శ్రీ శివ మహా పురాణము - 422
🌹 . శ్రీ శివ మహా పురాణము - 422🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 24
🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 7 🌻
దృఢముగా బంధించే ఈ ఇంద్రియ సుఖములు ఎల్లవేళలా వృద్ధి పొందుంచుండును. భోగలాలసతతో నిండిన మనస్సు గలవానికి మోక్షప్రాప్తి స్వప్నమునందైననూ అసంభవము (63). వివేకవంతుడగు మానవుడు సుఖమును కోరువాడైనచో విషయ సుఖములను విషమునువలె విడువవలెను. విషయ సుఖములు విషమువంటివని పెద్దలు చెప్పెదరు. ఇంద్రియసుఖములు మానవుని నాశమును గొనితెచ్చును (64).
భోగలాలసునితో మాటలాడు వ్యక్తి కూడ క్షణములో పతితుడగును. ఇంద్రియ సుఖములు మానవుని నాశమును గొని తెచ్చును (64). భోగలాలసునితో మాటలాడు వ్యక్తి కూడ క్షణములో పతితుడగును. ఇంద్రియ సుఖములు పంచదార స్ఫటికము కలిపిన మద్యము వంటి వని ఆచార్యులు చెప్పుచున్నారు (65). సర్వజ్ఞానములు నాకు ఎరుకయే. అయిననూ, మీ ప్రార్థనను నేను సఫలము చేసెదను (66).
నేను మాత్రమే భక్తులకు అధీనుడనై సర్వకార్యములను వారి ఇచ్ఛను అనుసరించి చేయుదును. భక్తుల కొరకై నేను ఉచితము కాని పనిని కూడ చేసెదనని ముల్లోకములలో ప్రసిద్ధి గలదు (67). భీమ మహారాజుచే బంధింపబడిన సుదక్షిణుడనే కామరూప దేశాధిపతి యొక్క ప్రతిజ్ఞను సఫలము చేసితిని (68).
ముక్కంటినగు నేను గౌతముని కష్టములను తొలగించి, సుఖములను కలిగించి, ఆయనకు కష్టమును కలిగించిన దుష్టులకు కఠిన శాపములనిచ్చి యుంటిని (69). భక్తవాత్సల్య మే నా స్వరూపము గనుకనే, నేను దేవతలకొరకై విషమును త్రాగితిని. ఓ దేవతలారా! నేను అన్ని వేళలా దేవతల కష్టమును యత్నపూర్వకముగా నివారించియుంటిని (70).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment