శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 296 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 296 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 296 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 296 -1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀

🌻 296 -1. 'అనాది నిధనా' 🌻


ఆది, అంతము లేనిది శ్రీమాత అని అర్థము. అనాది అను పదమునకు వివరణము ఇట్లున్నది. 'ద' అనగా 8. 'అ' అనగా 0. సంస్కృతమున సంఖ్యలను ఎడమ వైపునుండి పలుకుదురు. అందువలన 08 - 80 గ మారును. ఆది 80 అయి నపుడు, అనాది అనగా 80 కానిది. 80 రకములైన విఘాతములు అమృతత్వమునకు కలవని, వీని వలన జీవుడు మరణము ననుభవించునని శాస్త్రములు తెలుపుచున్నవి. ఈ 80 మరణ సాధనములను తొలగించునది శ్రీదేవి అని రహస్యార్ధము.

పామరులగు మానవులు ఒక మరణమునే చూతురు. నిజమున కనేక మరణములు కలవు. బ్రహ్మత్వమును కోల్పోవుటయే నిజమగు మరణము. బ్రహ్మత్వమును పొందుట వలననే జీవుడు అన్ని విధములగు మరణముల నుండి ముక్తి చెందును. పాశ మరణములు, వధ మరణములు అను రెండు విధములైన మరణములు గలవు. వధ మరణములు 28. పాశ మరణములు 52. మొత్తము 80 మరణములు జీవుడు అనుభవించును. అహంకారము వలన 28 విధములగు మరణములు కలుగును. ఆశాపాశము వలన 52 విధములగు మరణములు కలుగును.

బుద్ధి నశించినపుడు ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు, పదకొండునూ, ధర్మరహితమైన కార్యముల నొనర్చును. దాని వలన జీవునికి నష్టము కలుగును. అపుడు జీవుడు తుష్టి కొరకై రకరకములైన అపచారములు చేయును. అది పదిహేడు రకములుగ నుండునని లింగపురాణము తెలుపు చున్నది.

సంపూర్ణత చెందుటకు తొమ్మిది తుష్టులు, ఎనిమిది సిద్ధులు అవసరమై యున్నవి. వీటికవరోధము లేర్పడుట కూడ జీవ వధయే. తొమ్మిది తుష్టులు ఈ విధముగ నున్నవి.

1. అష్ట ప్రకృతులను అధిగమించుట.

2. సన్యాస స్థితిని పొందుట (ఇష్టాయిష్టములు దాటుట)

3. కాలము వలన అన్నియూ ఫలించునను విశ్వాసము కలుగుట.

4. భగవంతుడు తప్పక అనుగ్రహించునను విశ్వాసము కలుగుట.

5. శబ్దము వలన ఆనందమును పొందుట.

6. స్పర్శ వలన ఆనందమును పొందుట.

7. రూపము వలన ఆనందమును పొందుట.

8. రుచి వలన ఆనందమును పొందుట.

9. వాసన వలన ఆనందమును పొందుట.

ఇందు మొదటి నాలుగు తుష్టులు అంతః తుష్టులు. తరువాత ఐదు తుష్టులు బాహ్య తుష్టులు. ఇవి కలుగని వారు సంపూర్ణత వైపునకు పోజాలరు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 296-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |
ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀

🌻 296. Anādi-nidhanā अनादि-निधना (296) - 1 🌻


She has neither a beginning nor an end. The nature of the Brahman is described, who alone is infinite.

Elation is said to be of two kinds. The first kind is having a feeling of Self-realisation, though one is miles away from realising the Brahman. This illusion is considered as an impediment to God-realization (Self-realization). Since this is the cause of māyā, She will remove this kind of māyā for those, who are worthy of making spiritual progress.

The second type is that certain siddhi-s that are derived during spiritual progression. For example the intuitive power, sudden realization of the Brahman like a flash possibly from the words of one’s guru or somebody, an unexpected meeting with a sage who could transfer the divine energy by a mere look, etc.

Sudden chance, which makes a person to reach new heights both materially and spiritually also, happens at Her discretion. Since She is the cause for such elations and there is no beginning or end for such of Her activities, She is called anādi-nidhanā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Aug 2021

No comments:

Post a Comment