గీతోపనిషత్తు -237
🌹. గీతోపనిషత్తు -237 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 18 - 2
🍀 17 - 2. వ్యక్తా వ్యక్తములు - ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలము నుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. 🍀
అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తతైవావ్యక్త సంజ్ఞకే || 18
తాత్పర్యము : అహస్సు ఆగమము నందు అవ్యక్తము నుండి సమస్తము క్రమముగ వ్యక్తమగునని, అట్లే సాయం సంధ్యా గమనము నుండి ప్రారంభమగు రాత్రికాలమున అంతయు అవ్యక్తము లోనికి పోవుననియు ఈ శ్లోకము తెలియపరుచు చున్నది.
వివరణము : ఇట్లు వ్యక్తము, అవ్యక్తము జీవులను అనంతముగ నడిపించుచు నుండును. ఎరుక పొందుటవలన వ్యక్తము, ఎరుక పోవుటవలన అవ్యక్తము, ఎరుకలో నున్నపుడు జ్ఞానము, ఎరుక కోల్పోవునపుడు అజ్ఞానము- ఇట్లు బ్రహ్మసృష్టియందు సమస్తము వ్యక్తావ్యక్తముల నడుమ తిరుగాడుచుండును.
ఇట్లనంతముగ సాగును. బ్రహ్మసృష్టి కూడ వ్యక్తములోనికి వచ్చుట, అవ్యక్తములోనికి పోవుట, మరల మరియొక బ్రహ్మ వచ్చుట, అతడి సృష్టికాలము ముగియగనే అతడు, అతడి సృష్టి అవ్యక్తములోనికి చనుట- అనంత కాలమున జరుగుచున్నదని ఋషిదర్శనము. ఇప్పటి కెందరు బ్రహ్మలు వచ్చి వెళ్లిరో ఎవ్వరికిని తెలియదు.
“వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, వారెవ్వరో కూడ ఎవ్వరికిని తెలియదు. ఇంకెంతమంది వత్తురో కూడ ఎవ్వరికిని తెలియదు.” సృష్టితోపాటు సృష్టికర్తకూడ అవ్యక్తమున లీనమై పోవును. నిద్రయందు మన మెట్లుండమో, అట్లే ప్రళయమందు సృష్టికర్త కూడ లీనమైపోవును.
కనుకనే భగవానుడు పూర్వము తెలుపబడిన శ్లోకములలో బ్రహ్మసృష్టి యంతయు చక్రాకృతిన తిరుగుతూ జన్మకర్మలతో నిండియుండునని, పునర్జన్మము కర్మము ఉండితీరునని తెలిపెను. సత్యలోకము నుండి భూలోకము వరకు గల అన్ని లోకముల యందలి జీవులు, ఇట్లు అవశ్యులై తిరుగు చుందురని, ఎవ్వరికిని నివృత్తి లేదని తెలుపుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
09 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment