🌹. వివేక చూడామణి - 110 / Viveka Chudamani - 110🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 24. సమాధి స్థితి - 6 🍀
368. విశ్రాంతి ప్రదేశములో జీవించుట వలన జ్ఞానేంద్రియములను అదుపులో ఉంచవచ్చు. ఇంద్రియాలను అదుపులో ఉంచిన మనస్సు అదుపులో ఉంటుంది. మనస్సు అదుపులో ఉండుట వలన అహంభావము నశిస్తుంది. అందువలన యోగి ఏవిధమైన అడ్డంకిలేని బ్రహ్మానంద స్థితిని చేరవచ్చును. ఆ కారణముగా ప్రతిస్పందన ఉన్న వ్యక్తి ఎల్లప్పుడు తన మనస్సును అదుపులో ఉంచుకొనుటకు ప్రయత్నించాలి.
369. వాక్‌ను అదుపులో ఉంచుకొనుట వలన బుద్దిలోని మనో స్థితులను అదుపులో ఉంచుకొనవచ్చు. మనో స్థితులు అదుపులో ఉంచుకొనుట వలన బుద్ది అదుపులో ఉంటుంది. అపుడు ఆ బుద్దిని కూడా అదుపులో ఉంచి దానిని శాశ్వతమైన ఆత్మలోకలిపివేయాలి. అపుడే ఉన్నతమైన శాంతి లభిస్తుంది. అదే సమాధి స్థితి.
370. శరీరము, ప్రాణము, శరీర భాగాలు, మనస్సు, బుద్ది మరియు మనస్సు యొక్క పరిధిలో ఉన్న ఇతరములు అన్నింటిని యోగి వాటి మూల స్థితి అయిన పరమాత్మలో లీనం చేయాలి.
371. ఎపుడైతే ఇవన్నీ విలీనమవుతాయో అపుడు మనిషి యొక్క స్పందనలు తెలికగా బాహ్యము నుండి విడిపోయి అంతములేని బ్రహ్మానంద స్థితి అనుభవములోనికి వస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 110 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 24. Samadhi State - 6 🌻
368. Living in a retired place serves to control the sense-organs, control of the senses helps to control the mind, through control of the mind egoism is destroyed; and this again gives the Yogi an unbroken realisation of the Bliss of Brahman. Therefore the man of reflection should always strive only to control the mind.
369. Restrain speech in the Manas, and restrain Manas in the Buddhi; this again restrain in the witness of Buddhi, and merging that also in the Infinite Absolute Self, attain to supreme Peace.
370. The body, Pranas, organs, manas, Buddhi and the rest – with whichsoever of these supervening adjuncts the mind is associated, the Yogi is transformed, as it were, into that.
371. When this is stopped, the man of reflection is found to be easily detached from everything, and to get the experience of an abundance of everlasting Bliss.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
01 Aug 2021
No comments:
Post a Comment