మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 64
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 64 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సుఖజీవనము 🌻
మానవుడు సుఖముగా జీవించవలెనన్న ఏది ప్రదానము- ధనమా? ఆరోగ్యమా? సత్ సంతానమా?
ధనము వలన మానవుడు శారీరకముగా సుఖమును అనుభవించగలడే కానీ, మానసికముగా శాంతిని పొందలేడు. ఇక ఆరోగ్యము మానవునకు ముఖ్యమయినది. ఆరోగ్యవంతుడు కష్టపడి ధనము సంపాదించగలడు. కానీ, ఒక ధనవంతుడు ఆరోగ్యమును పొందలేడు.
అయితే, ఈ ఆరోగ్యము శరీరానికా? మనస్సుకా? ఆరోగ్యవంతమయిన శరీరము కన్నా ఆరోగ్యవంతమయిన మనస్సు ప్రధానము.
శారీరక రుగ్మతలకు కారణము కేవలము భౌతిక పరిస్థితులే కాక, మానసిక పరిస్థితులు కూడా కారణము అని పెద్దలు సూచించి ఉండిరి. ఇదే విధముగా రోగమునకు కాక, రోగికి చికిత్స చేయు విధానము హోమియోలో సూచించబడినది.
కామక్రోధాదులు మానవుని ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే కాక శారీరక ఆరోగ్యమునకు కూడ శత్రువులే. కోపము, అసూయ, ద్వేషము మొదలగునవి శరీరములోని గ్రంథులపై ఎక్కువ ప్రభావమును చూపును.
ఒకరిపై ద్వేషము, పగ, చికాకు కలిగిన వ్యక్తికి అన్నము హితముగా ఉండదు. నిద్రపోలేడు. ఆలోచనలతో సతమతమవుతూ ఉండును.
ఈ ప్రభావము వలన నరములకు ఒత్తిడి కలిగి రక్తపు పోటు వచ్చును. గుండె, ఊపిరితిత్తులు దీని ప్రభావమునకు లోనయి రోగముల రూపముగా పరిణమించును.
నేటి కాలమున మూడువంతుల రోగులు మానసిక కారణముల వ్యాధులకు లోనగుచున్నవారే.
✍️ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
09 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment