వివేక చూడామణి - 129 / Viveka Chudamani - 129


🌹. వివేక చూడామణి - 129 / Viveka Chudamani - 129🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 27. విముక్తి - 2 🍀

425. బాహ్యమైన జ్ఞానేంద్రియ వస్తు సముదాయము నుండి స్వేచ్ఛను పొంది, బ్రహ్మములో కలసిపోయిన కేవలము ఇతరుల వలన ఇతరుల కొరకు మాత్రమే చిన్న పిల్లలవలె, నిద్ర మత్తులో ఉన్నవారి వలె ఈ ప్రపంచమును కలలో చూసినట్లు, ఆ క్షణములో లభించిన అవకాశమును విచారించును. అట్టి అసాధారణ వ్యక్తి మాత్రమే ఉన్నత స్థితి యొక్క ఔన్నత్య ఫలితములను అనుభవించగలడు. అట్టివాడే భగవంతునితో జీవించి ఈ జీవితమును ఉన్నతము చేయగలడు.

426. ఏ సాదువైతే నిరంతర ప్రకాశమును కలిగి ఉన్నాడో అట్టి వ్యక్తి తన ఆత్మను పూర్తిగా బ్రహ్మములో చేర్చి అత్యున్నత ఆనందమును అనుభవించగలడు. కర్మల నుండి విముక్తి పొందగలడు.

427. ఏవిధమైన మానసిక స్థితిలో ఆది బ్రహ్మాన్ని, ఆత్మను గుర్తించగలడో ఆ సమయములో అతడు పూర్తిగా పవిత్రుడై ఇతరమైన అడ్డంకులను తొలగించుకొని, ద్వంద్వ స్థితి నుండి భయటపడి పూర్తిగా బ్రహ్మము యొక్క జ్ఞానమును పొంది ప్రకాశిస్తాడు. ఎవరైతే ఈ స్థితిని ఖచ్చితముగా చేరుకుంటారో వారు పూర్తిగా జ్ఞాన ప్రకాశములో ఉండగలుగుతారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 129 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 27. Redemption - 2 🌻

425. Freed from all sense of reality of the external sense-objects on account of his always remaining merged in Brahman; only seeming to enjoy such sense-objects as are offered by others, like one sleepy, or like a child; beholding this world as one seen in dreams, and having cognition of it at chance moments – rare indeed is such a man, the enjoyer of the fruits of endless merit, and he alone is blessed and esteemed on earth.

426. That Sannyasin has got a steady illumination who, having his soul wholly merged in Brahman, enjoys eternal bliss, is changeless and free from activity.

427. That kind of mental function which cognises only the identity of the Self and Brahman, purified of all adjuncts, which is free from duality, and which concerns itself only with Pure Intelligence, is called illumination. He who has this perfectly steady is called a man of steady illumination.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


14 Sep 2021

No comments:

Post a Comment