14-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం  14-సెప్టెంబర్-2021  రాధాష్టమి శుభాకాంక్షలు 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 253  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 452🌹 
4) 🌹 వివేక చూడామణి - 129 / Viveka Chudamani - 129🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -81🌹  
6) 🌹 Osho Daily Meditations - 71🌹
7)🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 129 / Sri Lalita Sahasranamavali - Meaning - 129 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ రాధాష్టమి శుభాకాంక్షలు మరియు శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం -1 🍀*

యః శ్రీగోవర్ధనాద్రిం సకలసురపతీం స్తత్రగోగోపబృందం
స్వీయం సంరక్షితుం చేత్యమర సుఖకరం మోహయన్ సందధార |
తన్మానం ఖండయిత్వా విజితరిపుకులో నీలధారాధరాభః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ ||
🌻 🌻 🌻 🌻 🌻

14 మంగళవారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
 తిథి: శుక్ల-అష్టమి 13:10:52 వరకు తదుపరి శుక్ల-నవమి
 పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: జ్యేష్ఠ 07:05:49 వరకు తదుపరి మూల
యోగం: ఆయుష్మాన్ 27:24:43 వరకు తదుపరి సౌభాగ్య ?
కరణం: బవ 13:10:52 వరకు
వర్జ్యం: 14:42:00 - 16:13:24
దుర్ముహూర్తం: 08:30:56 - 09:19:57
రాహు కాలం: 15:15:16 - 16:47:09
గుళిక కాలం: 12:11:28 - 13:43:22
యమ గండం: 09:07:42 - 10:39:35
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35
అమృత కాలం: 23:50:24 - 25:21:48
సూర్యోదయం: 06:03:54
సూర్యాస్తమయం: 18:19:02
వైదిక సూర్యోదయం: 06:07:26
వైదిక సూర్యాస్తమయం: 18:15:31
చంద్రోదయం: 13:06:39, చంద్రాస్తమయం: 00:23:35
సూర్య రాశి: సింహం, చంద్ర రాశి: వృశ్చికం
ఆనందాదియోగం: ముద్గర యోగం - కలహం 07:05:49 
వరకు తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం 
పండుగలు : రాధాష్టమి, మాస దుర్గాష్టమి, గౌరి విసర్జన
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -253 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 1-2
 
*🍀 1-2. అనసూయత్వము - సద్గుణములలో అనసూయత్వము పర్వత శిఖర అగ్రము వంటిది. అనసూయత్వము లేనిచో అత్యంత రహస్యమగు సత్యమును దర్శింపలేరు. అనసూయత్వము గలవాడే సత్యమున ప్రవేశింప గలడు. అట్టివాడే లోపల వెలుపలగల సత్యమును దర్శింప గలడు. అట్లు అంతట సత్యమును దర్శించువాడే అశుభము నుండి తరించిన వాడగును. అదియే మోక్షస్థితి. 🍀*

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ || 1

తాత్పర్యము : అత్యంత గుహ్యము, జ్ఞానవిజ్ఞాన సహితము అగు విషయమును అసూయ లేనివాడ వగుటచే నీకు పరిపూర్ణముగను, స్పష్టముగను తెలుపుచున్నాను. దీనిని తెలియుట వలన అశుభము నుండి మోక్షము పొందెదవు.

వివరణము : అసూయ లేకుండుటను అనసూయత్వమందురు. సద్గుణములలో అనసూయత్వము పర్వత శిఖర అగ్రము వంటిది. పర్వతమంత సద్గుణము లున్నను అనసూయత్వము లేనిచో శిఖరములేని పర్వతమువలే మొండిగ, అసంపూర్ణముగ నుండును. శిరస్సులేని మానవునివలే అనసూయత్వములేని సద్గుణములకు విలువ లేదు.

 అనసూయత్వము లేనిచో అత్యంత రహస్యమగు సత్యమును దర్శింపలేరు. అనసూయత్వము గలవాడే సత్యమున ప్రవేశింప గలడు. అట్టివాడే లోపల వెలుపలగల సత్యమును దర్శింప గలడు. అట్లు అంతట సత్యమును దర్శించువాడే అశుభము నుండి తరించిన వాడగును. అదియే మోక్షస్థితి. 

శుభా శుభములు ద్వంద్వములు. శుభముల యందును అశుభముల యందును, విద్య యందును అవిద్య యందును, జ్ఞానము నందును అజ్ఞానము నందును, వెలుగునందును చీకటి యందును, పూర్ణిమ యందును అమావాస్య యందును- ఇట్లన్నింటియందును గల సత్యమును అన్నివేళల దర్శించు వానిని పై తెలిపిన అశుభములు స్పృశింపవు. అతడే ఈ జగత్తున తరించిన వాడై యుండును. 

ఈ మొదటి శ్లోకమున సత్యము అత్యంత నిగూఢమని, అది జ్ఞానవిజ్ఞాన సమన్వయమై యున్నదని, దానిని తెలియుటకు అనసూయత్వము ఆవశ్యకమని, దానిని తెలియుటచేత మాత్రమే మోక్షస్థితి సిద్ధించునని తెలుపబడినది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 452🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 31

*🌻. శివ మాయ - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివుని యందు వారిద్దరికి అనన్యమగు పరాభక్తి గలదని ఇంద్రాది దేవలందరికీ తెలిసినది. ఓ నారదా! అపుడు వారు ఇట్లు తలపోసిరి. (1).

దేవతలిట్లు పలికిరి -

హిమవంతుడు అనన్య భక్తితో శివునకు కన్యాదానమును చేసినచో, భారత ఖండమునందు ఆతడు వెనువెంటనే మోక్షమును పొందును (2). అనంత రత్నములకు ఆధారమగు నాడతు భూలోకమును వీడి పయనమైనచో, భూమియొక్క రత్నగర్భయను బిరుదు మిథ్య యగుట నిశ్చయము (3). 

ఆతడు కన్యను శూలధారియగు శివునకిచ్చి పర్వతరూపమును విడిచిపెట్టి దివ్యరూపమును ధరించి శివలోకమును పొందగలడు (4). ఆతడు మహాదేవునితో సారూప్యమును పొంది, అచట శ్రేష్ఠమగు భోగముల ననుభవించి తరువాత మోక్షమును పొందగలడు. దీనిలో సందేహము లేదు (5).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవతలందరు ఇట్లు తలపోసి ఒకరితో నొకరు సంప్రదించుకొని చకితులై హిమవంతుని వద్దకు బృహస్పతిని పంపవలెనని తలంచిరి (6).

అపుడు ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరు తమ ప్రయోజనమును సాధింపబూని వినయముతో గూడినవారై ప్రీతితో బృహస్పతి గృహమునకు వెళ్లిరి. ఓ నారదా! (7) ఇంద్రాది దేవతలు అందురు అచటకు వెళ్లి, బృహస్పతికి నమస్కరించి జరుగుతున్న వృత్తాంతమును సాదరముగా ఆయనకు నివేదించిరి (8).

దేవతలిట్లు పలికిరి-

గురుదేవా! మా కార్యమును సంపాదించుటకై హిమవంతుని వద్దకు వెళ్లుము. అచటకు వెళ్లి ప్రయత్నపూర్వకముగా శూలధారియగు శివుని నిందించుము (9). దుర్గ పినాక ధారియగు శివుని తక్క మరియొకనిని వివాహమాడబోదు. ఆయన ప్రీతి లేకుండగా తన కుమార్తెను ఆయనకు దానము చేసినచో, వెంటనే ఫలము లభించును (10). 

కాని ప్రస్తుతము హిమవంతుడు భూమియందు మాత్రమే ఉండగలడు. కావున, ఓ గురుదేవా! అట్లు చేసి అనేకరత్నములకు ఆశ్రయమగు హిమవంతుని భూమియందు స్థిరముగా నుండునట్లు నీవు చేయుము (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 129 / Viveka Chudamani - 129🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 27. విముక్తి - 2 🍀*

425. బాహ్యమైన జ్ఞానేంద్రియ వస్తు సముదాయము నుండి స్వేచ్ఛను పొంది, బ్రహ్మములో కలసిపోయిన కేవలము ఇతరుల వలన ఇతరుల కొరకు మాత్రమే చిన్న పిల్లలవలె, నిద్ర మత్తులో ఉన్నవారి వలె ఈ ప్రపంచమును కలలో చూసినట్లు, ఆ క్షణములో లభించిన అవకాశమును విచారించును. అట్టి అసాధారణ వ్యక్తి మాత్రమే ఉన్నత స్థితి యొక్క ఔన్నత్య ఫలితములను అనుభవించగలడు. అట్టివాడే భగవంతునితో జీవించి ఈ జీవితమును ఉన్నతము చేయగలడు. 

426. ఏ సాదువైతే నిరంతర ప్రకాశమును కలిగి ఉన్నాడో అట్టి వ్యక్తి తన ఆత్మను పూర్తిగా బ్రహ్మములో చేర్చి అత్యున్నత ఆనందమును అనుభవించగలడు. కర్మల నుండి విముక్తి పొందగలడు. 

427. ఏవిధమైన మానసిక స్థితిలో ఆది బ్రహ్మాన్ని, ఆత్మను గుర్తించగలడో ఆ సమయములో అతడు పూర్తిగా పవిత్రుడై ఇతరమైన అడ్డంకులను తొలగించుకొని, ద్వంద్వ స్థితి నుండి భయటపడి పూర్తిగా బ్రహ్మము యొక్క జ్ఞానమును పొంది ప్రకాశిస్తాడు. ఎవరైతే ఈ స్థితిని ఖచ్చితముగా చేరుకుంటారో వారు పూర్తిగా జ్ఞాన ప్రకాశములో ఉండగలుగుతారు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 129 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 27. Redemption - 2 🌻*

425. Freed from all sense of reality of the external sense-objects on account of his always remaining merged in Brahman; only seeming to enjoy such sense-objects as are offered by others, like one sleepy, or like a child; beholding this world as one seen in dreams, and having cognition of it at chance moments – rare indeed is such a man, the enjoyer of the fruits of endless merit, and he alone is blessed and esteemed on earth. 

426. That Sannyasin has got a steady illumination who, having his soul wholly merged in Brahman, enjoys eternal bliss, is changeless and free from activity. 

427. That kind of mental function which cognises only the identity of the Self and Brahman, purified of all adjuncts, which is free from duality, and which concerns itself only with Pure Intelligence, is called illumination. He who has this perfectly steady is called a man of steady illumination.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 81 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 *సాధన- సమిష్టి జీవనము - 2* 🌻

పది మంది తోటి సాధకులతో కలసి పనిచేస్తున్నప్పుడు‌ పరస్పర సహకారముతో జీవించడం అలవాటవుతుంది. సమిష్టి జీవన మాధుర్యం ఆస్వాదనకు అందుతుంది. అయితే, ఈ సందర్భంలో సాధనకు‌ కొన్ని అవరోధాలు కూడా ఎదురవుతాయి. 

అతి పరిచయం వల్ల, అవజ్ఞాదృష్టి మనసులో చోటుచేసికొంటూ‌ ఉంటుంది. నాలుగుమార్లు‌ తోటివారికి మేలు చేయడంతో తాను అధికుడననే వికారం మొలకెత్తవచ్చు. దీని యెడల‌ జాగరూకత వహించాలి. 

అలాగే, తన మిత్రుల యెడల మొదట ఉన్న ఆప్యాయత, కాలం గడిచేకొద్దీ పరిమితమవవచ్చు. ఇతరుల యెడల వర్తించినట్లుగా‌ మిత్రుల యెడ కొందరు వర్తింపరు. ఉదాహరణకు, మనకు అవసరమైనప్పుడు ఋణమిచ్చి సాయం చేసిన, మన సహసాధకుడయిన మిత్రునికన్న ముందుగా, మనము ఇతరులు ఋణమిచ్చినవాళ్ళుంటే వాళ్ళకు ఋణము తీర్చుతూ ఉంటాము., 

ఇది నిజాయితీ కాదు. మనలను తిరిగి అడుగలేని మొగమాటము గల మిత్రులకు ముందు ఋణము తీర్చే మంచితనము‌ మనవద్ద ఉన్నప్పుడే, భగవంతుని దయ మనపై పనిచేస్తుంది. 

కొందరు సాధకులు తమకు మేలు చేసినవారు తమ తెలివిని, గొప్పను, అనుభవాన్ని గౌరవించి చేస్తున్నారని భ్రమించుతుంటారు. తమకు జరిగిన మేలుకు, గౌరవానికి ఎదుటివారి మంచియే కారణము. 

ఇంకో‌ సంగతి కొందరు సాధకులు తాము గొప్ప త్యాగమూర్తులమని పదిమందిలో ప్రసిద్ధి పొందాలనే తపనలో, కుటుంబము ఎడల‌ బాధ్యతలు కొంత విస్మరిస్తూ ఉంటారు దీన్నీ సర్దుబాటు చేసికోవాలి. కుటుంబము ఎడల ప్రత్యేక వ్యామోహము పనికిరాదంటే అర్థం, వారిని నిర్లక్ష్యం చేయమని కాదు. 

కుటుంబసభ్యులను, ఇతరులను గూడ అంతర్యామి స్వరూపులుగానే దర్శింపగలగాలి. ఎవరియెడలనయినా పరమప్రేమతో కర్తవ్యాలను‌ నెరవేర్చడం అభ్యాసం చేయాలి. 

అలాగే, సమిష్టి జీవనయాత్ర కొనసాగిస్తుండగా ఒక ‌ప్రదేశము నందు వసించు సాధకుల నడుమ అభిప్రాయ‌ భేదాలు వస్తుంటాయి. 

అభిప్రాయాలు మనోవికారాలు. ప్రేమ, హృదయ సంబంధి. తోటివారు మనతో విభేదించినంత మాత్రాన, వారితో మాట్లాడకపోవడం, అలుకపూనడం, ఇతరులతో వీరిని గూర్చి ఆరోపణ చేయడం సంకుచిత దౌర్భల్యం. ఇది సాధనకు అడ్డంకి అని గ్రహించాలి..

.......✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 70 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 70. CONTROL 🍀*

*🕉 Life is beyond your control. You can enjoy it, but you cannot control it. You can live it, but you cannot control it. You can dance it, but you cannot control it. 🕉*

Ordinarily we say that we breathe, and that's not true-life breathes us. But we go on thinking of ourselves as doers, and that creates the trouble. Once you become controlled, too controlled, you don't allow life to happen to you. You have too many conditions, and life cannot fulfill any. Life happens to you only when you are unconditionally accepting it; when you are ready to welcome it. Whatever form it takes. 

But a person with too much control is always asking life to come in a certain form, to fulfill certain conditions-and life doesn't bother; it just passes these people by. The sooner you break out of the confinement of control the better, because all control is from the mind, And you are greater than the mind. A small part is trying to dominate, trying to dictate. Life goes on moving, and you are left far behind, and then you are frustrated. The logic of the mind is such that it says, "Look, you didn't control it well, that's why you missed, so control more." 

The truth is just the-opposite: People miss many things because of too much control. Be like a wild river, and much you cannot even dream, cannot even imagine, cannot even hope, is available just around the corner, just within reach. But open your hand; don't go on living the life of a fist, because that is the life of control. Live the life of an open hand. The whole sky is available; don't settle for less. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 129 / Sri Lalita Sahasranamavali - Meaning - 129 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 129. అదృశ్యా, దృశ్యరహితా, విజ్ఞాత్రీ, వేద్యవర్జితా ।*
*యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా ॥ 129 ॥ 🍀*

🍀 649. అదృశ్యా - 
చూడబడనిది.

🍀 650. దృశ్యరహితా - 
చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.

🍀 651. విజ్ఞాత్రీ - 
విజ్ఞానమును కలిగించునది.

🍀 652. వేద్యవర్జితా - 
తెలుసుకొన బడవలసినది ఏమీ లేనిది.

🍀 653. యోగినీ - 
యోగముతో కూడి ఉంది.

🍀 654. యోగదా - 
యోగమును ఇచ్చునది.

🍀 655. యోగ్యా - 
యోగ్యమైనది.

🍀 656. యోగానందా - 
యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.

🍀 657. యుగంధరా - 
జంటను ధరించునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 129 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 129. Adrushyadrushyarahita vigynatri vedyavarjita
Yogini yogada yogya yoganandayugandhara ॥ 129 ॥

🌻 649 ) Adurshya -   
She who cannot be seen

🌻 650 ) Drusya rahitha -   
She who does not see things differently

🌻 651 ) Vignathree -   
She who knows all sciences

🌻 652 ) Vedhya varjitha -   
She who does not have any need to know anything

🌻 653 ) Yogini -   
She who is personification of Yoga

🌻 654 ) Yogadha -   
She who gives knowledge and experience of yoga

🌻 655 ) Yogya -   
She who can be reached by yoga

🌻 656 ) Yogananda -  
She who gets pleasure out of yoga

🌻 657 ) Yugandhara -   
She who wears the yuga (Division of eons of time)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment