1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం 21-సెప్టెంబర్-2021, శుభ గురువారం 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 257 🌹
3) 🌹. శివ మహా పురాణము - 456🌹
4) 🌹 వివేక చూడామణి - 133 / Viveka Chudamani - 133 🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -85🌹
6) 🌹 Osho Daily Meditations - 75🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 133 / Sri Lalita Sahasranamavali - Meaning - 133 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. భగవద్గీతాసారము -18 🍀*
*భౌగోళికముగా యిప్పుడు భూమికి చక్రవర్తి భయమను పిశాచమే. అది కారణముగా భద్రత ఎండమావిగ భావించబడుతూ యున్నది. కానీ, భద్రపథమును భగవద్గీత సూక్ష్మముగ తెలిపియున్నది. ఆ పథము శాశ్వతముగా భయమును నివారించును. ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును. నిరంతరత్వము, శ్రద్ధాభక్తులు, ఒక ధర్మము ననుసరించుట ప్రాప్తించిన జీవునకు సమస్త భయమూ పాపంచలగును. నిరంతరమూ నిర్వర్తింప బడుచున్న చిన్న ధర్మము ఎంతపెద్ద భయము నుండైనా రక్షించగలదు.*
🌻 🌻 🌻 🌻 🌻
23 గురువారం, సెప్టెంబర్ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాధ్రపద మాసం
తిథి: కృష్ణ విదియ 06:55:44 వరకు
తదుపరి కృష్ణ తదియ
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: రేవతి 06:44:03 వరకు తదుపరి అశ్విని
యోగం: ధృవ 13:48:35 వరకు తదుపరి వ్యాఘత
కరణం: గార 06:54:44 వరకు
వర్జ్యం: -04:32 - 6:17
దుర్ముహూర్తం: 10:07:12 - 10:55:37 మరియు
14:57:46 - 15:46:12
రాహు కాలం: 13:39:04 - 15:09:52
గుళిక కాలం: 09:06:40 - 10:37:28
యమ గండం: 06:05:03 - 07:35:52
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:32
అమృత కాలం: 01:03 - 02:47
సూర్యోదయం: 06:05:03
సూర్యాస్తమయం: 18:11:28
వైదిక సూర్యోదయం: 06:08:36
వైదిక సూర్యాస్తమయం: 18:07:57
చంద్రోదయం: 19:53:06
చంద్రాస్తమయం: 07:51:42
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: మీనం
ఆనందాదియోగం: మిత్ర యోగం - మిత్ర లాభం 06:44:03
వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం
పండుగలు : తృతీయ మహాలయ శ్రాధ్ధం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -257 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 3-1
*🍀 3-1. చక్రవ్యూహము - చక్రవ్యూహమునబడి జన్మముల తరబడి అవే పనులు చేయుచు తిరుగాడు దీనస్థితిలో మానవజాతి యున్నది. పురోగతి లేదు. రంగుల రాట్నమెక్కిన వానికి ఎంత సమయము దానిపై తిరిగినను తల తిరుగుటయే గాని పురోగమన ముండదు. తినినవే తినుచు, మాటాడినవే మాటాడుచు, వినినవే వినుచు, చూచినవే చూచుచు, పుట్టిన చోటనే పుట్టుచు యుండుటకు కారణము తన ధర్మము తనకు తెలియకపోవుటయే. తన ధర్మము తనకు తెలియవలెను. దానిని స్వధర్మ మందురు. తన ధర్మము తనకు తెలియనిచో నశించుట తప్పదు. 🍀*
అశ్రద్ధధానా: పురుషా ధర్మ ప్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్మని || 3
తాత్పర్యము : ధర్మమునందు శ్రద్ధలేని పురుషులు నన్ను పొందలేరు. అట్టివారు మృత్యువే పర్యవసానమగు సంసారము నందు వర్తించుచు నుందురు.
వివరణము : చేసిన పనులే చేయుచు, చివరికి మరణించుచు, మరల పుట్టుచు, మరల అవే పనులు చేయుచు, మరల మరణించుచు వర్తులాకారముగ తీరుబడి లేక జన్మ లెత్తుచున్నటు వంటి మానవులు అనేక సంఖ్యాకు లున్నారు. అందుకే మానవ చరిత్ర యందు పూర్వము జరిగిన ఘట్టములే మరల మరల జరుగుచు నుండును. బలవంతులు బలహీనులను కొల్లగొట్టుట, దురాక్రమణములు చేయుట, యుద్ధములు చేయుట, ఒకరినొకరు చంపుకొనుట, దోచుకొనుట నేటికిని కొనసాగుచునే యున్నది.
ఇట్టి చక్రవ్యూహమునబడి జన్మముల తరబడి అవే పనులు చేయుచు తిరుగాడు దీనస్థితిలో మానవజాతి యున్నది. పురోగతి లేదు. రంగుల రాట్నమెక్కిన వానికి ఎంత సమయము దానిపై తిరిగినను తల తిరుగుటయే గాని పురోగమన ముండదు. తినినవే తినుచు, మాటాడినవే మాటాడుచు, వినినవే వినుచు, చూచినవే చూచుచు, పుట్టిన చోటనే పుట్టుచు యుండుటకు కారణము తన ధర్మము తనకు తెలియకపోవుటయే. తన ధర్మము తనకు తెలియవలెను. దానిని స్వధర్మ మందురు. తన ధర్మము తనకు తెలియనిచో నశించుట తప్పదు. పరధర్మ మాచరించినచో పతనము మరియు మనుజుడు అధోగతికి దారితీయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 456🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 31
*🌻. శివ మాయ - 5 🌻*
నీవు ఈ పద్మము వంటి దివ్యమైన శ్రేష్ఠరూపము మంచి లక్షణములు గల నీ కుమార్తెను శివునకు ఈయగోరుచున్నావని నాకు తెలిసినది (43). శివుడు ఆశ్రయము లేనివాడు, సంగవిహీనుడు, కురూపి, గుణహీనుడు, శ్మశానమునందు నివసించువాడు. ఆతని శరీరమును పాములు చుట్టుకొని యుండును. ఆయన యోగి (44).
దిక్కులే వస్త్రముగా గలవాడు, చెడు రూపము గలవాడు, పాములను ఆభరణములుగా ధరించువాడు, కులనామముల నెరుంగనివాడు, చెడు శీలము గలవాడు, విహారము నెరుంగనివాడు (45), విభూతి లేపనముతో గూడిన దేహము గలవాడు, క్రోధస్వభావుడుర, వివేకము లేనివాడు, వయస్సు నెరుంగని వాడు, సర్వదా చిక్కు బడిన జటలను ధరించువాడు (46),
సర్వమును ఆశ్రయించి తిరుగువాడు, పాములు హారముగా గలవాడు, భిక్షుకుడు, చెడు మార్గమునందు ప్రీతి గలవాడు, దురహంకారముచే వేదమార్గమును వీడినవాడు (47) అగు శివునకు పార్వతి నీయవలెననే నీ ఈ బుద్ధి మంగళదాయకము కాదు సుమా! హే పర్వతరాజా! నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు. నారాయణుని కులమునందు జన్మించినవాడవు. తెలుసుకొనుము (48).
నీవుపార్వతిని దానము చేయుటకు తగిన పాత్ర ఆయన కాదు. ఈ విషయమును విన్నంతనే మహాజనులు నవ్వెదరు (49). ఓ పర్వతరాజా! గమనించుము. ఆయనకు బంధువు ఒక్కడైననూలేడు. నీవు మహారత్నములకు నిధివి. ఆయన వద్ద ధనము లవమైననూ లేదు (50).
ఓ పర్వత రాజా! బంధువులను, మేనకను, కుమారులను, మరియు ఇతరులనందరినీ శ్రధ్ధతో అడిగి చూడుము. పండితులను కూడ ప్రశ్నించుము. కానీ పార్వతిని ప్రశ్నించవద్దు (51). ఓ పర్వతరాజా! ఏనాడైననూ రోగికి మందు రుచించదు. రోగికి అన్ని వేళలా మహాదోషకరమగు చెడు పథ్యము బాగుగా రుచించును (52).
ఆ బ్రాహ్మణుడిట్లు పలికి ఆనందముగా భుజించి శీఘ్రమే నిర్గమించెను. అనేక లీలలను ప్రదర్శించు శివుడు శాంతముగా తన ధామమునకు చేరుకొనెను (53).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతి ఖండలో శివమాయావర్ణమనే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 133 / Viveka Chudamani - 133🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 27. విముక్తి - 6 🍀*
437. ఎవడైతే బ్రహ్మాన్ని పొంది నిజాన్ని గ్రహిస్తాడో మరియు మార్పులతో కూడిన బంధాల నుండి విడుదల అవుతాడో అతడే ఈ జీవన ప్రకృతి నుండి విడుదల పొందిన వాడు.
438. ఎవరికి ఎప్పుడు ‘నేను’ అనే భావన ఈ శరీరానికి, శరీరాంగాలకు వర్తింపజేయడో, ఇంకను వస్తువులకు ‘ఇది’ ‘అది’ అని పట్టించుకోకుండా ఉంటాడో అతడు విముక్తి పొందినవాడని భావము.
439. ఎవడు భ్రమ వలన జీవానికి, బ్రహ్మానికి తేడా చూపించడో, అలానే ఈ ప్రపంచాన్ని కూడా విశ్వములోని భాగముగా భావిస్తాడో అట్టి వాడు విముక్తి పొందినవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 133 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 27. Redemption - 6 🌻*
437. He who has realised his Brahmanhood aided by the Scriptures, and is free from the bondage of transmigration, is known as a man liberated-in-life.
438. He who never has the idea of "I" with regard to the body, organs, etc., nor that of "it" in respect of things other than these, is accepted as one liberated-in-life.
439. He who through his illumination never differentiates the Jiva and Brahman, nor the universe and Brahman, is known as a man liberated-in-life.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 85 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. చేయవలసినది- చేయదలచినది - 1 🌻*
ఆరాధన కాకుండా మనం చేసే పని జీవితంలో ఉండరాదు. మనం ఇతర జాతులను చూసినట్లయితే అక్కడ ఆరాధనే విశేషమే కనిపిస్తూ ఉంటుంది.
సామాన్యంగా తెల్లజాతులలో 24 గంటలు వాళ్ళచేసే వ్యాపారం గానీ, వృత్తి గానీ సంఘానికి అంకితంగా, సంకేతంగా, ఆరాధనా విశేషంగా చేయటం ప్రారంభం చేశారు. అందుకని ఆరాధన విశేషాన్ని పునరుద్ధరించుట కొరకు భారతదేశంలో 19వ శతాబ్ధి నుండి మళ్ళీ చాలా చక్కని ప్రయత్నం చేస్తున్న మహాభావులనే పరమగురువులు అని అంటారు.
వారిలో ముఖ్యంగా ఇద్దరు ఇప్పటికి 5 వేల సంవత్సరాల నుండి ఇప్పటివరకు అఖండమైన కృషి ధర్మసంస్థాపనకై చేస్తూ ఉన్నారు. వారే మరువు మహర్షి, దేవాపి మహర్షి.
19వ శతాబ్ధి చివరలో 20వ శతాబ్ది ప్రారంభంలో (తమకు ఉన్న) భౌతిక శరీరంతో Master MORYA, Master KOOT HOOMI అనే పేర్లతో ఉండిరి.
హిమాలయములలోని ఒక చిన్న గ్రామము నందుండి వారి శిష్యుడైన జ్వాలాకూలుడను మహనీయుని ద్వారా వాళ్ళు బ్రహ్మ విద్యా సర్వస్వమును వ్యాప్తి చేసి మళ్ళా క్రమశిక్షణను ప్రపంచంలో స్థాపించటానికి ఇచ్చారు.
ఆ ఇచ్చిన మార్గం వేద, ఉపనిషత్ గీతాసమ్మతమైనది. దీనిని సకల జగత్తుకి ఇచ్చిన ఫలితంగా ఈ రోజున పాశ్చాత్య దేశములలో కొన్ని లక్షల మంది అఖండంగా అనుసరణం ఆచరణం చేస్తూ ఉన్నారు.
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌹
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 74 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 74. INSIGHT 🍀*
*🕉 Every insight, even if it is very hard to accept, helps. Even if it goes against the grain, it helps. Even if it is very ego shattering, it helps. Insight is the only friend. 🕉*
One should be ready to see into any fact, without rationalizing in any way. Out of this insight, many things happen. But if you have missed the first insight into the matter, you will be puzzled and confused. Many problems will be there, but there will be no solution in sight, because from the very first step a truth has not been accepted. So you are falsifying your own being.
There are many people who have so many problems, but those problems are not real. Ninety-nine percent of problems are false. So if they are not solved, you are in trouble, and even if they are solved, nothing will happen, because they are not your real problems. When you have solved some false problems, you will create others. So the first thing is to penetrate into what is the real problem and to see it as it is. To see the false as false is the beginning of being able to see truth as truth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 133 / Sri Lalita Sahasranamavali - Meaning - 133 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 133. భాషారూపా, బృహత్సేనా, భావాభావ వివర్జితా ।*
*సుఖారాధ్యా, శుభకరీ, శోభనా సులభాగతిః ॥ 133 ॥ 🍀*
🍀 679. భాషారూపా :
సమస్తభాషలు తన రూపముగా కలిగినది
🍀 680. బృహత్సేనా :
గొప్ప సైన్యము కలిగినది
🍀 681. భావాభావ వివర్జితా :
భావము, అభావము రెండింటినీ లేనిది
🍀 682. సుఖారాధ్యా :
సుఖులైనవారిచే (నిత్యతృప్తులు) ఆరాధింపబడునది
🍀 683. శుభంకరీ :
శుభములను కలిగినది
🍀 684. శోభనా :
వైభవములను కలిగినది
🍀 685. సులభాగతి: :
తేలికగా చేరతగినది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 133 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 133. Bhasharupa bruhatsena bhavabhava vivarjita*
*Sukharadhya shubhakari shobhana sulabhagatih ॥ 133 ॥ 🌻*
🌻 679 ) Bhasha roopa -
She who is personification of language
🌻 680 ) Brihat sena -
She who has big army
🌻 681 ) Bhavabhava vivarjitha -
She who does not have birth or death
🌻 682 ) Sukharadhya -
She who can be worshipped with pleasure
🌻 683 ) Shubhakaree -
She who does good
🌻 684 ) Shobhana -
She who has all riches
🌻 685) sulabha gathi -
She who is easy to attain and does only good
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment