మైత్రేయ మహర్షి బోధనలు - 35


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 35 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 24. ఓర్పు 🌻

ఓర్పు, ఓర్పు, ఓర్పు! సాధకుని జీవితమున ఈ పదము అర్థరహితము కారాదు. ఓర్పునకు భూమియే గురువు. ఓర్పు వహించలేని సమయమున భూమిని చూసి మరల స్ఫూర్తి చెందవలెను. ఓర్పు లేనివారికి వాతావరణము నందలి దివ్యశక్తులు సహకారము నందించజాలవు. ఓర్పు గల వానికి కాల క్రమమున సమస్తము అనుకూలింప గలవు. సాధన యందు ఓర్పు వహించుటయే పెద్ద పరీక్ష, ఓర్పును కోల్పోయినచో సమస్తమును కోల్పోయెదవు. అనంత శక్తికి ముఖద్వారము ఓర్పుయే.

ఓర్పుతోనే నలుడు, హరిశ్చంద్రుడు, యుధిష్ఠిరుడు కోల్పోయిన వైభవమును తిరిగి పొందిరి. ఓర్పు వలన మూడు లోకముల యందు జయము లభింపగలదు. ఓర్పు గలవాడే నిజమైన బలవంతుడు. ఓర్పుతో నీ కందించిన సద్విషయములను నిర్వర్తించుచుండుము. మా సోదర బృందముతో పనిచేయుటకు వలసిన నేర్పు, ఓర్పు మాత్రమే.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


30 Nov 2021

No comments:

Post a Comment