9-AUGUST-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 237 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 438🌹 
3) 🌹 వివేక చూడామణి - 113 / Viveka Chudamani - 113🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -65🌹  
5) 🌹 Osho Daily Meditations - 54🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 113🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -237 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 18 - 2
 
*🍀 17 - 2. వ్యక్తా వ్యక్తములు - ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలము నుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. 🍀*

అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తతైవావ్యక్త సంజ్ఞకే || 18

తాత్పర్యము : అహస్సు ఆగమము నందు అవ్యక్తము నుండి సమస్తము క్రమముగ వ్యక్తమగునని, అట్లే సాయం సంధ్యా గమనము నుండి ప్రారంభమగు రాత్రికాలమున అంతయు అవ్యక్తము లోనికి పోవుననియు ఈ శ్లోకము తెలియపరుచు చున్నది. 

వివరణము : ఇట్లు వ్యక్తము, అవ్యక్తము జీవులను అనంతముగ నడిపించుచు నుండును. ఎరుక పొందుటవలన వ్యక్తము, ఎరుక పోవుటవలన అవ్యక్తము, ఎరుకలో నున్నపుడు జ్ఞానము, ఎరుక కోల్పోవునపుడు అజ్ఞానము- ఇట్లు బ్రహ్మసృష్టియందు సమస్తము వ్యక్తావ్యక్తముల నడుమ తిరుగాడుచుండును. 

ఇట్లనంతముగ సాగును. బ్రహ్మసృష్టి కూడ వ్యక్తములోనికి వచ్చుట, అవ్యక్తములోనికి పోవుట, మరల మరియొక బ్రహ్మ వచ్చుట, అతడి సృష్టికాలము ముగియగనే అతడు, అతడి సృష్టి అవ్యక్తములోనికి చనుట- అనంత కాలమున జరుగుచున్నదని ఋషిదర్శనము. ఇప్పటి కెందరు బ్రహ్మలు వచ్చి వెళ్లిరో ఎవ్వరికిని తెలియదు. 

“వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, వారెవ్వరో కూడ ఎవ్వరికిని తెలియదు. ఇంకెంతమంది వత్తురో కూడ ఎవ్వరికిని తెలియదు.” సృష్టితోపాటు సృష్టికర్తకూడ అవ్యక్తమున లీనమై పోవును. నిద్రయందు మన మెట్లుండమో, అట్లే ప్రళయమందు సృష్టికర్త కూడ లీనమైపోవును. 

కనుకనే భగవానుడు పూర్వము తెలుపబడిన శ్లోకములలో బ్రహ్మసృష్టి యంతయు చక్రాకృతిన తిరుగుతూ జన్మకర్మలతో నిండియుండునని, పునర్జన్మము కర్మము ఉండితీరునని తెలిపెను. సత్యలోకము నుండి భూలోకము వరకు గల అన్ని లోకముల యందలి జీవులు, ఇట్లు అవశ్యులై తిరుగు చుందురని, ఎవ్వరికిని నివృత్తి లేదని తెలుపుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 436🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 27

*🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 3 🌻*

బ్రాహ్మణుడిట్లు పలికెను-

నీవు సూర్యతేజస్సును విడిచిపెట్టి మిణుగురు పురుగుల కాంతిని గోరుచున్నావు పట్టువస్త్రములను వీడి చర్మవస్త్రములను గోరుచున్నావు(22) నీవు గృహమునందు నివాసమును విడిచిపెట్టి వనమునందు నివసించ గోరుచున్నావు. ఓ దేవదేవీ! నీవు ఉత్తమమగు నిధిని విడిచిపెట్టి ఇనుపముక్కను కోరుచున్నావు '23). 

