7-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం గురువారం 7-సెప్టెంబర్-2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 250  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 449🌹 
4) 🌹 వివేక చూడామణి - 126 / Viveka Chudamani - 126🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -78🌹  
6) 🌹 Osho Daily Meditations - 67🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 126🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. శ్రీ ఆంజనేయ శ్లోకాలు-1 🍀*

మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||

భావము:- మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.

07, మంగళవారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
తిథి: అమావాశ్య 06:22:32 వరకు తదుపరి శుక్ల పాడ్యమి
భాద్రపద - పౌర్ణమాంతం
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 17:06:05 వరకు 
తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: సద్య 26:21:53 వరకు తదుపరి శుభ 
కరణం: నాగ 06:21:32 వరకు
వర్జ్యం: 01:37:20 - 03:10:12 
మరియు 23:57:00 - 25:28:20
దుర్ముహూర్తం: 08:31:22 - 09:20:49 
రాహు కాలం: 15:19:23 - 16:52:07
గుళిక కాలం: 12:13:55 - 13:46:39
యమ గండం: 09:08:27 - 10:41:11
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37
అమృత కాలం: 10:54:32 - 12:27:24
సూర్యోదయం: 06:02:59, 
సూర్యాస్తమయం: 18:24:51
వైదిక సూర్యోదయం: 06:06:31, 
వైదిక సూర్యాస్తమయం: 18:21:20
చంద్రోదయం: 06:08:30, చంద్రాస్తమయం: 18:55:35
సూర్య రాశి: సింహం, చంద్ర రాశి: సింహం
ఆనందాదియోగం: ధూమ్ర యోగం - కార్య భంగం, 
సొమ్ము నష్టం 17:06:00 వరకు తదుపరి 
ధాత్రి యోగం - కార్య జయం 
పండుగలు : బాద్రపద అమావాస్య

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. గీతోపనిషత్తు -250 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 28-1
 
*🍀 27-1. నిత్య జీవన యోగము - పరమాత్మయగు శ్రీకృష్ణుడు నిశ్చయమగు సందేశము నిచ్చినాడు. ఎవరైతే సర్వకాలముల యందు, సర్వదేశముల యందు అక్షరము, పరము, నాశరహితము, శాశ్వతము అగు బ్రహ్మముతో కూడి యుండునో అతడు సర్వశ్రేష్ఠుడని తెలిపినాడు. వేదాధ్యయనము, తదనుష్ఠానము, దాన ధర్మాది కర్మలు, సుదీర్ఘమగు తపస్సులు, నిర్విరామ యజ్ఞయాగాదులు ఏ పుణ్యఫలములను సంప్రాప్తింప జేయునో వాటన్నిటి కన్న మిన్నయగు స్థానము యోగి పొందు చున్నాడు. కనుక దైవముతో అనన్య యోగమే పరమోపాయమని తెలియజేయు చున్నాడు. 🍀*

వేదేషు యథేషు తపస్సు చైన దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగ పరం స్థాన ముపైతి చాద్యమ్ || 28

తాత్పర్యము : యోగి పరమగు స్థానమును పొంది యుండుటచే అతడు వేదములందును, యజ్ఞములందును దానము లందును, తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడి యున్నదో, దాని నంతటిని అతిక్రమించి యున్నాడు. 

వివరణము : అధ్యాయమందలి ఈ చివరి శ్లోకమున పరమాత్మయగు శ్రీకృష్ణుడు నిశ్చయమగు సందేశము నిచ్చినాడు. ఎవరైతే సర్వకాలముల యందు, సర్వదేశముల యందు అక్షరము, పరము, నాశరహితము, శాశ్వతము అగు బ్రహ్మముతో కూడి యుండునో అతడు సర్వశ్రేష్ఠుడని తెలిపినాడు. 

వేదాధ్యయనము, తదనుష్ఠానము, దాన ధర్మాది కర్మలు, సుదీర్ఘమగు తపస్సులు, నిర్విరామ యజ్ఞయాగాదులు ఏ పుణ్యఫలములను సంప్రాప్తింప జేయునో వాటన్నిటి కన్న మిన్నయగు స్థానము యోగి పొందు చున్నాడు. కనుక దైవముతో అనన్య యోగమే పరమోపాయమని తెలియజేయు చున్నాడు. దేశము, కాలము, రూపము, నామము అను పరిమితులను అతిక్రమించి, దైవమునే చూచుట, వినుట, సేవించుట సూటియగు మార్గము. ఇది నిత్య జీవన యోగము. 

యోగము పేరిట, దైవము పేరిట ఇక ఏ కసరత్తులు చేయ నవసరము లేదు. ఇంతకన్న సూటియగు మార్గము మరియొకటి లేదు. ఇంతకన్న సులభమగు మార్గము కూడ వేరొకటి లేదు. అన్నిటి యందు దైవమునే చూచుట, దైవమునే వినుట, దైవము తోనే ప్రతిస్పందించుట ప్రయత్నించునపుడు నిరంతరముగ దైవచింతనే యుండును. అన్యచింతన యుండదు. అనన్యచింతన సిద్ధించును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 449🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 30

*🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 3 🌻*

నృత్యగాన పండితుడగు శివుడు ఎర్రని వస్త్రమును ధరించి ఎడమచేతియందు కొమ్ము బూరాను, కుడిచేతియందు డమరుకను, భుజముపై మచ్చల దుప్పటిని ధరించి యుండెను (27). అపుడా మహానటుని రూపములో నున్న శివుడు మేనక మరియు ఇతర స్త్రీల యెదుట ప్రాంగణములో చక్కని నాట్యమును చేసి, అతిమనోహరముగా అనేకములగు పాటలను పాడును (28). 

మరియు ఆయన అచట చక్కని ధ్వని గల కొమ్ముబూరాను, డమరును మ్రెగించి వివిధములైన మనోహర మహానాట్యములను చేసెను (29). ఆనాట్యమును చూచుటకై నగర జనులు అందరు, అనగా పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరు, వెంటనే అచటకు విచ్చేసిరి (30).

ఓ మహర్షీ! ఆ చక్కని గీతమును, మనోహరమగు నృత్యమును చూచి మేనతో సహాఅందరు మోహమును పొందిరి (31). ఆ దుర్గకూడ మూర్ఛిల్లి హృదయమునందు శంకరుని చూచెను. త్రిశూలము మొదలగు చిహ్నములను ధరించియున్నవాడు. మిక్కలి సుందరాకారుడు (32). 

భస్మచే అలంకరింప బడినవాడు, సుందరమగు ఎముకల మాలను ధరించినవాడు, మూడు కన్నులతో గొప్పగా ప్రకాశించు చున్న ముఖము గలవాడు, సర్పములే యజ్ఞోపవీతముగా గలవాడు (33), వరమును కోరుకొనుము అని పలికిన వాడు, పచ్చని రంగు గలవాడు, మహేశ్వరుడు, దీనులకు బంధువు, దయాసముద్రుడు, అన్ని విధములుగా మిక్కలి మనోహరమైనవాడు (34), హృదయము నందున్నవాడు అగు హరుని చూచి ఆమె ఆతనికి నమస్కరించెను. మరియు ఆమె తన మనస్సులో 'నీవు నాకు భర్తవు కమ్ము' అని వరమును గోరెను (35). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 126 / Viveka Chudamani - 126🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 13 🍀*

416. సత్యాన్ని తెలుసుకొన్న వ్యక్తి ఎక్కువగా ఈ శరీరమును గూర్చి పట్టించుకొనకుండా, ప్రారబ్దముతో కూడిన కర్మలన్నింటిని కడిగివేసి ఆవు మెడలోని మాలవలె పవిత్రముగా తన యొక్క భౌతిక చర్యలన్ని బ్రహ్మములో కలసిపోగా మిగిలినది బ్రహ్మానంద స్థితి మాత్రమే. 

417. శాశ్వతానందకరమైన ఆత్మను తెలుసుకొని, తనలోని అనేక జన్మల జీవన స్థితులను, నిజాన్ని గ్రహించినవారి వలె శరీరమును పోషించును. 

418. ఏ యోగి తాను పూర్తి స్వచ్ఛతను సాధిస్తాడో, ఎవరైతే భౌతిక శరీర బాధల నుండి విముక్తి పొందుతాడో అతడు తన మనస్సులో శాశ్వతమైన ఆనంద స్థితిని బాహ్యముగా అంతరముగా సాధించగలడు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 126 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 13 🌻*

416. The knower of Truth does no more care whether this body, spun out by the threads of Prarabdha work, falls or remains – like the garland on a cow – for his mind-functions are at rest in the Brahman, the Essence of Bliss.

417. Realising the Atman, the Infinite Bliss, as his very Self, with what object, or for whom, should the knower of Truth cherish the body.

418. The Yogi who has attained perfection and is liberated-in-life gets this as result – he enjoys eternal Bliss in his mind, internally as well as externally.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 78 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻. బాధ్యతతో కర్తవ్యము ఆచరించిన ఆత్మవిశ్వాసము కలుగును. 🌻*

బాధ్యతలను స్వీకరించి ఆచరించుటకు భయపడకుము, భయము మనో దౌర్భల్యమును తెలియజేయును బాధ్యతతో కర్తవ్యము ఆచరించిన ఆత్మవిశ్వాసము కలుగును. 

సామాన్యముగా నీకు తెలిసినది తక్కువ, తెలియనిది ఎక్కువ ఉన్నట్లు భావించుచుందువు, నిజమేమనగా నీకు తెలిసిన తక్కువలోనే ఒకటో, రెండో తీసుకొని ఆచరించినచో ఆనందానుభూతిని కలిగించే ఆత్మానుభవమును పొందగలవు. అనుభవము జీవితమునకు పునాది వంటిది.  

ఊహించుట యందును, ఆలోచించుట యందును, ప్రణాళికలు వేయుట యందును పరిష్కారము రాదు. ఆచరించుట వలన మాత్రమే పరిష్కారము కలుగును. 

నీవు పనికి వచ్చుట అనగా పనికి వచ్చే పనికి వచ్చుట; పనికి రాకుండుట అనగా పనికి వచ్చే పనిని చేయకుండుట.

....✍️. మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 67 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 67. OKAY IS NOT ENOUGH 🍀*

*🕉 Okay is not enough. Okay is not an ecstatic word; it is just lukewarm. So feel blessed-and it is a question of feeling. Whatever you feel, you become. It is your responsibility. 🕉*

This is what we mean in India when we say, "It is your own karma." Karma means your own action. It is what you have done to yourself. And once you understand that this is what you have done to yourself, you can drop it. It is your attitude; nobody is forcing you to feel that way. You have chosen it-maybe unconsciously, maybe for some subtle reasons that feel good at the time but which turn out to be bitter, but you have chosen it.

Once you understand that it is you, why settle for okayness? That is not much, and your life will not be a life of song and dance and celebration. Just by being okay, how will you celebrate? Just by being okay, how will you love? Why be so miserly about it? But there are many people who are stuck at okayness. They have lost all energy just because of their ideas. Okayness is like a person who is not sick but who is also not healthy, just so-so. He is not ill, but he is not alive and healthy. He cannot celebrate.

I will suggest that if it is too difficult for you to feel blissful, at least feel miserable. That will be something; at least energy will be there. You can cry and weep. You may not be able to laugh, but tears will be possible. Even that will be life. But okayness is very cold. And if there is a question of choosing, why choose misery when you can choose happiness?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 126 / Sri Lalita Sahasranamavali - Meaning - 126 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 126. త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా |*
*ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా ‖ 126 ‖ 🍀*

🍀 630. త్ర్యక్షరీ - 
మూడు అక్షరముల స్వరూపిణి.

🍀 631. దివ్యగంధాడ్యా - 
దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.

🍀 632. సిందూర తిలకాంచితా - 
పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.

🍀 633. ఉమా - 
ఉమా నామాన్వితురాలు. మూడు లోకములచే పూజింపబడునది.

🍀 634. శైలేంద్రతనయా - 
హిమవత్పర్వతము యొక్క కుమార్తె.

🍀 635. గౌరీ - 
గౌర వర్ణములో ఉండునది.

🍀 636. గంధర్వసేవితా - 
గంధర్వులచేత పూజింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 126 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 126. tryakṣarī divya-gandhāḍhyā sindūra-tilakāñcitā |*
*umā śailendratanayā gaurī gandharva-sevitā || 126 || 🌻*

🌻 630 ) Tryakshyari -   
She who is of the form of three letters

🌻 631 ) Divya Gandhadya -  
 She who has godly smell

🌻 632 ) Sindhura thila kanchidha -   
She who wears the sindhoora dot in her forehead

🌻 633 ) Uma -   
She who is in “om”

🌻 634 ) Sailendra Thanaya -   
She who is the daughter of the king of mountains

🌻 635 ) Gowri -   
She who is white coloured

🌻 636 ) Gandharwa Sevitha -   
She who is worshipped by gandharwas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment