మైత్రేయ మహర్షి బోధనలు - 16


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 16 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 10. ఆశ్రమమునకు దారి - 2 🌻


ఈ సమయమున గురు సందేశ మిట్లుండును. “నీ పై నీవు ఆధారపడుము. నా బోధనలను ఆధారముగ నీ కార్యములకు పునాదులు వేసుకొనుము. బుద్ధి యోగమున నిలబడి కార్యములు నిర్వర్తించుకొనుచుండవలెను. ప్రతి నిత్యము ఆత్మపరిశీలన చేసుకొనుచుండవలెను. నేను మార్గము చూపువాడనే కాని గమ్యమును కాను. ప్రతి చిన్న విషయమునకు నాకై ఎదురు చూడకుము. నీయందు నేనున్నాను కనుక నా యందు విశ్వసించి ముందుకు సాగుము” అని పలుకును. ఇట్లు స్వతంత్రముగ కార్యములను నిర్వర్తించమనుట, బాధ్యత నప్పగించుట.

సాధకుడు తన బాధ్యతను తా నంగీకరించి, “నేను” అను ప్రజ్ఞను ఆశ్రయించి గురువు ఆశీర్వచనములను ప్రతిదినము కోరి కార్యోన్ముఖుడు కావలెను. ఈ రెండవదశ యందలి స్వతంత్రత బాధ్యతతో కూడిన స్వతంత్రతయే కాని, స్వతంత్రించి పూర్వ వాసనల యందు జొరపడుటకాదు. మార్గమున నియమింప బడిన వాడు ముక్కుకు తాడువేసిన ఎద్దువలె పయనింపవలెను. అడ్డగోలుగ జీవించుటకు వీలుపడదు. తన కర్తవ్యమే తన మార్గముగ నిలచును.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


22 Oct 2021

No comments:

Post a Comment