నిర్మల ధ్యానాలు - ఓషో - 83
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 83 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషి ఏదో అయినవాడు కాడు. ఏదో కాబోయే వాడు. మనిషి మతతత్వాన్ని రూపాంతం చెందిస్తే ఏదో అవుతాడు. బుధ్ధుడు అవుతాడు. అప్పుడు అతను మనిషి కాడు. అప్పుడు అతను వారధి దాటుతాడు. 🍀
మనిషి జంతు ప్రపంచానికి దైవ ప్రపంచానికి మధ్య వారధి. మనిషి ఈ రెంటి మధ్య వున్నాడు. అతను దారిలాంటి వాడు. మనిషి నిజమైన ప్రాణి కాడు. సింహం ఒక రకమయిన ప్రాణి గులాబీ ఒక రకమయిన ప్రాణి. రాయి ఒక రకమయిన ప్రాణి. మనిషి కాడు. మనిషి ఏదో అయినవాడు కాడు. ఏదో కాబోయేవాడు. మనిషి మతతత్వాన్ని రూపాంతం చెందిస్తే ఏదో అవుతాడు. బుద్ధుడవుతాడు. అప్పుడు అతను మనిషికాడు. అప్పుడు అతను వారధి దాటుతాడు.
వారధిని దాటి వెళ్ళు. గుర్తుంచుకో. నీ యింటిని వారధి పై కట్టకు. అది సాగాల్సిన దారి. అది పరివర్తన చెందేది. అదే మనిషి సౌందర్యం. ఏ కుక్కా యింకొక కుక్క కన్నా వేరు కాదు. యింకో రాయిలాంటిదే ప్రతి రాయీ. అవి నిశ్చితమయిన ప్రాణులు. వాటిల్లో ఎదుగుదలకు ఏమీ అవకాశం లేదు. మార్పుకు వీలు లేదు.
కేవలం మనిషి మాత్రమే ఎదుగుతాడు. మనిషి ఒక్కడికే సాహసానికి అవకాశముంది. తెలియని దానిలోకి ప్రయాణించగలిగే సాహసం మనిషికే వుంది. తనని తను దాటి వెళ్ళగలిగేవాడు మనిషి ఒక్కడే. అది అసాధ్యమనిపిస్తుంది. ఆలోచిస్తే అసాధ్యమనిపిస్తుంది. కానీ ఒక పెద్ద గంతు వేస్తే. ఒక్కసారి దుముకితే సాధ్యమే. ఆలోచించే కొద్దీ అసాధ్యం. ఆ పెద్ద అంగ వెయ్యడానికి సాహసం కావాలి. సాధారణంగా 'ఒక పని చెయ్యడానికి రెండుసార్లు ఆలోచించు' అంటారు. నేను 'మొదట దుముకు. తరువాత నీ యిష్టమొచ్చినంత ఆలోచించు' అంటాను. రెండు సార్లు, మూడు సార్లు, ఇష్టమొచ్చినన్ని సార్లు ఆలోచించు. మొదట మాత్రం దుముకు!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
22 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment