నిర్మల ధ్యానాలు - ఓషో - 71
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 71 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ధ్యానం చేసే వ్యక్తి సున్నితంగా స్పందించాలి. తెలివిగా, చురుగ్గా వుండాలి. సృజనాత్మకంగా వుండాలి. నువ్వు మనసును ఆపడం అభ్యసించాలి. ఒకసారి నువ్వు మనసును ఆపడం నేర్చుకుంటే నువ్వు అధికారివి. 🍀
ధ్యానం చేసే వాళ్ళు సాధారణ జనం కన్నా మేధస్సుతో వుంటారు. వాళ్ళ ధ్యానం సరైంది కావాలి. సరయింది కాకపోతే వాళ్ళ ధ్యానం గురించిన స్పష్టత లేకుంటే సామాన్యులుగా మిగుల్తారు. ధ్యానం పేర వాళ్ళు మరేదో చేస్తారు. ధ్యానం చేసే వ్యక్తి సున్నితంగా స్పందించాలి. తెలివిగా, చురుగ్గా వుండాలి. సృజనాత్మకంగా వుండాలి. ప్రేమ పూరితుడయి వుండాలి. అనురాగపూరితుడు కావాలి.
ఆ లక్షణాలు వాటంతట అవే ఎదగాలి. దీని కంతటికి కారణం, మనసును ఆపడం అభ్యసించాలి. ఒకసారి నువ్వు మనసును ఆపడం నేర్చుకుంటే నువ్వు అధికారివి. అప్పుడు మనసన్నది గొప్ప యాంత్రిక వ్యవస్థగా మారుతుంది. నీకిష్టమైనపుడు దాన్ని నువ్వు ఉపయోగించవచ్చు. అవసరమయినపుడు ఉపయోగించవచ్చు. అవసరం లేనపుడు ఆపేయవచ్చు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
12 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment