గీతోపనిషత్తు -273
🌹. గీతోపనిషత్తు -273 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 11-3
🍀 11-3. దైవానుగ్రహము - ఘన పురుష రూపమున పరమాత్మ తన ఎదుట నిలబడి స్వయముగ తనకు తానే ప్రకటించు కొనినను అర్జునునికి తెలియకపోవుట వలన, మనుష్య రూపమున నున్న దైవము తన విశ్వరూపమును గూడ చూపించవలసి వచ్చినది. అపుడు కూడ అర్జునుడు భయపడి, ఆ రూపము ఉపసంహరించమని, సుందరము మందహాస పూరితము అగు పూర్వ రూపమునే చూపమని వేడుకొనినాడు. దీనివలన తెలియవలసిన విషయ మొక్కటియే. దైవమును తెలుయుటకు దైవానుగ్రహ మొక్కటియే ఉపాయము. 🍀
అవజావంతి మాం మూఢా మానుషీం తమమాశ్రితమ్ |
పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11
తాత్పర్యము : సమస్త భూతములకు ఈశ్వరుడగు నన్ను మూఢులు తెలియలేకున్నారు. శరీరము ధరించి యున్నను కూడ నన్ను తెలియలేక అలక్ష్యము చేయుచున్నారు.
వివరణము : ఇతఃపూర్వము అవతారము ధరించినాడే గాని, ఇట్లు పరిపూర్ణముగ పురాణ పురుషుడు భూమిపై దిగుట ఏకైక ఘట్టము. అయినను గుర్తించిన వారు బహుకొద్ది మందే. గుర్తింపని వారు కోటానుకోట్లు. గుర్తింపక పోగ అవహేళన చేసినారు. అవమానింప జూచినారు. మాయా మోహమున బడి అతనిని తెలియలేక పోయిరి. తానే స్వయముగ శరీరము ధరించి వచ్చితినని పలికినను అర్జునుడు అంతంత మాత్రమే గుర్తించినాడు. ఇది అతి విచిత్రము.
ఘన పురుష రూపమున పరమాత్మ తన ఎదుట నిలబడి స్వయముగ తనకు తానే ప్రకటించుకొనినను అర్జునునికి తెలియకపోవుట వలన, మనుష్య రూపముననున్న దైవము తన విశ్వరూపమును గూడ చూపించవలసి వచ్చినది. అపుడు కూడ అర్జునుడు భయపడి, ఆ రూపము ఉపసంహరించమని, సుందరము మందహాస పూరితము అగు పూర్వ రూపమునే చూపమని వేడుకొనినాడు. దీనివలన తెలియవలసిన విషయ మొక్కటియే. దైవమును తెలుయుటకు దైవానుగ్రహ మొక్కటియే ఉపాయము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment