శ్రీ శివ మహా పురాణము - 436


🌹 . శ్రీ శివ మహా పురాణము - 436🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 27

🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 3 🌻


బ్రాహ్మణుడిట్లు పలికెను-

నీవు సూర్యతేజస్సును విడిచిపెట్టి మిణుగురు పురుగుల కాంతిని గోరుచున్నావు పట్టువస్త్రములను వీడి చర్మవస్త్రములను గోరుచున్నావు(22) నీవు గృహమునందు నివాసమును విడిచిపెట్టి వనమునందు నివసించ గోరుచున్నావు. ఓ దేవదేవీ! నీవు ఉత్తమమగు నిధిని విడిచిపెట్టి ఇనుపముక్కను కోరుచున్నావు '23).

నీవు ఇంద్రుడు మొదలగు లోకపాలురను విడిచిపెట్టి శివుని గురించి వ్రతముననుష్ఠించుచున్నావు. లోకులు ఈ చర్యను మంచిగా చెప్పుకొనరు. నీ చర్య విడ్డూరముగా కన్పట్టుచున్నది(24). పద్మ పత్రముల వంటి కన్నులు గల నీవెక్కడ? ఆ ముక్కంటి యెక్కడ? చంద్రుని వలె ఆహ్లాదకరమగు ముఖముగల నీవెక్కడ ? ఆ అయిదు ముఖముల శివుడెక్కడ? (25)

నీ శిరస్సుపై జడ దివ్య సర్పమువలె భాసించుచున్నది. శివుని జటాజూటము లోకములో చాల ప్రసిద్ధి చెందినట్లున్నది(26). నీ శరీరమునందు చందనము ఉండగా, శివుని శరీరముపై చితాభస్మ ఉండును. నీ పట్టు చీర యెక్కడ? శంకరుని గజచర్మము ఎక్కడ? (27).

నీ దివ్యములగు అలంకారములెక్కడ? శంకరుని సర్పములెక్కడ? నిన్ను సేవించుటకు ఉత్సాహపడే అందరు దేవతలెక్కడ? భూతములకు ఇచ్చు ఆహారమును ఇష్టపడే శివుడెక్కడ?(28) మృదంగ ధ్వని ఎక్కడ? ఆ శివుని డమరుకము యొక్క శబ్ధము ఎక్కడ? భేరీ ధ్వనులు ఎక్కడ? అశుభమగు కొమ్ము బూరాల ధ్వని యెక్కడ? (29). ఢక్కా శబ్దమెక్కడ? గలమనే వాద్యము యొక్క అమంగళ ధ్వని ఎక్కడ? నీ ఉత్తమమగు సౌందర్యము శివునకు అర్హమైనది కానే కాదు (30)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


09 Aug 2021

No comments:

Post a Comment