శ్రీ శివ మహా పురాణము - 472


🌹 . శ్రీ శివ మహా పురాణము - 472 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 34

🌻. అనరణ్యుడు - 4 🌻


రాజు లేకుండటచే పూజ్యులగు అమాత్యాదులు, రాజ పుత్రులు మరియు సేవకులు కూడా మూర్ఛను పొందిరి. ఈ వార్తను ఎరింగిన ఇతర జనులందరు నిట్టూర్పులను విడిచి దుఃఖించిరి (35). అనరణ్యుడు అడవికి వెళ్లి శంకరుని ఉద్దేశించి గొప్ప తపస్సును చేసి భక్తితో శివుని ఆరాధించి దుఃఖ రహితమగు శివలోకమును పొందెను (36). తరువాత ఆ రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు కీర్తిమంతుడు ధర్మబద్ధుడై ప్రజలను పుత్రుల వలె పాలించి రాజ్యము నేలెను (37).

ఓ పర్వత రాజా! అనరణ్యుడు కన్యను ఇచ్చి సర్వసంపదలను, వంశమును రక్షించుకున్న ఈ శుభ వృత్తాంతమును నీకు వివరించితిని (38). ఓ శైలరాజా! నీవు కూడా ఇదే తీరున కుమార్తెను శివునకు ఇచ్చి, కులమునంతనూ రక్షించుకొనుము. మరియు, దేవతల నందరినీ నీకు వశులగునట్లు చేసుకొనుము (39).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో అనరణ్య చరిత వర్ణనమనే ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Nov 2021

No comments:

Post a Comment