మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 94


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 94 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 10 🌻


నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌.

కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు. అంతే! అంతకంటే ఇంకేమీ చేయలేదు. అన్న దానిలో సంకేతం ఇదే. మనం ధ్యానం చేసినా, అర్చన చేసినా, భగవంతుని మనం కోరవలసినదేమిటి? సారథిగా (భగవంతుని) కోరవలెను.

సారథియై హృదయంలో‌ ఉండి‌ మనలను నడిపించేవాడు ఆయనే. అయినను మన హృదయంలోకి వచ్చి, లోనికి కూర్చోమని అహ్వానించాలి. "శరీరం రథమేవచ" అని‌ పెద్దలు చెప్పారు కదా, ఈ శరీరం అనే రథం తెల్లని గుర్రములతో కూడిదనదవుతుంది.

అనగా ఇంద్రియములు శుద్ధములు,‌ స్వచ్చములు, నిష్కల్మషములు అవుతాయి. ఊభయ సైన్యాల మధ్య ఈ శరీరం అనే రథం జీవితం అనే భారతంలో నిలబడుతుంది.

వీళ్ళందరు నా‌ స్నేహితులు, వీళ్ళందరు నా చుట్టాలు, వీళ్ళతో యుద్ధం చేయగా వీళ్ళు చనిపోతే హింస కదా! కనుక యుద్ధం మంచిది కాదు..

.✍️. మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹


25 Oct 2021

No comments:

Post a Comment