నిర్మల ధ్యానాలు - ఓషో - 39
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 39 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనసు నిశ్చలం కావడమన్నది అతి ముఖ్యం. నువ్వు నీలో కూచుని పరిశీలించు. ఎట్లాంటి నిర్ణయం చెయ్యకుండా మనసు ఆడే ఆటల్ని పరిశీలించు. 🍀
వీలయినంత వరకు నిశ్శబ్దంగా వుండు. మరింత మరింత నిశ్చలనంగా కూచో. కేవలం శారీరకంగానే కాదు. అది కూడా పరిస్థితిని సృష్టించడానికి సహకరిస్తుంది. కానీ అదే అంతం కాదు. అది ఆరంభం మాత్రమే. మనసు నిశ్చలం కావడమన్నది అతి ముఖ్యం. మనసు తన అడ్డూ ఆపూ లేని వాగుడును కట్టి పెట్టడం ముఖ్యం. దాన్ని ఆపితీరాలి. మనం ప్రయత్నించం. అంతే. ఇది చాలా సులభమయిన పద్దతి.
నువ్వు నీలో కూచుని పరిశీలించు. ఎట్లాంటి నిర్ణయం చెయ్యకుండా మనసు ఆడే ఆటల్ని పరిశీలించు. అది మంచివనీ, చెడ్డవనీ అనకు. వాటిని ఆమోదించకు, వ్యతిరేకించకు. సంబంధం లేనట్లు నిర్మలంగా వుండు. ఆ నిశ్శబ్ద స్థితి నుంచీ నీకు అవగాహన కలుగుతుంది. మొదట మనసు తన పాత అతి తెలివితేటల్ని ప్రదర్శిస్తుంది. వాటిలో నువ్వు చలించకుంటే చిరాకు పడుతుంది. నిన్ను ఆందోళనకు గురి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది.
దాంతో ఘర్షించకు. దూరంగా వుండిపో. చాలాసార్లు నువ్వు దాని మాయలో పడతావు. అప్పుడు స్పృహలోకి వచ్చి వెనక్కి తగ్గు. నిన్ను నువ్వు వెనక్కి లాగు. మళ్ళీ పరిశీలనలో పడు. ఆలోచన మొదలవుతుంది. దాన్ని చూడు. వేల ఆలోచనలు సాగుతాయి. వాటిని చూడు. అవి ఎలా వచ్చాయో అలాగే వెళతాయి. ఆ విషయం గుర్తించు. వాటి గురించి ఎట్లాంటి నిర్ణయాలకూ లోనుగాకు. కేవలం శాస్త్రీయంగా, నిర్మల పరిశీలన చెయ్యి.
ఒక రోజు హఠాత్తుగా అక్కడ ఏమీ వుండదు. అది నిర్మల నిశ్శబ్ద దినం. అది అంతకు ముందు నీకు అనుభవం లేనిది. అది నిన్ను వదిలి పెట్టదు. నీతోనే వుంటుంది. అది నీ ఆత్మ అవుతుంది. నీకు స్వేచ్ఛానిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
02 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment