మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 73-1


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 73-1 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆనందసూక్తము - 5-1 🌻


పరిణామక్రమము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు ప్రకృతి కనుగొనినది. అది మళ్ళీ మళ్ళీ సరికొత్త మృదువైన దేహన్ని (జన్మల పేరిట) ఇస్తున్నది. దాన్ని మనము ఇష్టమైనట్లు వినియోగించుకొంటున్నాము.

అందువల్ల అది పాడైపోతున్నది. బాహ్య వాతావరణానికి గురియైన మనస్సును అనేక పర్యాయములు వాడితే ఆ సున్నితత్వము పోయిన కెమెరావలె అవుతుంది.

అందుచేత వృద్ధాప్యము వచ్చేసరికి ఆహారపానీయాదులందు, నిద్ర, విశ్రాంతి, కామముల విషయములో విచ్చలవిడిగా వాడిన నిస్సత్తువగల దేహముతో మిగులుతున్నాము. అయితే ప్రకృతి మరో దేహాన్ని ఇవ్వటానికి ముచ్చటపడుతున్నది. దానికొరకే మృత్యువు. అది యీ దేహాన్ని తొలగిస్తుంది.

కాలాంతరములో సుకుమారమైన నునులేత శరీరాన్ని ప్రసాదించి 'బాగా తెలివితో వ్యవహరించు. ఆనందాన్ని కనుగొనేవరకు దానిని మరింత మెరుగైన రీతిలో వినియోగించు' అని వానిని ఆశీర్వదిస్తున్నది ప్రకృతి.

అలా అయినా మళ్ళీ మళ్ళీ శరీరాన్ని పాడుచేసే ప్రయోగాలు చేస్తూ కొన్ని వేల జన్మలు ఎత్తుతునే ఉన్నాము. అయితే ప్రకృతి ఎప్పుడూ నిరాశ చెందదు- విసిగి వేసారదు.


✍🏻 మాస్టర్ ఇ.కె‌‌.🌻

🌹 🌹 🌹 🌹 🌹


25 Aug 2021

No comments:

Post a Comment