములు గలవు. వధ మరణములు 28. పాశ మరణములు 52. మొత్తము 80 మరణములు జీవుడు అనుభవించును. అహంకారము వలన 28 విధములగు మరణములు కలుగును. ఆశాపాశము వలన 52 విధములగు మరణములు కలుగును. 

బుద్ధి నశించినపుడు ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు, పదకొండునూ, ధర్మరహితమైన కార్యముల నొనర్చును. దాని వలన జీవునికి నష్టము కలుగును. అపుడు జీవుడు తుష్టి కొరకై రకరకములైన అపచారములు చేయును. అది పదిహేడు రకములుగ నుండునని లింగపురాణము తెలుపు చున్నది. 

సంపూర్ణత చెందుటకు తొమ్మిది తుష్టులు, ఎనిమిది సిద్ధులు అవసరమై యున్నవి. వీటికవరోధము లేర్పడుట కూడ జీవ వధయే. తొమ్మిది తుష్టులు ఈ విధముగ నున్నవి.

1. అష్ట ప్రకృతులను అధిగమించుట.
2. సన్యాస స్థితిని పొందుట (ఇష్టాయిష్టములు దాటుట)
3. కాలము వలన అన్నియూ ఫలించునను విశ్వాసము కలుగుట.
4. భగవంతుడు తప్పక అనుగ్రహించునను విశ్వాసము కలుగుట. 
5. శబ్దము వలన ఆనందమును పొందుట.
6. స్పర్శ వలన ఆనందమును పొందుట.
7. రూపము వలన ఆనందమును పొందుట.
8. రుచి వలన ఆనందమును పొందుట.
9. వాసన వలన ఆనందమును పొందుట.

ఇందు మొదటి నాలుగు తుష్టులు అంతః తుష్టులు. తరువాత ఐదు తుష్టులు బాహ్య తుష్టులు. ఇవి కలుగని వారు సంపూర్ణత వైపునకు పోజాలరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 296-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |*
*ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀*

*🌻 296. Anādi-nidhanā अनादि-निधना (296) - 1 🌻*

She has neither a beginning nor an end. The nature of the Brahman is described, who alone is infinite. 

Elation is said to be of two kinds. The first kind is having a feeling of Self-realisation, though one is miles away from realising the Brahman. This illusion is considered as an impediment to God-realization (Self-realization). Since this is the cause of māyā, She will remove this kind of māyā for those, who are worthy of making spiritual progress.  

The second type is that certain siddhi-s that are derived during spiritual progression. For example the intuitive power, sudden realization of the Brahman like a flash possibly from the words of one’s guru or somebody, an unexpected meeting with a sage who could transfer the divine energy by a mere look, etc.   

Sudden chance, which makes a person to reach new heights both materially and spiritually also, happens at Her discretion. Since She is the cause for such elations and there is no beginning or end for such of Her activities, She is called anādi-nidhanā. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment