1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 09, మంగళ వారం, నవంబర్ 2021 భౌమ వారము 🌹
కార్తీక మాసం 5వ రోజు
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 27౩ 🌹
3) 🌹. శివ మహా పురాణము - 472🌹
4) 🌹 వివేక చూడామణి - 149 / Viveka Chudamani - 149🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -101🌹
6) 🌹 Osho Daily Meditations - 90🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 149 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 149🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ మంగళ వారం మిత్రులందరికీ 🌹*
*09, నవంబర్ 2021, భౌమ వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. కార్తీక మాసం 5వ రోజు 🍀*
నిషిద్ధములు: పులుపుతో కూడినవి
దానములు: స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము: ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము:
ఓం ఆదిశేషాయ స్వాహా
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్ ఋతువు,
కార్తీక మాసం
తిథి: శుక్ల పంచమి 10:37:02 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం : పూర్వాషాఢ 17:01:55 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ధృతి 12:05:48 వరకు
తదుపరి శూల
కరణం: బాలవ 10:39:02 వరకు
వర్జ్యం: 03:41:24 - 05:10:08 మరియు
24:34:00 - 26:04:48 ?
దుర్ముహూర్తం: 08:34:39 - 09:20:14
రాహు కాలం: 14:50:41 - 16:16:09
గుళిక కాలం: 11:59:45 - 13:25:13
యమ గండం: 09:08:50 - 10:34:18
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 12:33:48 - 14:02:32
సూర్యోదయం: 06:17:54
సూర్యాస్తమయం: 17:41:36
వైదిక సూర్యోదయం: 06:21:37
వైదిక సూర్యాస్తమయం: 17:37:54
చంద్రోదయం: 10:54:14
చంద్రాస్తమయం: 22:11:10
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: ధనుస్సు
మిత్ర యోగం - మిత్ర లాభం 17:01:55 వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం
పండుగలు : లాభ పంచమి, స్కంద షష్ఠి, సూర్య షష్ఠి
Labh Panchami, Soora Samharam
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -273 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 11-3
*🍀 11-3. దైవానుగ్రహము - ఘన పురుష రూపమున పరమాత్మ తన ఎదుట నిలబడి స్వయముగ తనకు తానే ప్రకటించు కొనినను అర్జునునికి తెలియకపోవుట వలన, మనుష్య రూపమున నున్న దైవము తన విశ్వరూపమును గూడ చూపించవలసి వచ్చినది. అపుడు కూడ అర్జునుడు భయపడి, ఆ రూపము ఉపసంహరించమని, సుందరము మందహాస పూరితము అగు పూర్వ రూపమునే చూపమని వేడుకొనినాడు. దీనివలన తెలియవలసిన విషయ మొక్కటియే. దైవమును తెలుయుటకు దైవానుగ్రహ మొక్కటియే ఉపాయము. 🍀*
*అవజావంతి మాం మూఢా మానుషీం తమమాశ్రితమ్ |*
*పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11*
*తాత్పర్యము : సమస్త భూతములకు ఈశ్వరుడగు నన్ను మూఢులు తెలియలేకున్నారు. శరీరము ధరించి యున్నను కూడ నన్ను తెలియలేక అలక్ష్యము చేయుచున్నారు.*
*వివరణము : ఇతఃపూర్వము అవతారము ధరించినాడే గాని, ఇట్లు పరిపూర్ణముగ పురాణ పురుషుడు భూమిపై దిగుట ఏకైక ఘట్టము. అయినను గుర్తించిన వారు బహుకొద్ది మందే. గుర్తింపని వారు కోటానుకోట్లు. గుర్తింపక పోగ అవహేళన చేసినారు. అవమానింప జూచినారు. మాయా మోహమున బడి అతనిని తెలియలేక పోయిరి. తానే స్వయముగ శరీరము ధరించి వచ్చితినని పలికినను అర్జునుడు అంతంత మాత్రమే గుర్తించినాడు. ఇది అతి విచిత్రము.*
*ఘన పురుష రూపమున పరమాత్మ తన ఎదుట నిలబడి స్వయముగ తనకు తానే ప్రకటించుకొనినను అర్జునునికి తెలియకపోవుట వలన, మనుష్య రూపముననున్న దైవము తన విశ్వరూపమును గూడ చూపించవలసి వచ్చినది. అపుడు కూడ అర్జునుడు భయపడి, ఆ రూపము ఉపసంహరించమని, సుందరము మందహాస పూరితము అగు పూర్వ రూపమునే చూపమని వేడుకొనినాడు. దీనివలన తెలియవలసిన విషయ మొక్కటియే. దైవమును తెలుయుటకు దైవానుగ్రహ మొక్కటియే ఉపాయము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 472 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 34
*🌻. అనరణ్యుడు - 4 🌻*
రాజు లేకుండటచే పూజ్యులగు అమాత్యాదులు, రాజ పుత్రులు మరియు సేవకులు కూడా మూర్ఛను పొందిరి. ఈ వార్తను ఎరింగిన ఇతర జనులందరు నిట్టూర్పులను విడిచి దుఃఖించిరి (35). అనరణ్యుడు అడవికి వెళ్లి శంకరుని ఉద్దేశించి గొప్ప తపస్సును చేసి భక్తితో శివుని ఆరాధించి దుఃఖ రహితమగు శివలోకమును పొందెను (36). తరువాత ఆ రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు కీర్తిమంతుడు ధర్మబద్ధుడై ప్రజలను పుత్రుల వలె పాలించి రాజ్యము నేలెను (37).
ఓ పర్వత రాజా! అనరణ్యుడు కన్యను ఇచ్చి సర్వసంపదలను, వంశమును రక్షించుకున్న ఈ శుభ వృత్తాంతమును నీకు వివరించితిని (38). ఓ శైలరాజా! నీవు కూడా ఇదే తీరున కుమార్తెను శివునకు ఇచ్చి, కులమునంతనూ రక్షించుకొనుము. మరియు, దేవతల నందరినీ నీకు వశులగునట్లు చేసుకొనుము (39).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో అనరణ్య చరిత వర్ణనమనే ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 149 / Viveka Chudamani - 149🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 31. ఆత్మ దర్శనం -4 🍀*
490. నేను చేసేవాడిని కాను, నేను అనుభవము పొందే వాడిని కాను. నేను మార్పులేని, ఏ కర్మలు చేయని, సారమైన, స్వచ్ఛమైన విజ్ఞానముతో తిరుగులేని శాశ్వతమైన ఆత్మను.
491. నేను నిజానికి చూసేవాని కంటే వేరుగాను, వినేవాడిని, చేసేవాడిని, అనుభవించేవాడిని కూడా కాదు. నేనువిజ్ఞానసారమును, శాశ్వతుడను, ఏవిధమైన అతుకు లేనివాడను, కర్మలకు దూరముగా దేనితో సంబంధములేని శాశ్వతాత్మను.
492. నేను ఇది కాదు, అది కాదు, నేను ఉన్నతుడను. నేను అన్నింటిని ప్రకాశింపజేయువాడను. నేను నిజమైన బ్రాహ్మణుడను, బ్రహ్మములో చరించువాడను. నేను కాక రెండవది లేదు. స్వచ్ఛమైన లోపల, బయట కాని శాశ్వతుడను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 149 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 31. Soul Realisation - 4 🌻*
490. I am not the doer, I am not the experiencer, I am changeless and beyond activity; I am the essence of Pure Knowledge; I am Absolute and identified with Eternal Good.
491. I am indeed different from the seer, listener, speaker, doer and experiencer; I am the essence of Knowledge, eternal, without any break, beyond activity, limitless, unattached and infinite.
492. I am neither, this nor that, but the Supreme, the illuminer of both; I am indeed Brahman, the One without a second, pure, devoid of interior or exterior and infinite.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 149 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 31. Soul Realisation - 4 🌻*
490. I am not the doer, I am not the experiencer, I am changeless and beyond activity; I am the essence of Pure Knowledge; I am Absolute and identified with Eternal Good.
491. I am indeed different from the seer, listener, speaker, doer and experiencer; I am the essence of Knowledge, eternal, without any break, beyond activity, limitless, unattached and infinite.
492. I am neither, this nor that, but the Supreme, the illuminer of both; I am indeed Brahman, the One without a second, pure, devoid of interior or exterior and infinite.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 101 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 1 🌻*
*మానవ హృదయం అనేది ఆనాటికి ఆనాటికి మంచి అవుతుంది కాని చెడు అవ్వదు! Brain పాడైపోతే పాడయినవారు పిచ్చివారులాగా తిరగవచ్చుగాని హృదయం పాడవటం ఎవరికి ఉండదు. భౌతికమయిన గుండెకాయ గుండెజబ్బు వస్తే పాడవుతుంది కాని లోపల హృదయం పాడవటం అనేది ఉండదు. కనుక ప్రకృతి సహజంగా ఆనాటికి ఆనాటికి మంచి అభివృద్ధిని కలిగిస్తుంది.*
*మనలను మంచి వాళ్ళను చేసేటందుకు ప్రకృతి సృష్టి పరిణామమును ఇచ్చినది. ఇది మొదటి నుంచి ఉన్నదే. ఈ రకమైన లక్షణానికి పెద్దలు ఒక చక్కని పేరు పెట్టారు. దాని పేరే శివం. శివం అనగా శుభం. ఈ రోజు కంటే రేపు రేపటికంటే ఎల్లుండి అభివృద్ధి చెందేది. దానికో పేరు పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం అని దానినే శివం అన్నారు. ప్రతి హృదయమునందున్న శివుడు వారిని పవిత్రీకరణం చేస్తున్నాడు. ఈ రుద్రాభిషేకం జరిగే చోట చెప్పే ప్రార్థనా శ్లోకం మీకు గుర్తుండే ఉంటుంది.*
*"దేహూదేవాలయః ప్రోక్తః" దేహమే దేవుని యొక్క ఆలయము గాని మానవుడు ఉంటున్నది కాదు. మీరు అడుగవచ్చు. ఏమయ్యా ఈ దేహములో మనము ఉంటూ దేవుడిది అంటావేం అని కావలసి వస్తే ఆయన ఎవరు మన భార్య వెంటనే మన పేరు చెప్తుంది కాని దేవుడు పేరు చెప్పదు కదా! అనగా ఈ శరీరము మనం తెచ్చుకుందామంటే వచ్చింది కాదు. మనం పుడదామని Propose చేసి పుట్టింది కాదు. శరీరం తయారైన కొన్నాళ్ళకు మనం బయటకి వచ్చి మనం ఉన్నట్లు మనకి తెలియటం మొదలు పెడుతుంది. కనుక ఈ దేహము దేహాలయము అని తెలుసుకోవాలి.*
..✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 90 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 90. FEAR OF DEATH 🍀*
*🕉 There is no need to be afraid if death. Death is going to come: that is the only certain thing in life. Everything else is uncertain, so why be worried about the certainty? 🕉*
Death is an absolute certainty. One hundred percent of people die-not ninety-nine percent, but one hundred. All the scientific growth and all the advances in medical science make no difference as far as people's deaths are concerned: one hundred percent of people still die, just as they used to die ten thousand years ago. Whoever is born, dies; there is no exception.
So about death we can be completely oblivious. It is going to happen, so whenever it happens it is okay. What difference does it make how it happens-whether you are knocked out in an accident or you just die in a hospital bed? It doesn't matter. Once you see the point that death is certain, these are only formalities-how one dies, where one dies. The only real thing is that one dies. By and by you will accept the fact. Death has to be accepted. There is no point in denying it; and nobody has ever been able to prevent it. So relax! While you are alive, enjoy it totally; and when death comes, enjoy that too.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 149 / Sri Lalita Sahasranamavali - Meaning - 149 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 149. వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ ।*
*ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ ॥ 149 ॥ 🍀*
🍀 776. వీరారాధ్యా :
వీరులచే ఆరాధింపబదునది
🍀 777. విరాద్రూపా : అన్నింటికీ మూలమైనది
🍀 778. విరజా :
రజోగుణము లేనిది
🍀 779. విశ్వతోముఖీ :
విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది
🍀 780. ప్రత్యగ్రూపా :
నిరుపమానమైన రూపము కలిగినది
🍀 781. పరాకాశా :
భావనామాత్రమైన ఆకాశ స్వరూపిణి
🍀 782. ప్రణదా :
సర్వజగత్తుకూ ప్రాణము ను ఇచ్చునది
🍀 783. ప్రాణరూపిణీ :
జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 149 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 149. Viraradhya viradrupa viraja vishatomukhi*
*Pratyagrupa parakasha pranada pranarupini ॥ 149 ॥ 🌻*
🌻 776 ) Veeraradhya -
She who is worshipped by heroes
🌻 777 ) Virad Roopa -
She who a universal look
🌻 778 ) Viraja -
She who does not have any blemish
🌻 779 ) Viswathomukhi -
She who sees through every ones eyes
🌻 780 ) Prathyg roopa -
She who can be seen by looking inside
🌻 781 ) Parakasa -
She who is the great sky
🌻 782 ) Pranadha -
She who gives the soul
🌻 783 ) Prana roopini -
She who is the soul.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment