🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 102 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. పరవశంగా వుండటమంటే కాంతివంతంగా వుండడమే. అప్పటికే జ్వాల అక్కడ వుంది. నువ్వేమి చేయాల్సిన పన్లేదు. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. అది నీలోనే వుంది. 🍀
పరవశంగా వుండటమంటే కాంతివంతంగా వుండడమే. అప్పటికే జ్వాల అక్కడ వుంది. నువ్వేమి చేయాల్సిన పన్లేదు. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. అది నీలోనే వుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పన్లేదు. నిశ్శబ్దంగా వుండు. నిర్మలంగా వుండు. అన్వేషించు. నువ్వు గుంపుగా వున్న ఆలోచనల గుండా. కోరికల గుండా ప్రయాణించాలి. కానీ ఆ గుంపు బయటి నించే కనిపించినంత పెద్దది కాదు. నువ్వు కొద్దిగా సందు చేసుకుని తలదూర్చాలి.
కానీ అది అందమైన ఆట. తమాషా ఆట. ధ్యానించడం వుల్లాసం కలిగించే ఆట. ఒకసారి కోరికల గుండా విశాలమయిన ఆకాశంలోకి అడుగు పెడితే నువ్వు జ్వాలని చూస్తావు. ఆ జ్వాల అనంత అస్తిత్వ జ్వాలలో భాగంగా చూస్తావు. ఆ జ్వాల నీలో వెలగడాన్ని చూస్తావు. అనంత విశ్వంలో చూస్తావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
30 Nov 2021
No comments:
Post a Comment