మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 50
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 50 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చేయుట - చేయుంచుట 🌻
జీవించుట అనగా జీవుడు ప్రాణమును, దేహమును సద్వినియోగము చేయుట. ఇందు గల సామర్థ్యము జీవుడు కర్మాచరణము చేయుటలో లేదు. ప్రాణ, దేహాదుల చేత చేయించుటలో ఉన్నది.
ఈ చేయించుట సద్వినియోగమైనచో సుఖము లేక మోక్షస్థితి కలుగును. సద్వినియోగము జరగనిచో బంధము, దుఃఖము కలుగును.
లోకమున కూడ మంచి పనిని ఆచరించుటలో కన్నా చేయించుటలో ఎక్కువ సామర్థ్యము కావలెను. ఆచరించనిచో చేయించుటకు సామర్థ్యము కలుగదు. ఆచరించువాడు మాత్రమే మంచి పనులను చేయించగలుగును.
చేయించవలెనన్నచో మనము చేయదలచుకొనిన మంచి పనులను పంచిపెట్టవలెను. దానితో పాటు ఆ పనుల వలన కలుగు సుఖము, లాభము, పేరు ప్రఖ్యాతులను కూడ పంచిపెట్టవలసి యుండును.
దానికి మంచితనము కావలెను. తనకు చెందవలసిన వానిని ఇతరులు విశేషముగా పొందుచున్నప్పుడు అవి తనవి కావని తెలియగల వైరాగ్యబుద్ధి యుండవలెను.
ఇవికలవాడు మాత్రమే లోకమునకు దారి చూపగలవాడగును. అట్లుగాక తానే మంచి పనులన్నియు చేయవలెనని సిద్ధపడువాడు స్వార్థపరుడై దుఃఖించును.
🌹 🌹 🌹 🌹 🌹
05 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment