గీతోపనిషత్తు -234


🌹. గీతోపనిషత్తు -234 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 17 -1

🍀 16 -1. బ్రహ్మసృష్టి - బ్రహ్మ సృష్టి వేయి యుగములు పగళ్ళు, వేయి యుగములు రాత్రులుగ నెరుగుము. ఒక మన్వంతరమున 720 యుగము లుండును. అట్టివి 14 యుగము లనగా 980 యుగములు. సంధి కాలముతో వేయి యుగముల కాలపరిమాణమని పెద్దలు చెప్పుచుందురు. అట్లే వేయి యుగములు బ్రహ్మరాత్రి యుండును. అనగా ఒక దినమునందు (పగలు + రాత్రి) 2,000 యుగము లగును. 🍀

సహస్రయుగపర్యంత మహ ర్యద్మహ్మణో విదు: |
రాత్రిం యుగసహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః || 17


తాత్పర్యము : బ్రహ్మ సృష్టి వేయి యుగములు పగళ్ళు, వేయి యుగములు రాత్రులుగ నెరుగుము.

వివరణము : ఒక సృష్టికర్త యొక్క ఆయః పరిమాణము వంద సంవత్సరములని, అనగా 36,500 రోజులు. అందు ఒక రోజు యందు ఒక పగలు, ఒక రాత్రి యున్నవి. పగలెంత కాల ముండునో, రాత్రియు అంతే కాల ముండును. ఒక పగలు పరిమాణము ఈ క్రింది విధముగ నున్నది.


14 మన్వంతరములు ఒక పగలు.
ఒక మన్వంతరమున 72 మహాయుగము లుండును.
ఒక మహాయుగమున 43,20,000 సంవత్సరము లుండును.
ఒక మహాయుగ మనగా కలి యుగము : 4,32,000 సంవత్సరములు
ద్వాపర యుగము : 8,64,000 సంవత్సరములు
త్రేతా యుగము : 12,96,000 సంవత్సరములు
కృత యుగము : 17,28,000 సంవత్సరములు

43,20,000 సంవత్సరములు బ్రహ్మదేవుని పగలెంత కాలపరిమాణము కలిగియున్నదో, రాత్రికూడ అంతే కాలపరిమాణము కలిగియుండును. ఒక పగలే వేయి యుగములు. అట్లే రాత్రి కూడ వేయి యుగములు. ఒక మన్వంతరమున 72 మహాయుగము లుండును. ఒక మహా

యుగమున పది యుగము లుండును.

అనగా ఒక మన్వంతర మున 720 యుగము లుండును. అట్టివి 14 యుగము లనగా 980 యుగములు. సంధి కాలముతో వేయి యుగముల కాలపరిమాణమని పెద్దలు చెప్పుచుందురు. అట్లే వేయి యుగములు బ్రహ్మరాత్రి యుండును. అనగా ఒక దినమునందు (పగలు + రాత్రి) 2,000 యుగము లగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Aug 2021

No comments:

Post a Comment