గీతోపనిషత్తు -250


🌹. గీతోపనిషత్తు -250 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 28-1

🍀 27-1. నిత్య జీవన యోగము - పరమాత్మయగు శ్రీకృష్ణుడు నిశ్చయమగు సందేశము నిచ్చినాడు. ఎవరైతే సర్వకాలముల యందు, సర్వదేశముల యందు అక్షరము, పరము, నాశరహితము, శాశ్వతము అగు బ్రహ్మముతో కూడి యుండునో అతడు సర్వశ్రేష్ఠుడని తెలిపినాడు. వేదాధ్యయనము, తదనుష్ఠానము, దాన ధర్మాది కర్మలు, సుదీర్ఘమగు తపస్సులు, నిర్విరామ యజ్ఞయాగాదులు ఏ పుణ్యఫలములను సంప్రాప్తింప జేయునో వాటన్నిటి కన్న మిన్నయగు స్థానము యోగి పొందు చున్నాడు. కనుక దైవముతో అనన్య యోగమే పరమోపాయమని తెలియజేయు చున్నాడు. 🍀

వేదేషు యథేషు తపస్సు చైన దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగ పరం స్థాన ముపైతి చాద్యమ్ || 28

తాత్పర్యము : యోగి పరమగు స్థానమును పొంది యుండుటచే అతడు వేదములందును, యజ్ఞములందును దానము లందును, తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడి యున్నదో, దాని నంతటిని అతిక్రమించి యున్నాడు.

వివరణము : అధ్యాయమందలి ఈ చివరి శ్లోకమున పరమాత్మయగు శ్రీకృష్ణుడు నిశ్చయమగు సందేశము నిచ్చినాడు. ఎవరైతే సర్వకాలముల యందు, సర్వదేశముల యందు అక్షరము, పరము, నాశరహితము, శాశ్వతము అగు బ్రహ్మముతో కూడి యుండునో అతడు సర్వశ్రేష్ఠుడని తెలిపినాడు.

వేదాధ్యయనము, తదనుష్ఠానము, దాన ధర్మాది కర్మలు, సుదీర్ఘమగు తపస్సులు, నిర్విరామ యజ్ఞయాగాదులు ఏ పుణ్యఫలములను సంప్రాప్తింప జేయునో వాటన్నిటి కన్న మిన్నయగు స్థానము యోగి పొందు చున్నాడు. కనుక దైవముతో అనన్య యోగమే పరమోపాయమని తెలియజేయు చున్నాడు. దేశము, కాలము, రూపము, నామము అను పరిమితులను అతిక్రమించి, దైవమునే చూచుట, వినుట, సేవించుట సూటియగు మార్గము. ఇది నిత్య జీవన యోగము.

యోగము పేరిట, దైవము పేరిట ఇక ఏ కసరత్తులు చేయ నవసరము లేదు. ఇంతకన్న సూటియగు మార్గము మరియొకటి లేదు. ఇంతకన్న సులభమగు మార్గము కూడ వేరొకటి లేదు. అన్నిటి యందు దైవమునే చూచుట, దైవమునే వినుట, దైవము తోనే ప్రతిస్పందించుట ప్రయత్నించునపుడు నిరంతరముగ దైవచింతనే యుండును. అన్యచింతన యుండదు. అనన్యచింతన సిద్ధించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


07 Sep 2021

No comments:

Post a Comment