నీవు ఇంద్రుడు మొదలగు లోకపాలురను విడిచిపెట్టి శివుని గురించి వ్రతముననుష్ఠించుచున్నావు. లోకులు ఈ చర్యను మంచిగా చెప్పుకొనరు. నీ చర్య విడ్డూరముగా కన్పట్టుచున్నది(24). పద్మ పత్రముల వంటి కన్నులు గల నీవెక్కడ? ఆ ముక్కంటి యెక్కడ? చంద్రుని వలె ఆహ్లాదకరమగు ముఖముగల నీవెక్కడ ? ఆ అయిదు ముఖముల శివుడెక్కడ? (25) 

నీ శిరస్సుపై జడ దివ్య సర్పమువలె భాసించుచున్నది. శివుని జటాజూటము లోకములో చాల ప్రసిద్ధి చెందినట్లున్నది(26). నీ శరీరమునందు చందనము ఉండగా, శివుని శరీరముపై చితాభస్మ ఉండును. నీ పట్టు చీర యెక్కడ? శంకరుని గజచర్మము ఎక్కడ? (27). 

నీ దివ్యములగు అలంకారములెక్కడ? శంకరుని సర్పములెక్కడ? నిన్ను సేవించుటకు ఉత్సాహపడే అందరు దేవతలెక్కడ? భూతములకు ఇచ్చు ఆహారమును ఇష్టపడే శివుడెక్కడ?(28) మృదంగ ధ్వని ఎక్కడ? ఆ శివుని డమరుకము యొక్క శబ్ధము ఎక్కడ? భేరీ ధ్వనులు ఎక్కడ? అశుభమగు కొమ్ము బూరాల ధ్వని యెక్కడ? (29). ఢక్కా శబ్దమెక్కడ? గలమనే వాద్యము యొక్క అమంగళ ధ్వని ఎక్కడ? నీ ఉత్తమమగు సౌందర్యము శివునకు అర్హమైనది కానే కాదు (30) 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 113 / Viveka Chudamani - 113🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 25. వైరాగ్య స్థితి - 3 🍀*

378. మనస్సును స్థిరముగా బ్రహ్మముపై ఉంచి, బాహ్య జ్ఞానేంద్రియములను వాటి వాటి కేంద్రములలో ఉంచి, శరీరమును స్థిరపర్చి ఏవిధమైన ఇతర ఆలోచనలు లేకుండా బ్రహ్మముపై మనస్సును నిల్పి దానితో ఏకత్వమును సాధించుము. అపుడే బ్రహ్మజ్ఞానము యొక్క సారము పూర్తిగా నీ ఆత్మలో ఏవిధమైన అడ్డంకులు లేకుండా ఆస్వాదించగలవు. ఇతరమైన వస్తు సముదాయము వలన ఏమి లాభము? అవి పూర్తిగా డొల్ల మాత్రమే. 

379. అనాత్మ భావము యొక్క ఆలోచనను పూర్తిగా తొలగించి, (ఎందువలనంటే అవి చెడును గలిగించి దుఃఖానికి కారణమవుతాయి), నీవు ఆత్మను గూర్చి, దాని ఆనంద స్థితిని గూర్చి ఆలోచించి పూర్తి విముక్తిని సాధించుము.

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 113 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 25. Vairagya (Dispassion) - 3 🌻*

378. Fixing the mind firmly on the Ideal, Brahman, and restraining the external organs in their respective centres; with the body held steady and taking no thought for its maintenance; attaining identity with Brahman and being one with It – always drink joyfully of the Bliss of Brahman in thy own Self, without a break. What is the use of other things which are entirely hollow ?

379. Giving up the thought of the non-Self which is evil and productive of misery, think of the Self, the Bliss Absolute, which conduces to Liberation. 

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 64 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సుఖజీవనము 🌻

మానవుడు సుఖముగా జీవించవలెనన్న ఏది ప్రదానము- ధనమా? ఆరోగ్యమా? సత్ సంతానమా? 

ధనము వలన మానవుడు శారీరకముగా సుఖమును అనుభవించగలడే కానీ, మానసికముగా శాంతిని పొందలేడు. ఇక ఆరోగ్యము మానవునకు ముఖ్యమయినది. ఆరోగ్యవంతుడు కష్టపడి ధనము సంపాదించగలడు. కానీ, ఒక‌ ధనవంతుడు ఆరోగ్యమును‌ పొందలేడు. 

అయితే, ఈ ఆరోగ్యము శరీరానికా? మనస్సుకా? ఆరోగ్యవంతమయిన శరీరము కన్నా ఆరోగ్యవంతమయిన మనస్సు ప్రధానము. 

శారీరక రుగ్మతలకు కారణము కేవలము భౌతిక పరిస్థితులే కాక, మానసిక పరిస్థితులు కూడా కారణము అని పెద్దలు సూచించి ఉండిరి. ఇదే విధముగా రోగమునకు కాక, రోగికి చికిత్స చేయు విధానము హోమియోలో సూచించబడినది. 

కామక్రోధాదులు మానవుని ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే కాక శారీరక ఆరోగ్యమునకు కూడ శత్రువులే. కోపము, అసూయ, ద్వేషము మొదలగునవి శరీరములోని గ్రంథులపై ఎక్కువ ప్రభావమును చూపును. 

ఒకరిపై ద్వేషము, పగ, చికాకు కలిగిన వ్యక్తికి అన్నము హితముగా ఉండదు. నిద్రపోలేడు. ఆలోచనలతో సతమతమవుతూ ఉండును. 

ఈ ప్రభావము వలన నరములకు ఒత్తిడి కలిగి రక్తపు పోటు వచ్చును. గుండె, ఊపిరితిత్తులు దీని ప్రభావమునకు లోనయి రోగముల రూపముగా పరిణమించును. 

నేటి కాలమున మూడువంతుల రోగులు మానసిక కారణముల వ్యాధులకు లోనగుచున్నవారే.
✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 54 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 54. RELATING 🍀*

*🕉 The more centered you become, the more relaxed you become, the more possibility there is to enter into a relationship deeply. 🕉*

It is you who goes into a relationship. If you are not there-if you are tense, crippled, worried, and fragmented-who is going to go deeply into a relationship? Because of our fragmentedness, we are really afraid of getting into the deeper layers of a relationship, because then our reality will be revealed. Then you will have to open your heart, and your heart is just fragments. 

There is not one person inside you-you are a crowd. If you really love another and you open your heart, the other will think you are a public, not a person-that is the fear. That's why people go on having casual affairs. They don't want to go deep; just hit-and-run, just touching the surface and escaping before anything becomes a commitment. You only have sex and that too is impoverished, superficial. 

Only boundaries meet, but that is not love at all; it may be a bodily release, a catharsis, but it is no more than that. We can keep our masks if a relationship is not very intimate. Then when you smile, there is no need for you to smile, just the mask smiles. If you really want to go deep, there are dangers. You will have to go naked-and naked means with all the problems inside made known to the other.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 113 / Sri Lalita Sahasranamavali - Meaning - 113 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 113. అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ |*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ‖ 113 ‖ 🍀*

🍀 553. అగ్రగణ్యా - 
దేవతలందరిలో ముందుగా గణింపబడేది.

🍀 554. అచింత్యరూపా - 
చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికానిది.

🍀 555. కలికల్మషనాశినీ - 
కలియుగ మలినములను పోగొట్టునది.

🍀 556. కాత్యాయనీ - 
కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది.

🍀 557. కాలహంత్రీ - 
కాలమును హరించునది.

🍀 558. కమలాక్ష నిషేవితా -
 విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 113 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 113. agragaṇyā'cintyarūpā kalikalmaṣa-nāśinī |
kātyāyanī kālahantrī kamalākṣa-niṣevitā || 113 ||

🌻 553 ) Agra ganya -   
She who is at the top

🌻 554 ) Achintya roopa -   
She who is beyond thought

🌻 555 ) Kali kalmasha nasini -   
She who removes the ills of the dark age

🌻 556 ) Kathyayini -   
She who is Kathyayini in Odyana peetha or She who is the daughter of sage Kathyayana

🌻 557 ) Kala hanthri -   
She who kills god of death

🌻 558 ) Kamalaksha nishevitha -   
She who is being worshipped by the lotus eyed Vishnu

🌻 559 ) Thamboola pooritha mukhi -   
She whose mouth is filled with betel leaves , betel nut and lime

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment