శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 309-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 309-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 309-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 309-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 309-1 'రంజనీ, 🌻


భకులను రంజింపజేయునది శ్రీమాత అని అర్థము. శివుని రంజింపజేయునని కూడ అర్థము. పరమశివునే రంజింపజేసిన శ్రీమాత సృష్టి జీవులను రంజింప జేయుటలో ఆశ్చర్య మేమున్నది? శివుని తన తపస్సుచే రంజింపజేసినది. శివుడు ఉగ్రుడై దక్షయజ్ఞమును పరిసమాప్తి గావించి దేవతల యందు, సృష్టియందు విరక్తి కలిగి, ఏకోన్ముఖుడై తపస్సు జేసి సత్యమై నిలచెను.

మరల తిరిగి సృష్టిలోనికి రాని విధముగ సత్యమందు స్థిరపడెను. అట్టి శివుని మెప్పించుట, అతని మనస్సును రంజింపజేయుట ఎవ్వరి తరము కాలేదు. అతనిని సమీపించుటకే భయపడిరి. అతడు తపస్సు చేయు చుండగ అతని చుట్టునూ కాలాగ్ని ఆవరణ మేర్పడినది. సమీపించుటకు కూడ అవకాశములేని రుద్రుని సంతసింపచేయుట ఎట్లు? ఎవ్వరునూ సాహసింపనైరి.

హిమవత్ పర్వతరాజ పుత్రికగ మరల జనించిన సతీదేవి శ్రీమాతయే. ఆమె కౌమారముననే సహజముగ శివుని వరించినది. శివుడు తప్ప ఇతరము కోరనిది. శివుని మెప్పించి అతనికి అర్ధాంగి కావలెనని సంకల్పించినది. వలదన్ననూ వినలేదు. వేల సంవత్సరములు దృఢ సంకల్పముతో తపస్సు గావించి శివుని మెప్పించి రంజింప జేసి వివాహమాడెను. అందువలన శ్రీమాత రంజని అయినది. రంజనీ ప్రజ్ఞ హృదయమున నుండును. హృదయమే రంజన స్థానము కూడ. జీవుల హృదయమందు కూడ శ్రీమాత ఉపస్థితయై యున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 309-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 309-1. Rañjanī रञ्जनी (309) 🌻


She gives happiness to Her devotees during this birth and also in the Heavens, possibly meaning no-rebirth. The appropriate interpretation of this nāma would be: Rañjana means the act of colouring and also pleasing, charming, rejoicing, delighting, befriending, etc. From this point of view, everything associated with Her is red. Śiva is beyond colour and is pellucid like crystal. When She sits with Him, Śiva’s complexion also turns into red. His crystal complexion becomes radiant with the red complexion of the Supreme Mā. Saundarya Laharī (verse 92) explains this scenario in a different way. “Śiva with His clear lustre has transformed Himself into an apparent bed-cover reddened by your reflected lustre, as the embodied erotic sentiment and yields joy to your eyes.”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



12 Sep 2021

No comments:

Post a Comment