శ్రీ శివ మహా పురాణము - 444
🌹 . శ్రీ శివ మహా పురాణము - 444🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 29
🌻. శివపార్వతుల సంవాదము - 2 🌻
పూర్వము నేను దక్షకన్యనై జన్మించినపుడు నా తండ్రి నన్ను నీ కిచ్చి వివాహమును చేసినాడు. కాని ఆ సమయములో నీవు యథావిధిగా వివాహకార్యమును నిర్వర్తించలేదు (12).
నా తండ్రియకగు ఆ దక్షుడు గ్రహములను పూజించలేదు. గ్రహముల విషయములో అది పెద్ద పొరపాటుగా పరిణమించెను (13). హే ప్రభో! మహాదేవా! కావున, నీవు యథావిధిగా చేయతగుదువు. దేవతల కార్యసిద్ధికొరకై నీవు వివాహమాడుచున్నావు (14).
వివాహమును ఏరీతిగా నిర్వర్తించవలయునో, అదే రీతిని నీవు పాటించుము. ఇది తప్పని సరి. హిమవంతుడు తన కుమార్తె చేసిన శుభకరమగు తపస్సును గురించి చక్కగా తెలుసుకొనును గాక! (15)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఈ మాటను విని సదాశివుడు మిక్కిలి ప్రసన్నుడై చిరునవ్వుతో ప్రీతియుక్తముగా పార్వతితో నిట్లనెను (16)
శివుడిట్లు పలికెను-
ఓ దేవీ! మహేశ్వరీ! నా శ్రేష్ఠమగు వచనమును వినుము. చక్కని మంగళములు కల్గునట్లుగా, వికారములు లేని విధముగా, యథా యోగ్యముగా చేయుము (17). ఓ అందమగు మోము గలదానా! బ్రహ్మ మొదలగు ప్రాణులన్నియూ అనిత్యములు. ఓ భామినీ! ఈ కనబడే సర్వము వినాశియని తెలుసుకొనుము (18). నేను ఒక్కడినే అనేకముగా, నిర్గుణుడనై సగుణునిగా అయినాను. స్వప్రకాశముచే వెలుగొందు నేను పరప్రకాశముతో కూడిన వాడనైతిని (19). ఓ దేవీ! స్వతంత్రుడనగు నన్ను నీవు పరతంత్రునిగా చేసితివి. సర్వమును సృష్టించు ప్రకృతివి నీవే. నీవే మహామాయవు (20).
నేను మాయా మయమగు ఈ జగత్తు నంతనూ సృష్టించితిని. నా అమోఘమగు సంకల్పశక్తిచే నా అమోఘమగు సంకల్పశక్తిచే సృష్టింపబడిన ఈ జగత్తును నేను సర్వాత్మరూపుడనై ధరించి యున్నాను. సర్వాత్మభావము గల పుణ్యాత్ములు సర్వత్రా పరమాత్మను దర్శించువారై త్రిగుణాత్మకమగు ఈ జగత్తును ఆత్మయందు మాత్రమే అధిష్ఠితమై ఉన్నదిగా దర్శించెదరు (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
25 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment