మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 101


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 101 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 1 🌻


మానవ హృదయం అనేది ఆనాటికి ఆనాటికి మంచి అవుతుంది కాని చెడు అవ్వదు! Brain పాడైపోతే పాడయినవారు పిచ్చివారులాగా తిరగవచ్చుగాని హృదయం పాడవటం ఎవరికి ఉండదు. భౌతికమయిన గుండెకాయ గుండెజబ్బు వస్తే పాడవుతుంది కాని లోపల హృదయం పాడవటం అనేది ఉండదు. కనుక ప్రకృతి సహజంగా ఆనాటికి ఆనాటికి మంచి అభివృద్ధిని కలిగిస్తుంది.

మనలను మంచి వాళ్ళను చేసేటందుకు ప్రకృతి సృష్టి పరిణామమును ఇచ్చినది. ఇది మొదటి నుంచి ఉన్నదే. ఈ రకమైన లక్షణానికి పెద్దలు ఒక చక్కని పేరు పెట్టారు. దాని పేరే శివం. శివం అనగా శుభం. ఈ రోజు కంటే రేపు రేపటికంటే ఎల్లుండి అభివృద్ధి చెందేది. దానికో పేరు పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం అని దానినే శివం అన్నారు. ప్రతి హృదయమునందున్న శివుడు వారిని పవిత్రీకరణం చేస్తున్నాడు. ఈ రుద్రాభిషేకం జరిగే చోట చెప్పే ప్రార్థనా శ్లోకం మీకు గుర్తుండే ఉంటుంది.

"దేహూదేవాలయః ప్రోక్తః" దేహమే దేవుని యొక్క ఆలయము గాని మానవుడు ఉంటున్నది కాదు. మీరు అడుగవచ్చు. ఏమయ్యా ఈ దేహములో మనము ఉంటూ దేవుడిది అంటావేం అని కావలసి వస్తే ఆయన ఎవరు మన భార్య వెంటనే మన పేరు చెప్తుంది కాని దేవుడు పేరు చెప్పదు కదా! అనగా ఈ శరీరము మనం తెచ్చుకుందామంటే వచ్చింది కాదు. మనం పుడదామని Propose చేసి పుట్టింది కాదు. శరీరం తయారైన కొన్నాళ్ళకు మనం బయటకి వచ్చి మనం ఉన్నట్లు మనకి తెలియటం మొదలు పెడుతుంది. కనుక ఈ దేహము దేహాలయము అని తెలుసుకోవాలి.

..✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


09 Nov 2021

No comments:

Post a Comment