మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 85
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 85 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చేయవలసినది- చేయదలచినది - 1 🌻
ఆరాధన కాకుండా మనం చేసే పని జీవితంలో ఉండరాదు. మనం ఇతర జాతులను చూసినట్లయితే అక్కడ ఆరాధనే విశేషమే కనిపిస్తూ ఉంటుంది.
సామాన్యంగా తెల్లజాతులలో 24 గంటలు వాళ్ళచేసే వ్యాపారం గానీ, వృత్తి గానీ సంఘానికి అంకితంగా, సంకేతంగా, ఆరాధనా విశేషంగా చేయటం ప్రారంభం చేశారు. అందుకని ఆరాధన విశేషాన్ని పునరుద్ధరించుట కొరకు భారతదేశంలో 19వ శతాబ్ధి నుండి మళ్ళీ చాలా చక్కని ప్రయత్నం చేస్తున్న మహాభావులనే పరమగురువులు అని అంటారు.
వారిలో ముఖ్యంగా ఇద్దరు ఇప్పటికి 5 వేల సంవత్సరాల నుండి ఇప్పటివరకు అఖండమైన కృషి ధర్మసంస్థాపనకై చేస్తూ ఉన్నారు. వారే మరువు మహర్షి, దేవాపి మహర్షి.
19వ శతాబ్ధి చివరలో 20వ శతాబ్ది ప్రారంభంలో (తమకు ఉన్న) భౌతిక శరీరంతో Master MORYA, Master KOOT HOOMI అనే పేర్లతో ఉండిరి.
హిమాలయములలోని ఒక చిన్న గ్రామము నందుండి వారి శిష్యుడైన జ్వాలాకూలుడను మహనీయుని ద్వారా వాళ్ళు బ్రహ్మ విద్యా సర్వస్వమును వ్యాప్తి చేసి మళ్ళా క్రమశిక్షణను ప్రపంచంలో స్థాపించటానికి ఇచ్చారు.
ఆ ఇచ్చిన మార్గం వేద, ఉపనిషత్ గీతాసమ్మతమైనది. దీనిని సకల జగత్తుకి ఇచ్చిన ఫలితంగా ఈ రోజున పాశ్చాత్య దేశములలో కొన్ని లక్షల మంది అఖండంగా అనుసరణం ఆచరణం చేస్తూ ఉన్నారు.
....✍️ మాస్టర్ ఇ.కె.🌹
🌹 🌹 🌹 🌹 🌹
23 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment